NEWS

Dolphins: డాల్ఫిన్స్ భూమిపై ఎంతసేపు బతుకుతాయో తెలుసా...?

అందమైన సముద్రజీవుల్లో డాల్ఫిన్స్ ఒకటి. వాటి శరీర నిర్మాణం నదులు, సముద్ర జలాల్లో నివసించడానికి అనుకూలంగా ఉంటుంది. జలాల్లో చురుకుగా గెంతుతూ కనిపిస్తుంటాయి. డాల్ఫిన్స్ చూడటానికి చేపల మాదిరిగానే కనిపించినా ఈ రెండిటి మధ్య అనేక తేడాలు ఉంటాయి. చేపల్లో రక్తం కోల్డ్‌గా ఉంటే డాల్ఫిన్స్‌లో వార్మ్(వేడి)గా ఉంటుంది. గాలి పీల్చుకోవడానికి చేపలకు మొప్పలు ఉంటే, డాల్ఫిన్స్‌కు బ్లోహోల్ ఉంటుంది. అయితే ఇవి కాసేపు నేలపై కూడా బతకగలవు. ఇంతకీ డాల్ఫిన్స్ ఎంతకాలం జీవిస్తాయో తెలుసుకుందాం. అంతరించిపోతున్న సముద్ర జీవుల్లో డాల్ఫిన్స్ ఒకటి. మానవులకు హాని చేయని ఈ క్షీరదాలు నీటిలో నుంచి బయటకు అంటే భూమి మీదకు వచ్చినప్పుడు వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. వీలైనంత త్వరగా నీటిలోకి చేరుకోకపోతే మరణించే రిస్క్ అధికంగా ఉంటుంది. మరణ కాలం అనేది డాల్ఫిన్ జాతి, వయసు, ఆరోగ్యం, పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. భూమి మీదకు వచ్చిన డాల్ఫిన్లను వెంటనే నీడలో ఉంచి, నీళ్లు పోసి రెస్క్యూ చేస్తే బతికే అవకాశం ఉంటుంది. * డాల్ఫిన్స్ ప్రత్యేకతలు డాల్ఫిన్స్ శరీర నిర్మాణం, అవయవాలు పూర్తిగా నీటిలో జీవించడానికి సౌకర్యవంతంగా ఉంటాయి. ఊపిరితిత్తులతో గాలి పీల్చుకోవడానికి శరీరం వెలుపల, తల భాగంలో వాటికి బ్లోహోల్ ఉంటుంది. ఇది శ్వాస తీసుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. డాల్ఫిన్‌లకు ఉండే మృదువైన చర్మం స్విమ్మింగ్‌ను సులభతరం చేస్తుంది. ఈ జీవుల చర్మానికి బ్లబ్బర్ పొర ఉంటుంది. చల్లటి నీటిలో ఇది ఇన్సులేషన్‌‌‌గా పనిచేస్తుంది. నీటిలో స్థిరంగా ఈదడానికి, వేగంగా కదలడానికి వాటి తోక భాగంలో ఉండే ఫ్లూక్స్, డోర్సల్ ఫిన్ అద్భుతంగా పనిచేస్తుంది. డాల్ఫిన్స్ రెక్కలు వాటి శరీరాన్ని బ్యాలెన్స్‌డ్ చేస్తాయి. * భూమిపై పొంచి ఉన్న ప్రమాదాలు డాల్ఫిన్‌లకు నీరు చాలా అవసరం. వాటి మనుగడ నీటి మీదే ఆధారపడి ఉంటుంది. సున్నితమైన చర్మం ఉండే డాల్ఫిన్స్ ఎక్కువసేపు బయట గాలికి గురైతే డీహైడ్రేషన్ బారిన పడవచ్చు. డాల్ఫిన్స్ శరీరం నీటిలో తేలికగా ఉంటుంది. భూమి మీద ఉన్నప్పుడు శరీరం బరువు వాటికి భారంగా అనిపిస్తుంది. ఇది శారీరక ఒత్తిడికి, అవయవ నష్టానికి దారితీస్తుంది. భూమిపై ఎక్కువ సమయం గడిపితే వాటి శరీరం వేడెక్కే ప్రమాదం కూడా ఉంటుంది. * కీలక కారకాలు డాల్ఫిన్స్ భూమిపై ఎంతకాలం వరకు జీవిస్తాయి అనే విషయంలో అనేక అంశాలు కీలకంగా మారుతాయి. ముఖ్యమైన కారకాల్లో డాల్ఫిన్ జాతులు ఒకటి. మనుగడ సమయాన్ని ప్రభావితం చేసే శారీరక అడాప్షన్ అనేది జాతుల ఆధారంగా వేర్వేరుగా ఉంటాయి. ఇక్కడ వయసు, ఆరోగ్యం కూడా కీలకమే. రోగం లేదా వయసు పైబడిన డాల్ఫిన్‌ల శారీరకంగా బలహీనంగా ఉంటాయి. ఇవి భూమిపై ఎక్కువ కాలం జీవించలేవు. పర్యావరణ పరిస్థితులు కూడా డాల్ఫిన్స్ మనుగడలో కీలకంగా మారుతాయి. వేడి, పొడి వాతావరణంలో అవి త్వరగా డీహైడ్రేట్, వేడెక్కుతాయి. చల్లని, తేమతో కూడిన పరిస్థితుల్లో వాటి మనుగడ సమయం కొద్దిగా పెరగవచ్చు. * గంటల్లోనే మరణం యుక్త వయసులో ఉండి, ఆరోగ్యంగా ఉన్న డాల్ఫిన్స్ భూమి మీద కేవలం కొన్ని గంటలు మాత్రమే జీవిస్తాయి. అదే రోగం వచ్చి, ముసలివైతే గంటలోపే వాటిని రెస్క్యూ చేయాలి. లేకపోతే మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.