NEWS

Pak Cricketer: కోహ్లీ భార్యపై పాక్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే..!

Comments on Kohli Wife: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పేర్లు వినగానే అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం వస్తుంది. ఈ క్యూట్ కపుల్ ఎక్కడ కనిపించినా అందరి దృష్టి వారిపైనే ఉంటుంది. అయితే, ఈ జంటపై కొందరు చేసే ట్రోల్స్ మాత్రం హద్దులు దాటుతున్నాయి. ముఖ్యంగా విరాట్ ఆటతీరును అనుష్కతో ముడిపెడుతూ చేసే కామెంట్స్ చాలాకాలంగా కొనసాగుతున్నాయి. కోహ్లీ సరిగ్గా ఆడకపోతే, అనుష్కను నిందించడం చాలామందికి అలవాలుగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ పాకిస్థాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ అనుష్క శర్మ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?: క్రికెటర్ల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేయడంపై షెహజాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాపులర్ పాకిస్థానీ యూట్యూబర్ నదీర్ అలీ హోస్ట్ చేసిన పాడ్‌కాస్ట్‌లో అహ్మద్ షెహజాద్ మాట్లాడుతూ… “అనుష్క శర్మ అంటే అందరికీ గౌరవం ఉంది. అలాంటిది ఆమెను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కొందరు కావాలనే విరాట్ కోహ్లీని, అతని కుటుంబాన్ని విమర్శిస్తున్నారు” అన్నాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షెహజాద్ ఇంకా మాట్లాడుతూ… “భారత్‌లో కొందరు వ్యక్తులకు విరాట్ కోహ్లీ ఎదుగుదల ఇష్టం లేదు. అందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కుటుంబాలను కూడా ఇందులోకి లాగుతున్నారు” అన్నాడు. పాకిస్తాన్ క్రికెటర్ ఒకరు భారత క్రికెటర్ భార్యకు మద్దతుగా మాట్లాడటం విశేషం. ఈ సంఘటనతో ట్రోల్ చేసేవాళ్లకు గట్టి షాక్ తగిలినట్లయింది. * కోహ్లీ సక్సెస్‌లో అనుష్క రోల్ విరాట్ కోహ్లీ తన సక్సెస్‌కు అనుష్క శర్మనే కారణమని చాలా సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అహ్మద్ షెహజాద్ మరోసారి గుర్తు చేశాడు. “అనుష్కను పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని, ఆమె తనను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దిందని కోహ్లీ చాలాసార్లు చెప్పాడు. ఒక ఆటగాడు తన ఎదుగుదలకు, విజయానికి తన భార్య కారణమని స్వయంగా ఒప్పుకుంటే, ఆ విషయాన్ని మనం తప్పకుండా గౌరవించాలి.” అని షెహజాద్ చెప్పాడు. * కోహ్లీ ఫ్యామిలీ లండన్‌కు షిఫ్ట్? విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు తమ ప్రైవసీకి ఎంత ప్రాధాన్యమిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, మీడియా కన్ను ఎప్పుడూ వారిపైనే ఉండటంతో విసిగిపోయిన ఈ జంట సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ ఈ విషయాన్ని బయటపెట్టారు. కోహ్లీ, అనుష్క తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని లండన్‌కు మకాం మార్చాలని ఆలోచిస్తున్నారట. ఇండియాలో నిత్యం మీడియా ఫోకస్‌లో ఉండటం వల్ల పిల్లల పెంపకానికి ఇబ్బంది కలుగుతోందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్, కోహ్లీతో మంచి స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నాడు. కోహ్లీ తనకు గతంలో చాలా సహాయం చేశాడని షెహజాద్ స్వయంగా చెప్పడం విశేషం. తనకు కష్టకాలంలో కోహ్లీ అండగా నిలిచాడని, కేవలం మైదానంలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా సాయం చేశాడని షెహజాద్ తెలిపాడు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.