NEWS

IIT Madras: ఐఐటీ మద్రాసులో కొత్త కోర్సులు ప్రారంభం.. కొద్ది రోజులే సమయం..

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్, భారతదేశంలోని ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థలలో ఒకటి. 1959లో స్థాపితమైన ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విద్యా, శాస్త్రవేత్తలు, పరిశోధన రంగంలో విశేష గుర్తింపు పొందినది. IIT మద్రాస్ అత్యాధునిక సాంకేతిక పద్ధతులు, పరిశోధనా కార్యక్రమాలతో విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు అందిస్తుంది. ఇక్కడి విద్యా విధానం వ్యాపార, ఇంజనీరింగ్, సైన్సెస్, హ్యూమానిటీస్ విభాగాలను కలిగి ఉంటుంది. విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు IIT మద్రాస్ విస్తృత శాస్త్రీయ, సాంకేతిక వనరులను అందిస్తుంది. ఈ సంస్థ, ఇండస్ట్రీతో పటిష్టమైన సంబంధాలు కలిగి ఉండటం వలన, విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవాలు, పరిశోధనా అవకాశాలు, పరిశ్రమలో సులభంగా స్థిరపడే అవకాశాలను అందిస్తుంది. IIT మద్రాస్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన పూర్వ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఇంజనీరింగ్ నిపుణులు, వ్యవస్థాపకులుగా పనిచేస్తున్నారు. అయితే తాజాగా ఐఐటీ మద్రాస్ కొత్త కోర్సులు మొదలుపెడుతుంది. మద్రాసు ఐఐటీలో ఫైన్ ఆర్ట్స్, కల్చర్ ఎక్సలెన్స్ అండ్ గ్రాడ్యుయేట్ అనే ప్రోగ్రామ్ ప్రారంభిస్తుంది. ఇది 2025-26 విద్య సంవత్సరానికి తీసుకురానుంది. దేశంలో ఈ కొత్త ప్రోగ్రామ్స్ ప్రారంభించిన ఘనత సంపాదించింది. అలాగే ఈ ప్రోగ్రామ్‌నను అన్ని బీటెక్, బిఎస్ ప్రోగ్రామ్లకు రెండు సీట్లు చొప్పున కేటాయిస్తుంది. అందులో ఒక సీటు ప్రత్యేకంగా మహిళకు రిజర్వ్ చేశారు. ఈ కోర్సులు డిసెంబర్ 18న ఐఐటీ మద్రాస్‌లో ప్రకటించారు. అండర్ గ్రాడ్యుయేట్ ఫేస్ అడ్మిషన్ కోర్సు‌లో నైపుణ్యులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఐఐటీ మద్రాసు తన అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌లో ఒకటి ఈ ఫేస్ అడ్మిషన్ల ద్వారా భారత సంతతికి చెందిన వారికి అవకాశం కల్పిస్తుంది. ఈ అడ్మిషన్ కోసం అభ్యర్థులు ఐఐటీఎం(IITM), ఫేస్ అడ్మిషన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఐఐటీ మద్రాసులోని వివిధ విద్యా కార్యక్రమాలలో ప్రవేశానికి మాత్రమే ఈ ఫేస్ అడ్మిషన్ పోర్టల్‌ని ఉపయోగించాలి. ఈ కోర్సు ఏంటి? ఫైన్ ఆర్ట్స్, కల్చర్ ఎక్సలెన్స్ అండ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (Fine Arts, Culture Excellence and Graduate Program) అనేది ఒక ప్రత్యేకమైన విద్యా కార్యక్రమం, ఇది కళలు, సాంస్కృతిక ప్రతిభను ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం పై దృష్టి సారిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌లో విద్యార్థులు కళల పరంగా విస్తృతమైన అవగాహనను పొందుతారు, జ్ఞానం పెంచుకుంటారు. తమ సృజనాత్మకతను పెంచే అవకాశాలు పొందుతారు. ఈ ప్రోగ్రామ్ కళలు, నాట్యం, సంగీతం, చిత్రకళ, నాట్యశాస్త్రం, శిల్పకళ వంటి వివిధ కళాశాఖల్లో శిక్షణ ఇచ్చే ప్రత్యేక కోర్సులను కలిగి ఉంటుంది. విద్యార్థులు ఈ కోర్సులు ద్వారా కళలపై లోతైన అవగాహనను పొందుతారు. సాంస్కృతిక పరమైన ప్రతిభను అభివృద్ధి చేసుకుంటారు. ఈ ప్రోగ్రామ్‌తో విద్యార్థులు తమ కళా ప్రతిభను పెంచుకోవడం, నూతన కళల పద్ధతులను నేర్చుకోవడం, సాంస్కృతిక ప్రదర్శనలు, పరిక్షణలు చేయడం వంటి అనేక అవకాశాలను పొందుతారు. ఈ ప్రోగ్రామ్ కళా ప్రపంచంలో ఒక ప్రొఫెషనల్ కెరీర్‌ను ప్రారంభించడానికి సరైన మార్గాన్ని చూపిస్తుంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.