NEWS

64 సార్లు రక్తదానం చేసి.. ఎంతో మందిని ప్రాణాలను కాపాడిన యువకుడు..

Blood donar mahendhar reddi రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అంటూ ఇప్పటి వరకు అత్యంత అరుదైన ఓ నెగటివ్ గ్రూపు రక్తాన్ని 30 ఏళ్ల నుండి 64 సార్లు రక్తదానం చేసాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి.. ఇక ఇదే విషయంపై మహేందర్ రెడ్డి లోకల్ 18 పలకరించగా ఇలా చెప్పుకొచ్చాడు. తన చిన్నతనంలో మా తమ్ముడికి రక్తహీనత రావడంతో ప్రతిరోజు రక్తం ఎక్కివ్వాల్సిన అవసరం ఉండేది.. అప్పుడు ఆ రక్తం గురించి నేను పూర్తిగా తెలుసుకుని ఇలాంటివారు సమాజంలో ఎంతో మంది ఉన్నారు కాబట్టి. తనవంతుగా అప్పటినుండి రక్తదానం చేయడం జరిగిందన్నారు. రక్తదానం చేయడం వల్ల రోగి ప్రాణాలు కాపాడుదాం.. వారి కుటుంబాన్ని రక్షించిన వారని అవుతామని, భయం లేకుండా ప్రతి ఒక్కరు రక్తదానం చేసి చేసి ప్రాణదాతలుగా నిలవాలని బేతి మహేందర్ రెడ్డి లోకల్18కు వివరించారు.. ఇప్పటికి తను 64 సార్లు రక్తదానం చేయడం జరిగిందన్నారు.. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎవరికి అవసరం ఉన్నా రక్తదానం చేస్తున్నానన్నారు.. ఏ రాత్రి అయినా సొంత ఖర్చులతో కూడా హైదరాబాద్,చెన్నై, చుట్టుపక్కల జిల్లాలో అక్కడికి వెళ్లి రక్తదానం చేస్తుంటున్నానని తెలిపారు. రీసెంట్ గా కూడా జగిత్యాల జిల్లా మల్యాల మండలం కేంద్రానికి చెందిన అనుమల రాజేందర్ దంపతులకు 12 రోజుల క్రితం ఇద్దరు కవల పిల్లలు జన్మనిచ్చారు. వారిద్దరు తీవ్ర రక్తహీనత ప్రాణాపాస్థితిలో, కొట్టుమిట్టాడుతూ నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ నెగిటివ్ రక్తం అత్యవసరం కాగా తనకు ఫోన్ చేయడంతో రక్తదానం చేసి పిల్లల ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు. ఇలా ఎంతోమందికి ఆపద కాలంలో రక్తదానం చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు.. తనను దేవుడు ఆరోగ్యంగా ఉంచినన్ని రోజులు రక్తదానం చేస్తూనే ఉంటానన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలబడిన అంటూ బేతి మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే ఎవరికైనా ఎమర్జెన్సీ బ్లడ్ కావాలంటే తన నెంబర్ కు కాల్ చేయండి ఏ టైం అయినా ఎక్కడికైనా ఎప్పుడైనా, వచ్చి రక్తదానం చేస్తానని చెప్పారు..+9198851 02586.. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.