NEWS

Health Crisis: అయ్యో పాపం.. అరుదైన వ్యాధితో అల్లాడుతున్న చిన్నారి.. ట్రీట్‌మెంట్‌కు రూ.42 కోట్లు..

Newborn Health Crisis: పెళ్లితో ఒకటైన ప్రతి జంటకు తల్లిదండ్రులు అనిపించుకోవాలని ఉంటుంది. సంతాన భాగ్యం కోసం పూజలు చేస్తారు, తరచూ వైద్యులను సంప్రదిస్తుంటారు. పండంటి బిడ్డ జన్మించాక వారి సంతోషానికి అవధులు ఉండవు. ఇటీవలే లాస్ ఏంజిల్స్‌కు చెందిన అండలూసియా మెసా అనే మహిళకు కుమారుడు జన్మించాడు. కానీ ఈ సంతోషం ఆమెకు ఎంతో సేపు లేదు. బిడ్డ అరుదైన, తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో జన్మించాడని తెలిసి దుఃఖంలో మునిగిపోయింది. తీవ్రమైన ఇన్ఫెక్షన్: అండలూసియా సాధారణంగానే గర్భం దాల్చింది. బిడ్డ కోసం ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే డెలివరీ సమయంలో వైద్యులకు ఊహించని పరిస్థితి ఎదురైంది. బిడ్డ చర్మం ఊదా రంగులో ఉంది. ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. వెంటనే వైద్య బృందం శిశువును ఎమర్జెన్సీ వార్డ్‌కి తరలించారు. శిశువు ఊపిరితిత్తుల్లో ఫ్లూయిడ్స్‌(ద్రవం) ఉందని, దాని వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని తేలింది. పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో, వైద్యులు బిడ్డను రక్షించడానికి లైఫ్‌ సేవింగ్‌ ప్రొసీజర్లు నిర్వహించారు. * పెరుగుతున్న ఆందోళనలు రోజులు గడిచేకొద్దీ బిడ్డ పరిస్థితి మరింత దిగజారింది. చిన్నారికి కళ్లు తిరగడం ప్రారంభించాయి, కాళ్లు వణుకుతున్నాయి. స్ట్రోక్ వచ్చే సంకేతాలు కూడా కనిపించాయి. మెదడు పనితీరును కొలవడానికి అండలూసియా ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ (EEG) టెస్ట్‌ను సూచించింది. అయితే వైద్యులు మొదట్లో వెనుకాడారు. చివరకు ఏడు రోజుల వయస్సులో పరీక్ష చేసినప్పుడు, శిశువుకు ప్రతి 30 నిమిషాలకు మూర్ఛలు వస్తున్నాయని, మెదడు దెబ్బతింటుందని నిర్ధారణ అయింది. MRI స్కాన్‌ సహా తదుపరి టెస్టులు హెమీమెగాలెన్సెఫాలీ (HME) అనే అరుదైన మెడికల్‌ కండిషన్‌ ఉన్నట్లు వెల్లడించాయి. ఈ రుగ్మత మెదడును ఒక వైపు ప్రభావితం చేస్తుంది. ఇది క్రమేణా తీవ్రంగా మారుతుంది, దాని పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. * రిస్కీ సర్జరీ హెమిస్ఫెరోటమీ అనే కాంప్లెక్స్‌ సర్జరీ మాత్రమే పరిష్కారమని వైద్యులు అండలూసియాకు తెలియజేశారు. ఈ ప్రాసెస్‌లో మెదడులోని ప్రభావిత భాగాన్ని తొలగిస్తారు. కేవలం ఒక నెల వయస్సులో, శిశువుకు శస్త్రచికిత్స జరిగింది. దీంతో బిడ్డకు మూర్చ రావడం సగానికి తగ్గింది. అయితే సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. బిడ్డ కోలుకోవాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు వారాల తరబడి ఆసుపత్రిలో గడిపారు. ఆ తర్వాత మరొక సర్జరీ జరిగింది. శిశువు మూర్ఛలు ఇప్పుడు 5-6 వేర్వేరు మందులతో మేనేజ్‌ అవుతున్నాయి. అయితే ఇంకా సవాళ్లు మిగిలి ఉన్నాయి. బిడ్డ ఇప్పటికీ మూర్ఛలు, తల ఎత్తడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అండలూసియా తన బాధను పంచుకొంటూ, ‘బిడ్డ మునుపటి కంటే బాగున్నాడు. కానీ అతను ఇప్పటికీ ఇతర శిశువుల వలె లేదు. అతనికి సహాయం చేయడానికి మేము చేయగలిగినదంతా చేస్తున్నాం’ అని పేర్కొంది. * అరుదైన సమస్య హెమీమెగలెన్సెఫాలీ అనేది చాలా అరుదైన పరిస్థితి. ఇది MRI ద్వారా మాత్రమే బయటపడుతుంది. సాధారణంగా గర్భధారణ సమయంలో చేయరు. ట్రీట్‌మెంట్ ఖర్చు కూడా ఏకంగా 500,000 డాలర్లు (సుమారు రూ.42 కోట్లు) అవుతుంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, అండలూసియా, ఆమె కుటుంబం తమ బిడ్డ భవిష్యత్తుపై ఆశతో ఉన్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.