NEWS

Forbes List: ప్రపంచంలోని పవర్‌ఫుల్‌ మహిళల్లో ఒకరు..ఈమె ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు!

Forbes List: ప్రపంచంలో చాలా మంది కెరీర్‌లో ఉన్నత స్థానాలు చేరుకుంటారు. భారీ సంపద కూడబెడతారు. కానీ కొద్ది మందే దానాలు, సేవలతో గుర్తింపు తెచ్చుకుంటారు. మన దేశానికి చెందిన కిరణ్ మజుందార్-షా (71), ఈ కోవకే చెందుతారు. ఆమె ఇటీవల ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 82వ స్థానంలో నిలిచింది. ఆమె భారతదేశ బయోటెక్నాలజీ విభాగంలో కీలక వ్యక్తి, ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరు. ఆమె బయోకాన్ ఫౌండర్‌, మేనేజింగ్ డైరెక్టర్‌. కిరణ్ సెల్ఫ్‌ మేడ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌. ఆమె తన ఇంటి గ్యారేజీ నుంచి 1978లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. నేడు రూ.28,835 కోట్ల (USD 3.4 బిలియన్లు) నెట్‌ వర్త్‌తో భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా గుర్తింపు పొందింది. బెంగళూరులో అత్యంత సంపన్న మహిళగా నిలిచింది. కిరణ్ మజుందార్-షా జీవితంలోని ఆసక్తికర అంశాల గురించి తెలుసుకుందాం. * ఎడ్యుకేషన్, కెరీర్ కిరణ్ మొదట్లో డాక్టర్ కావాలని కలలు కన్నారు. కానీ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందలేకపోయారు. దీంతో బెంగుళూరు విశ్వవిద్యాలయం నుంచి సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చదివారు. తరువాత మెల్‌బోర్న్ యూనివర్సిటీ నుంచి మాల్టింగ్, బ్రూయింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. దీంతో బయోటెక్నాలజీలో ఆమె ప్రయాణానికి నాంది పలికారు. ఆమె నాయకత్వంలో బయోకాన్ గ్లోబల్ బయోఫార్మాస్యూటికల్ దిగ్గజంగా ఎదిగింది. కంపెనీ మలేషియాలో ఆసియాలోని అతిపెద్ద ఇన్సులిన్ తయారీ ప్లాంట్‌లలో ఒకదాన్ని నిర్వహిస్తోంది. యూఎస్‌ మార్కెట్‌లోకి విజయవంతంగా విస్తరించింది. 2022లో బయోకాన్, యూఎస్‌ డ్రగ్‌మేకర్ వయాట్రిస్‌కి చెందిన బయోసిమిలర్స్ వ్యాపారాన్ని USD 3.3 బిలియన్లకు కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది. బయోటెక్ పరిశ్రమలో తన నాయకత్వాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. * కిరణ్ మజుందార్-షా దాతృత్వం కిరణ్ మజుందార్-షా, ఆమె దివంగత భర్త జాన్ షా సమాజ సేవకు ఎంతో కృషి చేశారు. 2019లో వారు గ్లాస్గో యూనివర్సిటీకి USD 7.5 మిలియన్లు (సుమారు రూ.63 కోట్లు) డొనేషన్ ఇచ్చారు. ఈ విరాళం పరిశోధనా కేంద్రాన్ని స్థాపించడానికి, ఆంకాలజీలో ప్రొఫెసర్‌షిప్‌ను క్రియేట్ చేయడానికి ఉపయోగపడింది. ఆమె మజుందార్ షా మెడికల్ సెంటర్‌ను కూడా స్థాపించారు. ఇది తక్కువ ధరకే క్యాన్సర్ కేర్ సర్వీస్ అందిస్తుంది. అవసరమైన వారికి ఆరోగ్య సంరక్షణను అందించేందుకు కిరణ్‌ ఈ సెంటర్‌ ప్రారంభించారు. * కిరణ్ మజుందార్-షా విజయాలు నాలుగు దశాబ్దాల కెరీర్‌లో, కిరణ్ భారతదేశంలోని రెండు అత్యున్నత పౌర గౌరవం సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1989లో పద్మశ్రీ, 2005లో పద్మభూషణ్ స్వీకరించారు. ఇటీవలే ఆమెకు ప్రతిష్ఠాత్మక జెంషెడ్‌జీ టాటా పురస్కారం దక్కింది. మన దేశంలో బయోసైన్సెస్‌ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించినందుకు ఆమెకు ఇండియన్‌ సొసైటీ ఫర్‌ క్వాలిటీ (ఐఎస్‌క్యూ) ఈ అవార్డును ప్రకటించింది. 2004లో ఐఎస్‌క్యూ ఈ అవార్డును ప్రారంభించింది. భారతీయ సమాజానికి గణనీయ సేవలు అందించిన వ్యాపార దిగ్గజాలను గుర్తించి ఐఎస్‌క్యూ ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. బెంగళూరులో ఏర్పాటు చేసిన ఐఎస్‌క్యూ వార్షిక కాన్ఫరెన్స్‌ 2024లో కిరణ్‌కు ఈ పురస్కారం అందించబోతున్నట్లు ప్రకటించారు. ఆమె బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక వ్యక్తులకు స్ఫూర్తినిచ్చారు. కిరణ్ మజుందార్-షా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి పట్టుదల, ఆవిష్కరణ, అంకితభావంతో కృషి చేశారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.