NEWS

Viral News: రోజూ 7 గంటలు నడిస్తే రూ.28,000, ఇతర బెనిఫిట్స్.. జాబ్ ఆఫర్ అదుర్స్ అంతే..

దిగ్గజ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ (Elon Musk) టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ వంటి సొంత కంపెనీలతో చాలామందికి ఉద్యోగాలు అందిస్తున్నారు. మస్క్ కంపెనీలో ఉద్యోగం చేయాలంటే చాలా ఎలిజిబిలిటీస్ ఉండాలని అంటారు. కానీ ఇటీవల మస్క్ చాలా తక్కువ అర్హతలతో హై-పేయింగ్ జాబ్స్ ప్రకటించారు. ఈ ఉద్యోగాలు ప్రస్తుతం చాలామంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఉద్యోగంలో చేరే వారు రోజూ ఏడు గంటలు నడిస్తే చాలు, మంత్లీ రూ.28,000 శాలరీ అందుకోవచ్చు. అంటే, గంటకు సుమారు రూ.4,000 అవుతుంది. ఈ ఉద్యోగంలో ఆఫీస్ వర్క్ ఏమీ ఉండదు. రోజూ నిర్ణీత సమయం నడవడమే పని! విచిత్రంగా అనిపిస్తుంది కదూ. మరి దీని గురించి తెలుసుకుందాం. ఈ ఉద్యోగంలో చేరితే ఆరోగ్య బీమా, దంత చికిత్స, డెంటల్, విజన్ కేర్, రిటైర్‌మెంట్ ప్లాన్ వంటి చాలా బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఈ కొత్త రకమైన ఉద్యోగానికి “డేటా కలెక్షన్ ఆపరేటర్” అని పేరు పెట్టారు. ఇందులో చేరిన వాళ్లు రోబోలకు నడక నేర్పించడంలో హెల్ప్ చేయాలి. ఇవి మనుషులలా కనిపించే రోబోలు. నడిచేటప్పుడు మోషన్ క్యాప్చర్ సూట్, కళ్లకు ఒక వర్చువల్ రియాలిటీ (VR) హెడ్‌సెట్‌ ధరించాలి. ఆ తర్వాత ఉద్యోగి ఎలా నడుస్తున్నారో చూసి రోబో కూడా అలాగే నడవడానికి నేర్చుకుంటుంది. వీళ్లు నడిచేటప్పుడు, శరీరం ఎలా కదులుతుందనే సమాచారాన్ని ఒక కంప్యూటర్‌లో సేకరిస్తారు. ఈ సమాచారాన్ని ఉపయోగించి రోబోలను మరింత మెరుగ్గా డెవలప్ చేస్తారు. ఈ ఉద్యోగంలో గంట నడిస్తే సుమారు రూ.4,000 క్రెడిట్ అవుతాయి. ముందస్తుగా చెప్పుకున్నట్లు ఉద్యోగులు రోబోలకు వాకింగ్ నేర్పించడానికి సహాయం చేయడమే కాదు, వాకింగ్‌కి సంబంధించిన డేటా కలెక్ట్ చేయాలి. ఆ డేటాను విశ్లేషించాలి. డేటాను విశ్లేషించిన తర్వాత, దాని గురించి ఒక రిపోర్ట్ రాయాలి. ఈ రిపోర్ట్‌లో రోబోలను మరింత మెరుగ్గా తయారు చేయడానికి ఏం చేయాలి అనే విషయాలు ఉంటాయి. టెస్లా ఈ జాబ్ ద్వారా ప్రాక్టికల్ ట్రైనింగ్, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలను కలిపి తన రోబోల సామర్థ్యాలను ఇంప్రూవ్ చేస్తుంది. * ఉద్యోగ అర్హతలు అప్లై చేసుకునే అభ్యర్థుల ఎత్తు 5 అడుగుల 7 అంగుళాల నుంచి 5 అడుగుల 11 అంగుళాల వరకు ఉండాలి. వర్చువల్ రియాలిటీ (VR) హెడ్‌సెట్‌ని ఎలా వాడాలి అనేది తెలుసుకోవాలి. 13.6 కిలోల బరువును ఎత్తగల శక్తి ఉండాలి. డేటాను ఎలా సేకరించాలి, ఎలా విశ్లేషించాలి, ఎలా రిపోర్ట్ రాయాలి అనేది తెలుసుకోవాలి. ఈ ఉద్యోగంలో గంటకు కనీసం 25.25 నుంచి 48 డాలర్ల వరకు సంపాదించవచ్చు. అంటే, రూ.2,120 నుంచి రూ. 4,000 వరకు సంపాదించవచ్చు. ఎంత అనుభవం ఉంది, ఎంత తెలివైన వాళ్లం అనే దానిపై జీతం ఆధారపడి ఉంటుంది. ఈ ఉద్యోగాలు ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లోనే అందుబాటులో ఉన్నాయి. ఇది ఒక ఫుల్ టైమ్‌ జాబ్ అని గమనించాలి. ఈ లింక్‌ పై క్లిక్ చేసి ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఇది నైట్ షిఫ్ట్ అని గమనించాలి. లింక్ పై క్లిక్ చేసి అప్లై చేసుకోవడం ద్వారా ఇదే జాబ్‌ను ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ చేసుకోవచ్చు. 8:00AM-4:30PM లేదా 4:00PM-12:30AM లేదా 12:00AM-8:30AM షిఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.