NEWS

Rain Effect: ఆ గ్రామంలో వర్షం పడితే చాలు మహిళలకు టెర్రర్.. ఈ కష్టం పగవాడికి కూడా రావొద్దు!

ఆ గ్రామంలో వర్షం పడితే చాలు మహిళలకు టెర్రర్.. ఈ కష్టం పగవాడికి కూడా రావొద్దు! ఈ ప్రాంతంలో వాగును దాటేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరితో పాటు గ్రామస్తులు మరి ఇబ్బంది పడుతున్నారు. వర్షం వచ్చినప్పుడు… ఈ వాగు వెంబడి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకు వెళ్లాల్సిందేనంటున్నారు. ఇంతకు ఆ వాగు ఏమిటి.. ఎక్కడ ఉంది..? ఆ విశేషాలు ఏంటో చూద్దాం పదండి మన లోకల్ 18లో. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తరిగోపుల గ్రామం ఉంది.బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన ఈ కాకులేరు వాగును దాటాలంటే ప్రాణాలను అరి చేతిలో పెట్టుకొని సాహసం చేయాల్సిందేనంటున్నారు ఆ ఊరు ప్రజలు.తరిగోపుల రైతన్న వాల్మీకి శేఖర్ ఈ సందర్భంగా లోకల్ 18తో మాట్లాడారు. దాదాపుగా ఈ వాగును దాటి రైతన్నలు 400 ఎకరాల పొలంను సాగు చేస్తూ ఉన్నారన్నారు.ఎక్కువగా వరి పంట మొక్కజొన్న, కందులు వంటి పంటలను, రైతులు సాగు చేస్తూ ఉన్నారు.ప్రతి రోజు రైతులు ఈ వాగు మార్గాన్ని వ్యవసాయం చేయాల్సి ఉంటుందన్నారు.కాబట్టి ఈ కాకులేరు వాగును దాటాలంటే మహిళలు పూర్తిగా భయాందోళన చెందుతూ ఉన్నారు. ఈ మార్గాన్ని వెళ్లి వ్యవసాయం చేయాలి కాబట్టి ఆ రోడ్డు మార్గాన్న ఎవరైనా వ్యవసాయం చేసే రైతన్నలు ఎద్దుల బండ్ల సహాయంతో ఈ కాకులేరు వాగును ఎద్దుల బండ్ల సహాయంతో మహిళలను ఈ వాగును దాటిస్తూ ఉంటారు.ఈ గ్రామంలో ఉన్న రైతన్నలు ఎన్నోసార్లు వారి బాధను అధికారులకు వ్యక్తపరిచిన వారు చెవిన వేసుకోలేకపోతున్నారు. ఎన్నోసార్లు స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ చేసినఎలాంటి ఉపయోగం లేకపోయిందన్నారు. జిల్లా కలెక్టర్ ని కలిసి కాకులేరు వాగును దాటాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.రైతన్నలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ కి విన్నవించిన ఎలాంటి ఉపయోగం లేకపోయిందన్నారు. అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు, అపోజిషన్ లో ఉన్న పార్టీ నాయకుల దగ్గరికి వెళ్లిన, రైతులకు మాత్రం ఎలాంటి న్యాయం జరగట్లేదన్నారు. ప్రభుత్వాలైతే మారుతూనే ఉన్నాయి కానీ రైతులకు మాత్రం న్యాయం జరగట్లేదని వాపోతున్నారు.అధిక వర్షపాతం కురిసినట్లయితే ఈ దారిన వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. గతంలోవాగును దాటుతున్న సమయంలో రైతు ఎద్దుల బండి నీటి వేగానికి కొట్టుకుపోయిందన్నారు. అదృష్టవశాత్తుఅది గమనించిన అక్కడే ఉన్న రైతన్నల సహాయంతో ఎద్దులను, బండిని ఒడ్డుకు లాగడం జరిగిందన్నారు. ఇలా ప్రాణాలను పణంగా పెట్టి వాగును దాటాలంటే భయంగా ఉందని లోకల్ 18తో మెురపెట్టుకున్నారు. ఇప్పటికైనా అధికారులు రైతులను దృష్టిలో ఉంచుకొని ఈ కాకులేరు వాగు దగ్గర బ్రిడ్జిని నిర్మిస్తారని తమ ఆశభావం వ్యక్తం చేశారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.