NEWS

Viral: ‘ఆ రాశిలో పుట్టిన వారికి ఉద్యోగాలు ఇవ్వం’.. ఇదెక్కడి వింత రూల్ రా నాయనా..

ప్రతీకాత్మక చిత్రం చాలా మంది రాశిఫలాలు నమ్ముతారు, ముహూర్తాలను ఫాలో అవుతారు. కానీ ఓ కంపెనీ రాశిఫలాలు చూసి, రిక్రూట్‌మెంట్ చేపట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా? చైనాలో ఒక పాపులర్ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకొని వార్తల్లో నిలిచింది. ‘ఇయర్ ఆఫ్ ది డాగ్’ అనే ఒక చైనా రాశిలో జన్మించిన వ్యక్తులు తమ కంపెనీలో ఉద్యోగాలకు అప్లై చేయకుండా ఆ కంపెనీ బ్యాన్ చేసింది. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న శాంక్సింగ్ ట్రాన్స్‌పోర్టేషన్‌ కంపెనీ బాస్‌ ‘ఇయర్ ఆఫ్ ది డ్రాగన్’ అనే చైనీస్ రాశిలో జన్మించారు. అక్కడి నమ్మకాల ప్రకారం..డ్రాగన్, డాగ్ సైన్స్ పరస్పర వ్యతిరేకంగా ఉంటాయి. ఈ రెండు సంకేతాలు ఘర్షణ లేదా దురదృష్టాన్ని తెస్తాయని భావిస్తారు. చైనా రాశిచక్రం 12 సంవత్సరాల ప్యాటర్న్స్‌లో నడుస్తుంది. ప్రతి సంవత్సరాన్ని ఒక నిర్దిష్ట జంతువుతో గుర్తిస్తారు. * జాబ్స్‌కి అప్లై చేయొద్దు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్ట్‌ ప్రకారం, శాంక్సింగ్ ట్రాన్స్‌పోర్టేషన్‌ కంపెనీ 3,000 నుంచి 4,000 యువాన్ల (సుమారు రూ. 35,000- రూ.45,000) మధ్య నెలవారీ జీతాలను అందిస్తోంది. అయితే డాగ్ సైన్ రాశిలో జన్మించిన వారికి మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వీరు తమ కంపెనీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవద్దని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ రాశివారు బాస్ రాశికి వ్యతిరేకం కాబట్టి, కంపెనీకి దురదృష్టాన్ని తీసుకురావచ్చని భయపడుతున్నారు. ఈ విషయం గురించి కంపెనీ స్టాఫ్‌ మెంబర్‌ ఒకరు ‘హుబీ (Hubei) టెలివిజన్‌’తో మాట్లాడారు. రాశిచక్రాల నమ్మకాల ప్రకారమే ‘ఇయర్ ఆఫ్ ది డాగ్’లో జన్మించిన వారికి ఉద్యోగాలు ఇవ్వకూడదని కంపెనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇతర రాశుల్లో పుట్టిన వారికి అర్హతలు తక్కువగా ఉన్నా సరే, ఉద్యోగాలు ఇవ్వాడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. చైనాలో రాశిఫలాల నమ్మకాల ప్రకారం ప్రతి రాశికి మెటల్‌, వుడ్‌, వాటర్‌, ఫైర్‌, భూమి అనే ఐదు మూలకాల్లో ఏదో ఒకటి వర్తిస్తుంది. డ్రాగన్ సైన్, వాటర్‌తో సంబంధం కలిగి ఉంటుంది. అయితే డాగ్ సైన్ ఫైర్‌తో ముడిపడి ఉంటుంది. అందుకే ఈ రెండు వ్యతిరేక రాశుల్లో జన్మించిన వ్యక్తుల మధ్య విభేదాలు రావచ్చని కంపెనీ సిబ్బంది చెబుతున్నారు. కంపెనీ పాలసీ విమర్శలకు దారితీసినప్పటికీ, రాశుల ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంచుకోవడం చట్ట వ్యతిరేకం కాదని అక్కడి నిపుణులు వివరించారు. అయితే ఇది వివక్షగా పేర్కొన్నారు. * చాలా కాలంగా వివక్ష చైనా జాబ్ మార్కెట్‌లో రాశిచక్రం ఆధారిత వివక్ష చాలా కాలంగా ఉంది. ఉదాహరణకు, ఆగస్టు 23, సెప్టెంబరు 22 మధ్య జన్మించిన వారు కన్యారాశి కిందకు వస్తారు. వీరు చైనాలో ఉద్యోగాలు పొందడానికి చాలా కష్టపడాలి. ఈ రాశివారిలో చాలా మంది ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరిని ‘అన్‌ లక్కీ’గా గుర్తిస్తారు. ఎందుకంటే వారు ఏదైనా ఎంపిక చేసుకునే విషయంలో అతిగా ఆలోచిస్తారని భావిస్తారు. స్పాయిల్డ్‌, అబ్సెసివ్, కంపల్సివ్‌గా పేర్కొంటారు. హైయర్ వంటి కంపెనీలు కన్యారాశి వారికి అబ్సెసివ్- కంపల్సివ్ బిహేవియర్‌ ఉంటుందని, ధూళి చూసి కూడా భయపడతారని, అతిగా ఆలోచిస్తారి ఆందోళన వ్యక్తం చేశాయి. వీరి పర్ఫెక్షనిజం, ఇతరులను విమర్శించడానికి దారితీస్తుందని జ్యోతిషశాస్త్ర సైట్ NoDoor.comకి చెందిన ఫెలిసియా జియాంగ్ తెలిపారు. ఇది అతిశయోక్తిగా ఉండవచ్చని, అయితే దీన్ని సులభంగా గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఫెంగ్ షుయ్ సిద్ధాంతాల ప్రకారం, వ్యతిరేక రాశిచక్రం ఉన్న వ్యక్తులు కలిసి పని చేస్తే, వారు ఎనర్జీని బ్యాలెన్స్‌ చేయడానికి, వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌ని ఇంప్రూవ్‌ చేయడానికి లక్కీ ఛార్మ్స్‌ ఉపయోగించవచ్చు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.