NEWS

Crop Insurance: అకౌంట్లలోకి డబ్బులు.. రైతులు వెంటనే ఇలా చేయండి!

Crop Insurance, crops, crop compensation, farmers, bank account, బ్యాంక్ అకౌంట్, రైతులు, పంట బీమా, ఇన్సూరెన్స్ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం చేకూరి.. నష్ట పరిహారం అందలేదా ..ఏళ్ళు గడుస్తున్న మీకు ప్రభుత్వ సాయం కరువైందా అయితే వెంటనే మీ పరిధిలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్లి ఆధార్, పట్టా పాసు పుస్తకం, పాన్, మీ పొలంలో వేసిన పంట వివరాలు నమోదు చేసుకొంటే చాలు నష్టం వాటిల్లినప్పుడల్లా మీ అకౌంట్లో పరిహారం పడుతుంది వెంటనే త్వరపడండని బైరెడ్డిపల్లి మండల అగ్రికల్చర్ అధికారి గీతాకుమారీ న్యూస్ 18 ద్వారా తెలిపారు.మీ పొలంలో ఉద్యాన పంటలు ఏవి సాగు చేసిన ,కొన్ని అనివార్య కారణాలు సంభవించి పంట నష్టం చేకూరితే గతంలో సంబంధిత శాఖలు వచ్చి పంట నమోదు కార్యక్రమం చేసిన నష్ట పరిహారం అందకపోవడం మిన్నగా చూసాం.. కానీ ఇలాంటి లోపాలకు చెక్ పెట్టె విధంగా కొత్త విధానం రైతులకు పరిచయం చేస్తున్నారు..ఒక్కసారి పంట నమోదు కార్యక్రమం చేస్తే చాలు మన పొలంలో నష్టం వాటిల్లిన పంటలను పసిగట్టే టెక్నాలజీ వచ్చిందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన పంటల వివరాలు ఈ క్రాఫ్ ద్వారా నమోదు చేసుకోవాలని బైరెడ్డిపల్లి మండల అధికారినిగీతాకుమారీ న్యూస్ 18 ద్వారా కోరారు.బైరెడ్డిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో రైతులు పండించిన పంటలను పరిశీలించి, ఈ-క్రాప్‌ నమోదు వల్ల రైతులకు వ్యవసాయ పంట నష్ట పరిహారం, వ్యవసాయ రుణాలు పొందడంతో పాటు తాము పండించే పంటను అమ్ముకోవడానికి వెసులుబాటుపై అవగహన కూడ కల్పించారు. పంట నమోదు చేయకపోతే ప్రభుత్వానికి సంబంధించిన సబ్సిడీలు, రైతు భరోసా ఇన్సూరెన్స్ వర్తించవన్నారు.ఒక్కసారి నమోదు చేసుకొంటే చాలు మీ పోన్ నెంబర్ కి పూర్తి వివరాలు వ్యవసాయ శాఖ తరుపున వస్తాయన్నారు.సర్వే నెంబర్లు ,తదితర వివరాలు ఈ క్రాఫ్ లో కూడ పొందు పరచడం జరుగునన్నారు.ఉద్యాన పంటలైన పూలతో టలు, కాయకూరలు,తీగ జాతికి చెందిన మొక్కలు, సంవత్సరకాల పంటలు తదిర పంటలకు సబ్సీడీ ఇస్తున్నారు. పంట నమోదుకు కావాల్సి ధృవ పత్రాలు: ఆధార్ కార్డ్,పాన్ కార్డు, పట్టా పాసు పుస్తకం, బ్యాంక్ పాసు పుస్తకం, ఖాతా నంబర్లో ఉన్న సర్వే నoబర్స్ (1 బి), మొబైల్ నెంబర్ వీటిని తీసుకొని రైతు భరోసా కేంద్రానికి వెల్తే చాలు నిమిషాల వ్యవధిలో పూర్తి చేయడం జరుగును. చివరి తేదీ: సెప్టెంబర్ 10 లోపు నమోదు చేసుకోవాలని తెలిపారు.నమోదు చేసుకున్న వారికే లోన్స్,పంట రాయితీలు వర్తించునని తెలిపారు. నమోదు చేసుకొన్న సమయంలో తప్పులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.