NEWS

Tollywood: ఆ పాపాల కారణంగానే.. సీఎం కొడుక్కి ఇంకా పెళ్లి కాలేదా..?

ఏంటీ సీఎం కొడుకా ఎవరు అని అనుకుంటున్నారా..? ఆయన మరెవరో కాదు నారా రోహిత్. చంద్రబాబు తమ్ముడి కొడుకు నారా రోహిత్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో నారా రోహిత్ కెరీర్ పూర్తిగా డౌన్ అయిపోయింది కానీ.. ఒకప్పుడు నారా రోహిత్ నుంచి సినిమా వస్తుందంటే హిట్టు సంగతి పక్కన పెడితే… కంటెంట్ మాత్రం చాలా కొత్తగా ఉండేది. ఆయన సినిమాలన్నీ ఒకసారి హ్యాపీగా చూసేయొచ్చు అనే లానే ఉంటాయి. అప్పట్లో ఒకడుండేవాడు, సోలో, ప్రతినిధి.. ఇలా కొత్త కొత్త కథలతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసేవాడు. చాలా కాలం గ్యాప్ తీసుకుని ఇటీవలే ప్రతినిధి 2 అంటూ ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ… రివ్యూలు మాత్రం పాజిటీవ్‌గానే వచ్చాయి. ఇక ప్రస్తుతం నారా రోహిత్… సుందరకాండ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఇంజనీరింగ్ కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్న సిద్దార్థ అలియాస్ నారా రోహిత్‌కు జుట్టుకు రంగేసుకునేంత ఏజ్ వస్తుంది. కానీ పెళ్లి మాత్రం కాలేదు. తనకు కాబోయే భార్యకు 5 క్వాలిటీస్ ఉండాలంటూ… పెళ్లిళ్లను రిజెక్ట్ చేస్తుంటాడు. ఇంతకీ ఆ 5 క్వాలిటీస్ ఏంటీ? హీరో పెళ్లి చేయడానికి తండ్రి నరేష్ పడే పాట్లేంటి అనేది తెరపైనే చూడాలి. మరోవైపు రఘుబాబు.. హీరోకు పెళ్లి కాకపోవడానికి కారణం ఆ పాపాలే. జీవితంలో అతని పెళ్లి కాదంటూ పెట్టిన సస్పెన్స్ సినిమాపై కాస్త క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. మొత్తంగా టీజర్ మాత్రం చాలా బాగుంది. సినిమాపై ఆడియెన్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం క్రియేట్ చేసేలా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఈశ్వర్ ఫేమ్ శ్రీదేవి, వృతి వాఘాని హీరోయిన్‌‌లుగా నటిస్తున్నారు. వెంకటేష్‌ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తుస్తున్న ఈ సినిమాను సంతోష్‌ చిన్నపోల్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేష్‌ మహంకాళి నిర్మిస్తున్నారు. ఇక టీజర్ లాంచ్ ఈవెంట్‌‌లో ‘ప్రతినిథి 2’ హిట్ అయ్యింది కదా? అని ఓ రిపోర్టర్ అనగా.. నారా రోహిత్ స్పందిస్తూ, ఎక్కడ హిట్ అయింది.. అసలు ఆ మూవీ వచ్చినట్టు కూడా గుర్తులేదు అంటూ నవ్వుతూ అన్నాడు. దాంతో ఆ రిపోర్టర్ మీరు సూపర్ .. మూవీ హిట్ అవ్వలేదని మీరే చెప్పేస్తున్నారు.. అని అన్నాడు. దానికి బదులుగా నారా రోహిత్.. అది కాదండి నా ఉద్దేశం.. నేను ఇలా అనకపోయినా .. హిట్ అయినా మళ్ళి వెళ్లి ప్లాప్ అనే రాసేస్తారు కదా.. మరి అలాంటప్పుడు నేనే ఫ్లాప్ అని చెప్పుకోవడం మంచిది అంటూ తెలిపాడు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.