మను భాకర్, నీరజ్ చోప్రా Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024) ముగిసింది. 16 రోజుల పాటు జరిగిన విశ్వ క్రీడలకు ఆగస్టు 11న శుభం కార్డు పడింది. 126 పతకాలతో అమెరికా తొలి స్థానంలో నిలిస్తే.. 91 పతకాలతో చైనా రెండో స్థానంలో నిలిచింది. ఇక 45 పతకాలు సాధించిన జపాన్ మూడో స్థానంలో నిలిచింది. 6 పతకాలతో భారత్ 71వ స్థానంలో నిలిచింది. టోక్యో 2020 ఒలింపిక్స్ లో భారత్ పతకాల పట్టికలో 48వ స్థానంలో నిలవగా.. ఈసారి మాత్రం ఆ స్థానం కంటే దిగువకు పడిపోయింది. ఇక ముగింపు వేడుకల సందర్భంగా భారత స్టార్ అథ్లెట్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, మహిళా షూటర్ మనూ భాకర్ మాట్లాడుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో మనుభాకర్, నీరజ్ చోప్రాలు సిగ్గుపడుతూ మాట్లాడుకుంటారు. దాంతో వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమని ఫోటో తీస్తున్న తన తల్లి సుమేధను మను భాకర్ వారించడం కూడా చర్చనీయాంశమైంది. అనంతరం నీరజ్ చోప్రాతో మను భాకర్ తల్లి సుమేధ మాట్లాడింది. అతనితో తలపై ఒట్టు వేయించుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. నీరజ్ చోప్రాతో సుమేధ ఏం మాట్లాడింది? ఎందుకు ఒట్టు వేయించుకుంది? అనే విషయాలపై కూడా నెటిజన్లు తమకు తోచినట్లు మాట్లాడుకుంటున్నారు. నీరజ్ చోప్రా, మను భాకర్ లు స్నేహితులా? లేక ఇద్దరి మధ్య రిలేషన్ ఉందా? అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. ‘నీరజ్.. నీ పెళ్లి ఎప్పుడు?’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. Neeraj Chopra and Manu Bhaker are talking to each other as if they have a crush on each other. I am getting wild ideas on getting India a couple of future super athletes. pic.twitter.com/KXsTZDGq8y Manu Bhaker’s Mother with Neeraj Chopra. pic.twitter.com/SDWbaWeOG7 టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా ఈసారి మాత్రం రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా 89.45 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. ఫైనల్లో పాకిస్తాన్ త్రోయర్ అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని సాధించాడు. ఇక మను భాకర్ విషయానికి వస్తే రెండు పతకాలతో మెరిసింది. మహిళల 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో, మిక్స్‌డ్ 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లలో కాంస్య పతకాలను సాధించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ నాలుగో స్థానంలో నిలిచింది. None
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
Featured News
Latest From This Week
జనవరి 10న సింహాచలంలో ఉత్తర ద్వార దర్శనం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Kajal Aggarwal: 'కన్నప్ప' సినిమా నుంచి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.