NEWS

Electric Scooter: ఈ బండి ధర భారీగా పెరిగిపోతుంది.. వెంటనే కొనేయండి.. లేట్ చేస్తే నష్టం మీకే..

మనదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఇది. అదే ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌ దీని ధరలు త్వరలో పెరిగిపోతున్నాయి. 2024 ప్రారంభంలో లాంచ్ అయిన ఈ స్కూటర్ ధరను 2025 జనవరి 1 భారీగా పెంచనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుత ధరల కంటే రూ.5,000 నుంచి రూ.6,000 వరకు ధర పెరిగే అవకాశం ఉందని డీలర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఏథర్ రిజ్టా ధర రూ.1.10 లక్షలు నుంచి రూ.1.46 లక్షల మధ్య ఉంది (ఎక్స్-షోరూమ్). అందువల్ల ధర పెరగడానికి ముందే మీరు ఈ స్కూటర్ కొంటే మీరు డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఏథర్ రిజ్టా బ్యాటరీ & రేంజ్: ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది అందులో ఎస్, జెడ్ (2.9 కిలోవాట్), జెడ్ (3.7 కిలోవాట్), రిజ్టా ఎస్ & జెడ్ (2.9 కిలోవాట్). ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 123 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుంది. రిజ్టా జెడ్ (3.7 కిలోవాట్) 159 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. 3.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. రిజ్టా 5.7 బీహెచ్‌పీ పవర్‌తో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 4.7 సెకన్లలో చేరుతుంది. అన్ని వేరియంట్లలో టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు వస్తుంది. ఫీచర్స్: ఫ్యామిలీ స్కూటర్‌గా ప్రత్యేకంగా రూపొందించబడిన ఏథర్ రిజ్టా, విస్తృతమైన సీటు, 34 లీటర్ల అండర్ సీటు స్టోరేజ్‌తో అందుబాటులో ఉంటుంది. 7 ఇంచ్ LCD స్క్రీన్, 7 ఇంచ్ TFT డిస్‌ప్లే ఉంది. ఈ స్కూటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, వాట్సాప్ నోటిఫికేషన్లు, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఇవే కాదు ఇంకా స్కిడ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి సాంకేతికతలను కూడా ఇందులో పొందుపరిచారు. ఈ ఏథర్ రిజ్టా ఇప్పటికే టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్ 1 ప్రో, బజాజ్ చేతక్ వంటి స్కూటర్లతో గట్టి పోటీ చేస్తున్నది. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా త్వరలో మార్కెట్‌లోకి రావడం వలన పోటీ మరింత పెరగనుంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.