NEWS

Scheme: మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జస్ట్ రూ.1000లతో లక్షలే లక్షలు.. సూపర్ స్కీమ్

పట్టణ, గ్రామీణ ప్రాంతాల పేద అలాగే మధ్య తరగతి కుటుంబాలకు ఇదే శుభవార్త. కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఎన్నో పొదుపు పథకాలను ప్రవేశపెడుతోంది. అందులో ప్రధానంగా మహిళ సమాన్ సేవింగ్ ఖాతా ద్వారా 7.5% అత్యధిక వడ్డీ రేటు తో కనీసం రూ.1000ల నుండి రూ. 2 లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ 2 సంవత్సరాలు చేస్తే తిరిగి వడ్డీతో పొందవచ్చని లోకల్18 తో సూర్యాపేట డివిజన్ అసిస్టెంట్ పోస్టల్ కంభంపాటి ఆంజనేయులు తెలిపారు. పూర్తి వివరాల్లోకెళ్తే… సూర్యాపేట డివిజన్ అసిస్టెంట్ పోస్టల్ ఖమ్మంపాటి ఆంజనేయులు 15 సంవత్సరాలుగా పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఆయన తపాలా శాఖలో ప్రవేశపెట్టిన పొదుపు పథకంపై మాట్లాడుతూ.. మహిళల కొరకు ప్రత్యేకంగా రూపొందించిన పథకం మహిళా సమాన్ ఖాతా గురించి పలు విషయాలు చెప్పారు. మొదటగా ఈ ఖాతా ప్రారంభించేందుకు మహిళలు అర్హులని, ఆసక్తి కలిగిన వారు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒక పాస్పోర్టు ఫోటో తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయాలన్నారు. తరువాత స్తోమతకు తగ్గట్టుగా ఎంతైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో.. అంటే ప్రారంభం రూ.1000ల మినిమం స్టార్టింగ్ డిపాజిట్ అందుబాటులో ఉందన్నారు. ఇలా డిపాజిట్ చేసే అవకాశం రూ.2 లక్షల వరకు చేయవచ్చని తెలిపారు. దీని కాలపరిమితి వచ్చేసి గరిష్టంగా 2 సంవత్సరాల వరకు ఉంటుందని, 2 సంవత్సరాల తర్వాత 7.5% వడ్డీ రేటుతో కేంద్ర ప్రభుత్వం లబ్దిదారునికి మేలు చేకూరిస్తుందన్నారు. ఈ పథకం నిరుపేద కుటుంబం నుండి లక్షాధికారి వరకు అందరికీ అనుకూలంగా ఉంటుందన్నారు. మన జీవితకాలంలో ఎంతో కొంత డబ్బు వస్తూ పోతూ ఉంటుంది. అవసరమైనప్పుడు అప్పు కోసం అల్లాడిపోతూ ఉంటాం. డబ్బు లేక అత్యవసర సమయాల్లోప్రాణాలు పోగొట్టుకున్న వారు మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి మన కోసం మనమే పొదుపు చేసుకోవాలన్నారు. మన పిల్లల బంగారు భవిష్యత్ చదువులకు ఆరోగ్యం కొరకు మహిళా సమాన్ ఖాతా చాలా ఉపయోగపడుతుందని లోకల్ 18 న్యూస్ కి ఆయన తెలిపారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.