NEWS

Formula E Car Race Case: ఈనెల 30 తర్వాత కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారా..! ఫార్ములా ఈ కారు రేస్ కేసులో స్వల్ప ఊరట

ktr Formula E Car Race Case: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసులో ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ- కారు రేస్‌ పోటీల్లో ఆర్ధిక లావాదేవీలు నిబంధనలు విరుద్దంగా జరిగాయంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్‌ను ఏ1గా చేర్చింది. ఏసీబీ పెట్టిన కేసును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరపు లాయర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఈనెల 30 తేది వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయడానికి వీల్లేదని ఏసీబీని ఆదేశించింది. అయితే దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతిచ్చింది. అదే విధంగా ఈకేసు విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం. ఈకేసు తుది విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. కేటీఆర్‌కు 10 రోజులు రిలీఫ్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌ ఫార్ములా ఈ-కార్ రేసు విషయంలో నిబంధనలు ఉల్లంఘించి నిధులు మంజూరు చేశారనే అభియోగాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈకేసులో ఎలాంటి మోసం జరగలేదని ఏసీబీ పెట్టిన కేసును కొట్టివేయాలని కేటీఆర్ తరపు లాయర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపైనే శుక్రవారం న్యాయస్థానం విచారణ జరిపింది. కేటీఆర్‌కు స్వల్ప ఊరటనిస్తూ తీర్పిచ్చింది. ఈనెల 30 తేది వరకు అరెస్ట్ చేయవద్దంటూ ఏసీబీని ఆదేశించింది. అయితే ఫార్ములా ఈ కారు రేసు కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని సూచించింది. ప్రభుత్వం కేటీఆర్ తరపు లాయర్ల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఈకేసు తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. దీంతో కేటీఆర్‌కు ఈకేసులో పది రోజుల పాటు రిలీఫ్ వచ్చినట్లైంది. సభలో అదే అంశంపై లొల్లి.. మరోవైపు శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంపై వాడి వేడి చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ పేరుతో దోచుకుంటే .. ఈ కార్ రేస్‌ పేరుతో ఎఫ్ఈవోతో కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించారని మండిపడ్డారు.దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖండించారు. గందరగోళం మధ్యే అసెంబ్లీ శనివారానికి వాయిదా పడింది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.