NEWS

Gold Medal: ఒలింపిక్స్‌ గోల్డ్ మెడల్ విన్నర్‌కి బహుమతిగా గేదె.. అక్కడ అంతేగా అంతేగా..!

పారిస్‌ ఒలింపిక్స్‌లో అర్హద్‌ నదీమ్‌ జావెలిన్‌ త్రోలో పాకిస్థాన్‌కి గోల్డ్‌ మెడల్‌ అందించిన సంగతి తెలిసిందే. 92.97 మీటర్లతో ఒలింపిక్‌ రికార్డును బద్ధలుకొట్టి, ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యారు. ఇప్పుడీ పాకిస్థానీ అథ్లెట్‌కి చాలా బహుమతులు అందుతున్నాయి. తాజాగా నదీమ్‌కు తన మామ మహ్మద్‌ నవాజ్ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. స్థానిక సంప్రదాయం ప్రకారం.. తమ గ్రామంలో గౌరవానికి చిహ్నంగా భావించే గేదెను బహుమతిగా ఇచ్చాడు. ఇలాంటి బహుమతికి తమ సంప్రదాయాల్లో చాలా ప్రాముఖ్యత ఉందని నవాజ్‌ తెలిపారు. * నదీమ్‌ కుటుంబ నేపథ్యం పారిస్‌లో జరిగిన జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రాను వెనక్కి నెట్టి అర్హద్‌ నదీమ్‌ బంగారు పతకం గెలిచాడు. నవాజ్‌కు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో చిన్న కుమార్తె అయేషాతో నదీమ్‌ వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. స్థానిక మీడియాతో నవాజ్‌ మాట్లాడుతూ, నదీమ్‌ శిక్షణ ప్రారంభ రోజులను ప్రేమగా గుర్తుచేసుకున్నారు. గ్రామస్థులు, బంధువులు అతని శిక్షణ, అంతర్జాతీయ పోటీలకు నిధులు సమకూర్చినట్లు తెలిపారు. నవాజ్ కూతురితో ఆరేళ్ల క్రితం నదీమ్‌ పెళ్లి జరిగింది. నదీమ్ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుండేవాడు. పొలాల్లో జావెలిన్ త్రోయింగ్ ప్రాక్టీస్‌ చేస్తుండేవాడు. నదీమ్‌కు ఈ క్రీడపై ఉన్న ఆసక్తిని నవాజ్ మెచ్చుకున్నాడు. ఆ నమ్మకమే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు తీసుకొచ్చింది. నదీమ్ సాధించిన విజయాన్ని చూసి గర్వపడుతున్నానని నవాజ్ చెప్పారు. * స్వదేశానికి చేరుకున్న అర్షద్ నదీమ్ ఆదివారం తెల్లవారు జామున పాకిస్థాన్‌కు తిరిగి వచ్చిన నదీమ్‌కి ఘనస్వాగతం లభించింది. వేలాది మంది ప్రజలు అతడికి స్వాగతం పలకడానికి వచ్చారు. నదీమ్‌ కుటుంబ సభ్యులు, అభిమానులతో లాహోర్‌లో పండుగ వాతావరణం కనిపించింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌కి నదీమ్ విజయం చాలా కీలకం. పురుషుల జావెలిన్ ఈవెంట్‌లో 27 ఏళ్ల అథ్లెట్ స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం పాకిస్థాన్‌కు చారిత్రాత్మక క్షణం. అథ్లెటిక్స్‌లో ఆ దేశానికి తొలి ఒలింపిక్ పతకం ఇదే కావడం గమనార్హం. * పాక్‌లో ఇతర క్రీడలకు ఆదరణ పెరుగుతుందా? గ్రామీణ పంజాబ్‌లోని ఓ పేద కుటుంలో అర్హద్‌ నదీమ్‌ జన్మించాడు. మట్టి, ఇటుకతో నిర్మించిన ఇంట్లో పెరిగాడు. సరైన వసతులు, ఆహారం లేని రోజుల నుంచి ఒలింపిక్‌ పతక విజేత వరకు అర్హద్‌ నదీమ్‌ ప్రయాణం అద్భుతం. ఈ ప్రయాణం స్ఫూర్తినే కాదు పాకిస్థాన్‌లో ఉన్న క్రీడా సౌకర్యాలపై కూడా స్పష్టతను ఇస్తుంది. పరిమిత వనరుల కారణంగా గోధుమ పొలాల్లో ఇంట్లో తయారు చేసిన జావెలిన్‌లతో నదీమ్‌ శిక్షణ పొందాడు. క్రికెట్‌కి తప్ప మరో క్రీడకు పాకిస్థాన్‌లో ఆదరణ లేదని నదీమ్‌ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ పరిస్థితికి అద్దం పడుతాయి. జావెలిన్ త్రోలో అతడు సాధించిన విజయంతో పాక్‌లో ఇతర క్రీడలకు మద్దతు పెరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. * రెండో అత్యున్నత పురస్కారం అర్హద్‌ నదీమ్‌ అత్యత్తమ విజయానికి పాకిస్థాన్‌ రెండో అత్యున్నత పురస్కారం హిలాల్-ఇ-ఇమ్తియాజ్‌ అందుకోనున్నాడు. పాక్‌ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ నదీమ్‌కి పురస్కారం ఇస్తున్నట్లు ప్రకటించారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.