NEWS

Hari Hara: శ్రావణమాసంలో ఇలా చేస్తే ఆకాశమంత పుణ్యం!

hari hara శ్రావణమాసం అనగానే మనకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారిన దృశ్యాలు మనకు కనిపిస్తాయి. శ్రావణమాసంలోనే మిగతా మాసాలతో పోలిస్తే అధికంగా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో శ్రావణమాసం హరిహరులకు అనగా.. ఈశ్వరుడు,శ్రీ లక్ష్మీ సమేత శ్రీవెంకటేశ్వర స్వామి వార్లకు ప్రత్యేకంగా ఇష్టమైన మాసంగా చెబుతుంటారు. అయితే ఈ మాసంలో వారిని ఎందుకు పూజించాలి..వారికి పూజిస్తే ఎలాంటి ఫలాలు లభిస్తాయనే అంశాలపై లోకల్18 ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది. ఈ సందర్భంగా చక్రవర్తుల శ్రీనివాసచార్యులు లోకల్18తో మాట్లాడుతూ..శ్రావణ నక్షత్రం శ్రావణమాసం హరిహరులిద్దరికీ ఇష్టమైన మాసంగా మనం చెప్తుంటాం. శాస్త్రాలు కూడా చెబుతున్నాయనీ అన్నారు. అయితే అధికారులు ఇద్దరికి ఇష్టమైన మాసం కావడంతో ఈ మాసంలో పూజా కార్యక్రమాలు అభిషేకాలు.. చేస్తూ ఆరాధించడం ద్వారా మిగతా మాసాలతో పోలిస్తే ఈ మాసంలో అంటే శ్రావణమాసంలో పూజలు చేయడం ద్వారా అధికంగా పుణ్య ఫలాలు లభిస్తాయని అర్చకులు తెలిపారు. భక్తులు విశ్వాసంతో హరిహరులిద్దరిని పూజించడం ద్వారా అంతా మంచి జరుగుతుందని విశ్వాసంతో పూజా కార్యక్రమాలు చేస్తుంటారు. హరిహరలు ఇద్దరికీ ఇష్టమైన మాసం శ్రావణమాసం కావడంతో.. ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారుతున్నాయి. పరమేశ్వరునికి ఇష్టమైన అభిషేక పూజలతో పాటు శ్రీ లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చనలు, ప్రత్యేక పుష్పాలతో అలంకరణ, నైవేద్యాలు సమర్పించడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయని అర్చకులు చెబుతున్నారు. అనుకున్న పనులు వెనువెంటనే జరగాలన్న.. పనుల్లో ఆటంకాలు ఎదురైనా.. ముందు పూజ్యుడైన వినాయకుని పరమశివుని శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వాళ్ళను పూజించడం ద్వారా వెనివెంటనే విఘ్నాలు లేకుండా కార్యసిద్ధి లభిస్తుందని అర్చక స్వాములు వెల్లడించారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి హరిహర క్షేత్రంగా కూడా పిలుస్తారు. అనునిత్యం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.స్వామివారిని దర్శించుకునే హరిహరులను పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని అర్చక స్వాములు చెబుతున్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.