NEWS

map navigation: ఇంటర్నెట్ లేకపోయినా ఈ యాప్‌లో మ్యాప్‌ చూసుకోవచ్చు.. ఇంకెందుకు గూగుల్ మ్యాప్..

గూగుల్ మ్యాప్స్‌ గురించి తెలియని వారు ఎవరుంటారు. సిటీల్లో అయితే ప్రతి ఒక్కరి చేతిలో ఇది లేకపోతే ఎక్కడికి వెళ్తారో వాళ్లకే తెలియదు. ముఖ్యంగా బిజీ రోడ్స్‌లో, ట్రాఫిక్, తెలియని ఊర్లో బాగా ఉపయోగడుతుంది. గూగుల్ మ్యాప్ అనేది చాలా మంది ప్రజలు ప్రయాణంలో సులభతరం చేసుకోవడానికి ఉపయోగించే పాపులర్ టూల్. అయితే, ఈ గూగుల్ మ్యాప్‌ అనేక సందర్భాలలో తప్పుడు మార్గం చూపడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గూగుల్ మ్యాప్ అవరోధాలు, వాస్తవానికి ఖచ్చితమైన సమాచారం ఇవ్వకపోవడం, ఎప్పటికప్పుడు మారుతున్న రోడ్ల పరిస్థితులపై సరైన అప్‌డేట్లు ఇవ్వకపోవడం వంటి కారణాల వల్ల ఇప్పుడు చాలామంది ప్రయాణికులు మరొక నావిగేషన్ యాప్ కోసం వెతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, భారతీయ నావిగేషన్ యాప్ ‘Mappls Mapmyindia’ ఎంతో మంచి టైంలో గూరుల్ మాప్‌కి ప్రత్యామ్నాయంగా మారింది. ఈ యాప్ గూగుల్ మ్యాప్ కు బదులుగా ఉపయోగించడానికి చాలా తగినది. ఇది భారతదేశంలో అన్ని రకాల రోడ్ల గురించి, ట్రాఫిక్ పరిస్థితుల గురించి, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, స్థానిక రోడ్ల వివరాలు తదితరాలపై అప్‌డేట్‌లు అందిస్తుంది. Mappls Mapmyindia డేటాబేస్ అత్యంత ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి నిరంతరం అప్‌డేట్ అవుతుంది. ఈ యాప్ మరో ముఖ్యమైన లక్షణం అనేక భారతీయ భాషలలో పనిచేయడం. ఇందులో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బంగ్లా వంటి భాషలలో సహాయం అందిస్తుంది. ఇది దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల్లో నివసించే ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. భాషా అడ్డంకులు లేకుండా ఈ యాప్ ను ఉపయోగించడం చాలా సులభంగా ఉంటుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ యాప్ ఆఫ్‌లైన్ మ్యాప్‌ను అందిస్తుంది. మీరు గమ్యస్థానం చేరేందుకు అవసరమైన మ్యాప్‌ను ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, తద్వారా ఇంటర్నెట్ లేకపోయినా మీరు సులభంగా నావిగేట్ చేయవచ్చు. Mappls Mapmyindia యాప్ ISRO నావిక్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. నావిక్ (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్) ఒక భారతీయ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్. ఇది భారతదేశంలో అత్యంత ఖచ్చితమైన నావిగేషన్ సేవలను అందిస్తుంది. ఈ యాప్‌లో మీరు పోటోల్ ప్లాజాలు, పెట్రోల్ పంపులు, ATM లను కనుగొనవచ్చు. ఈ యాప్ ప్రతి ప్రయాణికుడి అవసరాలకు తగిన వివరాలను అందించడానికి నిరంతరం తన డేటాను అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. ఈ యాప్ నిజంగా గూగుల్ మ్యాప్‌కు సరైన ప్రత్యామ్నాయం కావచ్చు, ఎందుకంటే ఇది భారతదేశం గురించి అత్యంత ఖచ్చితమైన, విస్తృతమైన సమాచారాన్ని అందిస్తుంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.