NEWS

విశాఖ బీచ్ రోడ్ లో డేంజర్ బెల్.. కోతకు గురవుతున్న సాగర తీరం..

విశాఖ బీచ్ రోడ్ లో డేంజర్ బెల్..! కోత గురవుతున్న సాగర్ తీరం
విశాఖలో మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు విశాఖ సాగర తీరం కోతకు గురవుతోంది. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈదురుగాలులు వీయడంతో పాటు కెరటాలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఫిషింగ్ హార్బర్ వద్ద రాళ్లను కెరటాలు బలంగా తాకుతున్నాయి. ఆర్.కె. బీచ్ తోపాటు మంగమారిపేట, భీమిలి బీచ్, ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. సాగర తీరం వెంబడి పలు చోట్ల సముద్ర కెరటాల తాకిడికి తీరం భారీ కోతకు గురైంది. ఆర్.కె.బీచ్‌లో పార్కులు సైతం ధ్వంసం అవుతున్నాయి. సాగర్ తీరంలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు వద్దకు నీరు చేరుకున్నాయి. మరో మూడు రోజులపాటు ఇలానే కొనసాగితే చెట్లు కూడా పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. డ్రెడ్జింగ్ పనులు చేసి ఇసుక తీసుకువచ్చి బీచ్‌లో వేస్తే ఎంతో బాగుంటుందని పర్యాటకులు, స్థానికులు అంటున్నారు. ఇలా బీచ్ కోతకు గురి కావడంతో పర్యాటకులు, స్థానికులు సైతం వాపోతున్నారు. ప్రభుత్వం పట్టించుకొని పార్కులను అభివృద్ధి చేయాలని అంటున్నారు. విశాఖపట్నం సాగర్ తీరం ఎప్పుడు తుఫాను వచ్చినా తీరం కోతకు గురవుతుంది. ప్రతిరోజు విశాఖవాసులు సాగర తీరానికి వస్తూ ఉంటారు. పార్కులోను ఆడుతూ ఎంజాయ్ చేస్తారు. కానీ తుఫాన్ వచ్చినప్పుడు అల్లా ఈ పార్కులన్నీ కూడా ధ్వంసం అవ్వడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టి పార్కులు కాపాడితే విశాఖపట్నం ఎంతో సుందరంగా ఉంటుందని అంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో బీచ్ కోతకు గురై పార్కులన్నీ కూడా ధ్వంసం అవుతున్నాయని అంటున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి పార్కుల అభివృద్ధి చేసినప్పటికీ బీచ్ కోతకు గురై డేంజర్‌గా మారడంతో ఇటు రావాలంటే భయంగా ఉందని అంటున్నారు. మరోవైపు పర్యాటకులు కూడా విశాఖ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. చల్లగా ఉంది సాగర్ తీరానికి వెళ్దామంటే ఎక్కడ చూసినా కోతకు రావడం భయాందోళన కలిగిస్తుంది. సుందర సాగర్ తీరం ఇలా కోతకు రావడంతో చాలా బాధాకరంగా ఉందని పర్యాటకులు సైతం అంటున్నారు. అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టి పార్కులు కాపాడితే టూరిస్టులకు చాలా బాగుంటుందని అంటున్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.