NEWS

Christmas Special : 200 ఏళ్ల నాటి చర్చి గోడలపై భగవద్గీత శ్లోకాలు.. ఎక్కడంటే?

200 ఏళ్ల పురాతన చర్చి Christmas Special : కాశీ.. బాబా విశ్వనాథుడి క్షేత్రం. ప్రఖ్యాత దేవాలయాల నగరంగా ప్రసిద్ధి. ఈ నగరంలోని దేవాలయాల మధ్య ఒక ప్రత్యేకమైన చర్చి కూడా ఉంది. ఇది దేవాలయం శైలిలోనే నిర్మించబడింది. ఈ చర్చికి తనదైన చారిత్రక ప్రాముఖ్యత ఉంది. బనారస్ కాంట్ ప్రాంతంలో ఉన్న ఈ చర్చి గోడలపై " భగవద్గీత గీత" శ్లోకాలు, “ఓం” ఆకారాలు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. కాశీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ఈ చర్చి, ఉత్తర భారతదేశంలోనే అత్యంత పురాతన ప్రొటెస్టంట్ చర్చి. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఇది ప్రత్యేకంగా నిర్మించబడింది. చర్చిలో దిగువ భాగం ఎనిమిది తామర పువ్వుల ఆకారంలో ఉండడం విశేషం. ప్రసిద్ధ ఆర్కిటెక్టులు కృష్ణ మీనన్, జ్యోతి షాహి ఈ చర్చిని రూపొందించారు. గోడలపై రాయబడిన గీత శ్లోకాలు, మత సమానత్వాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తాయి. సెయింట్ మేరీస్ చర్చి చరిత్ర సెయింట్ మేరీస్ చర్చి చరిత్ర 200 సంవత్సరాలకు పైగా ఉంది. బ్రిటిష్ పాలన సమయంలో, 1820లో దీనికి పునాది వేశారు. మొదట్లో చర్చి ఆకృతి చాలా చిన్నగా ఉండేది. తర్వాత, పునర్నిర్మాణం సమయంలో, ఈ చర్చికి ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చారు. ఇది అన్ని మతాలకు సమానత్వ సందేశాన్ని ఇస్తూ, ప్రత్యేకతను పొందింది. ఇక్కడ యేసుక్రీస్తు సందేశాలతో పాటు “హర హర మహాదేవ” వంటి కీర్తనలు కూడా వినిపించడం మత సామరస్యానికి నిదర్శనం. ఆదివారాల్లో ప్రజల రద్దీ అధికంగా ఉంటుంది. ఎందుకంటే వివిధ మతాలు, కులాలకు చెందిన వారు ఇక్కడ ప్రార్థన కోసం వస్తారు. క్రిస్మస్ వేడుకలు: ఓ ప్రత్యేక అనుభవం ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఈ చర్చి ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. ఈ వేడుకల సమయంలో చర్చి పరిసర ప్రాంతం జాతర వాతావరణాన్ని కలిగిస్తుంది. రంగురంగుల లైట్లతో ముస్తాబైన చర్చి చూడడానికి నగరం నలుమూలల నుంచి వేలాది మంది ఇక్కడకు వస్తారు. ఈ ప్రత్యేకమైన వేడుక 2-3 రోజుల పాటు సాగుతుంది. చర్చి అందాన్ని తిలకించడం, క్రిస్మస్ కరోల్స్ వినడం ప్రజలందరికీ ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ చర్చి గొప్పతనం, దాని గోడలపై కనిపించే గీత శ్లోకాలు, క్రీస్తు సందేశాలు మతాల మధ్య సమానత్వాన్ని చాటి చెప్పడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. కాశీకి చెందిన ఈ చర్చి భారతీయ సంస్కృతి, వాస్తు కళా చరిత్రకు అద్భుతమైన నిదర్శనం. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.