NEWS

MeeSeva Mobile App: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక ఇంట్లోనుంచే ఆ పనులన్నీ చేసుకోవచ్చు!

MeeSeva Mobile App: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రతి రోజు సభ నిర్వహించి ఏడాది కాలంలో ప్రజలకు చేసిన మంచి, పథకాలను వివరిస్తోంది. దీంతో పాటు ప్రజలకు తీపి కబురు అందిస్తోంది. ఇందులో భాగంగా గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటో తెలుసుకుందాం. తెలంగాణ ప్రజలకు పౌరసేవలు మరింత దగ్గర అయ్యేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త మొబైల్ యాప్ ను ఆవిష్కరించనుంది. దీని ద్వారా పౌరులకు సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీసేవ మొబైల్ యాప్ ను ప్రారంభించనున్నారు. దీని ద్వారా ప్రజలకు ఇంటి వద్ద నుంచే పౌర సేవలు అందనున్నాయి. పౌరులకు అందే సేవలు మీ సేవ యాప్ ద్వరా ఇంటి నుంచే 150 రకాల పౌరసేవలను తెలంగాణ ప్రజలకు అందించనుంది. రద్దీగా ఉండే ప్రాంతాలైన మెట్రో స్టేషన్లు, షాపింగ్‌మాల్స్, సమీకృత కలెక్టరేట్లు తదితర ప్రాంతాల్లో ఇంటరాక్టివ్‌ కియోస్క్‌ ద్వారా ప్రజలు పౌరసేవలు పొందవచ్చు. మీసేవలో ప్రభుత్వం కొత్త సర్వీసులను సైతం చేర్చింది. టూరిజం హోటల్స్, ప్యాకేజీల బుకింగ్, దివ్యాంగుల గుర్తింపు కార్డులు, వృద్ధుల సంక్షేమ కేసుల పర్యవేక్షణ, సదరం సర్టిఫికెట్ల జారీ, పర్మిట్ల రెన్యూవల్, కొత్తవి జారీ చేయటం, వాల్టా చట్టం కింద చెట్ల తొలగింపు, తరలించేందుకు అనుమతులు మీసేవ సర్వీసుల్లో చేర్చింది. దీంతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండ ఇంటి వద్దనే సేవలను పొందవచ్చు. ఇంటింటికి ఇంటర్నెట్ తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చేందుకు ప్లాన్ రెడీ చేసింది. టీఫైబర్‌ పైలట్‌ ప్రాజెక్టు కింద తెలంగాణలోని మూడు జిల్లాల్లో ఒక్కో గ్రామంలో 4 వేల కుటుంబాలకు కేబుల్‌టీవీ సేవలతో కూడిన బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందించనుంది. అడవి శ్రీరాంపూర్ ( పెద్దపల్లి జిల్లా), సంగుపేట (సంగారెడ్డి జిల్లా), మద్దూర్‌ (నారాయణపేట జిల్లా)లలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. రూ.300 కే కనెక్షన్ దశల వారీగా రాష్ట్ర మెుత్తం ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ అందించనుంది. తెలుగు ఓటీటీలు కూడా వీక్షించే అవకాశం ఇంటర్నెట్ వినియోగించుకున్నందుకు ప్రతి కనెక్షన్ నుంచి రూ.300 వసూలు చేయనున్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.