NEWS

BAN vs PAK : పాకిస్తాన్‌కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

PC : X BAN vs PAK : పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు (PAK vs BAN) ఏదీ కలిసి రావడం లేదు. బిగ్ టోర్నీల్లో దారుణ వైఫల్యాలతో పాటు తాజాగా సొంత గడ్డపై కూడా అవమానకర పరాజయాలు ఎదురవుతున్నాయి. సొంతగడ్డపై బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. తన కంటే బలహీనమైన బంగ్లాదేశ్ చేతిలో ఓడిన పాకిస్తాన్ ను సొంత అభిమానులే విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్ కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు కారణమైన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-2027 పాయింట్స్ టేబుల్‌లో పాయింట్ల కోత విధించింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓవర్ రేట్ ను కొనసాగించలేకపోయింది. నిర్ణీత సమయానికి 6 ఓవర్లు తక్కువగా వేసింది. దాంతో పాకిస్తాన్ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల నుంచి 6 పాయింట్ల కోత విధించింది. అంతేకాకుండా పాక్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది. ప్రస్తుతం పాకిస్తాన్ 16 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతుంది. బంగ్లాదేశ్ కూడా స్లో ఓవర్ రేట్ ను ఎదుర్కొంది. నిర్ణీత సమయంలో 3 ఓవర్లు తక్కువ వేసిన బంగ్లాదేశ్‌కు మూడు పాయింట్స్ తగ్గించింది. అంతేకాకుండా ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. బంగ్లాదేశ్ 21 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ కంటే మెరుగైన స్థితిలో బంగ్లాదేశ్ ఉండటం విశేషం. ఇక భారత్ టాప్ లో ఉండగా.. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. మైదానంలో అభ్యంతరకరంగా ప్రవర్తించిన బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. ఆర్టికల్ 2.9 ప్రకారం.. సహచర ఆటగాళ్ల పట్ల అనుచితం ప్రవర్తించిన కారణంగా మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్‌పై షకీబ్ అల్ హసన్ బంతి విసిరేసాడు. ఉద్దేశపూర్వకంగానే అతనిపై బంతి విసిరేసాడని గుర్తించిన ఐసీసీ అతనిపై చర్యలు తీసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌ను 448/6 డిక్లేర్ చేసింది. మహ్మద్ రిజ్వాన్ (171*), సౌద్ షకీల్ (141) సెంచరీలతో సత్తాచాటారు. షోరిఫుల్, హసన్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 565 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముష్ఫికర్ రహీమ్ (191) తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. శద్మాన్ ఇస్లామ్ (93), మెహదీ హసన్ (77) రాణించారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.