NEWS

KTR: మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ మరో కేసు నమోదు

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కేటీఆర్. KTR: ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ ఫెమా ఉల్లంఘన కింద మనీలాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది.ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్,బీఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసులు నమోదు చేసింది. ఒకటి తర్వాత మరొకటి.. ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈకేసులో నిబంధనలు ఉల్లంఘించి నిధులు మంజూరు చేసారనే అభియోగాలతో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈకేసు కొట్టివేయాలని కేటీఆర్ తరపు లాయర్ వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి అరెస్ట్ చేయవద్దంటూ ఏసీబీని ఆదేశింది. 10 రోజులు కోర్టు టైమిచ్చిన నేపథ్యంలో ఈడీ ఇదే వ్యవహారంపై కేసు నమోదు చేసింది.ఫేమా ఉల్లంఘన కింద మనీలాండరింగ్ కేసులు నమోదు చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ పోటీలు నిర్వహించిన సమయంలో కేటీఆర్ పురపాలకశాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆర్బీఐ అనుమతి లేకుడానే రూ.55 కోట్ల నగదును డాలర్లుగా మార్చి పంపినట్లుగా ఈసీఐఆర్ నమోదు చేసినట్లుగా ఈడీ వెల్లడించింది. అరెస్ట్ తప్పదా.. మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు అప్పుడు అప్పుడు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని కూడా ఈకేసులో చేర్చింది. ఏసీబీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకున్న ఈడీ అధికారులు ఫేమా ఉల్లంఘన కింద మనీలాండరింగ్ కేసులు నమోదు చేసింది. ఈడీ నమోదు చేసిన కేసులో కూడా కేటీఆర్ ఏ1, అరవింద్ కుమార్ ఏ2, బీఎల్ఎన్ రెడ్డిని ఏ3గా చేర్చింది. సభలో కూడా ఇదే రచ్చ.. మొత్తం రూ.55 కోట్ల రూపాయలను బదిలీ చేసిన యూకేకి చెందిన ఎస్‌నెక్స్ట్ పై కూడా కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారం శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం సృష్టించింది. గురువారం చర్చ జరపాలని పట్టుబట్టిన బీఆర్ఎస్ నేతలు..శుక్రవారం చర్చ జరగనివ్వకుండా అడ్డుపడటంతో సభ రెండు సార్లు వాయిదా వడింది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.