NEWS

ఈ కార్యదర్శి.. ఆ పని కావాలంటే రూ.15 వేలు లంచం అడిగాడు.. చివరకు ఇలా..

Mdk-srd- 15000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన గ్రామ కార్యదర్శి గ్రామాల్లో సర్పంచులు లేకపోవడం వల్ల, కార్యదర్శులు తమ ఇష్టానుసారం పెత్తనం చెలాయిస్తున్నారు. గ్రామస్తులకు సర్టిఫికెట్లు అందించాలంటే డబ్బులు డిమాండ్ చేయడం రోజూ లాగే మారింది. అయితే, సంగారెడ్డి జిల్లాలో యువకుడొకడు న్యాయాన్ని ఆశ్రయించి, లంచగొండుకి బుద్ధి చెప్పిన ఘటన చోటు చేసుకుంది. లంచం కోసం డిమాండ్.. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మహాదేవపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమేష్, అదే గ్రామానికి చెందిన యువకుడి వద్ద నో డ్యూ సర్టిఫికెట్ కోసం రూ. 15,000 లంచం డిమాండ్ చేశాడు. ఆ యువకుడు బ్యాంక్ నుంచి ఫిష్ స్టాల్ కోసం లోన్ పొందడానికి సర్టిఫికెట్ అవసరం కావడంతో, గత 15 రోజులుగా కార్యదర్శి డబ్బులు అడుగుతూనే ఉన్నాడు. ఏసీబీ అధికారులను ఆశ్రయించిన యువకుడు.. లంచం డిమాండ్‌ను తట్టుకోలేని యువకుడు, ఏకంగా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు గ్రామ కార్యదర్శి ఉమేష్‌ను, రూ. 15,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన గ్రామస్థుల్లో చర్చనీయాంశమైంది. ఏసీబీ హెచ్చరిక.. ఈ ఘటనపై ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ, “ఎవరైనా అధికారులు లంచం అడిగితే తక్షణమే ఏసీబీ అధికారులను సంప్రదించండి. లంచాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇది వారి కుటుంబాల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయినా వారు తమ ప్రవర్తనను మార్చుకోవడం లేదు” అని అన్నారు. యువతకు సూచన.. గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లో ఇలాంటి లంచాల పరిస్థితి ఎదురైతే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డీఎస్పీ సూచించారు. ఏసీబీ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి, ఇలాంటి అవినీతిని అరికట్టడంలో ప్రతి ఒక్కరు ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ ఘటన, అవినీతి మీద నిరసనతో నిలబడిన యువతకు మార్గదర్శకంగా నిలుస్తోంది. తెలుగు వార్తలు / వార్తలు / తెలంగాణ / మెదక్ / ఈ కార్యదర్శి.. ఆ పని కావాలంటే రూ.15 వేలు లంచం అడిగాడు.. చివరకు ఇలా.. ఈ కార్యదర్శి.. ఆ పని కావాలంటే రూ.15 వేలు లంచం అడిగాడు.. చివరకు ఇలా.. Mdk-srd- 15000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన గ్రామ కార్యదర్శి గ్రామాల్లో సర్పంచులు లేకపోవడం వల్ల, కార్యదర్శులు తమ ఇష్టానుసారం పెత్తనం చెలాయిస్తున్నారు. గ్రామస్తులకు సర్టిఫికెట్లు అందించాలంటే డబ్బులు డిమాండ్ చేయడం రోజూ లాగే మారింది. మరింత చదవండి … 1-MIN READ Telugu Medak,Telangana Last Updated : December 8, 2024, 8:29 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Veera Babu Reported By : K Veeranna సంబంధిత వార్తలు గ్రామాల్లో సర్పంచులు లేకపోవడం వల్ల, కార్యదర్శులు తమ ఇష్టానుసారం పెత్తనం చెలాయిస్తున్నారు. గ్రామస్తులకు సర్టిఫికెట్లు అందించాలంటే డబ్బులు డిమాండ్ చేయడం రోజూ లాగే మారింది. అయితే, సంగారెడ్డి జిల్లాలో యువకుడొకడు న్యాయాన్ని ఆశ్రయించి, లంచగొండుకి బుద్ధి చెప్పిన ఘటన చోటు చేసుకుంది. లంచం కోసం డిమాండ్.. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మహాదేవపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమేష్, అదే గ్రామానికి చెందిన యువకుడి వద్ద నో డ్యూ సర్టిఫికెట్ కోసం రూ. 15,000 లంచం డిమాండ్ చేశాడు. ఆ యువకుడు బ్యాంక్ నుంచి ఫిష్ స్టాల్ కోసం లోన్ పొందడానికి సర్టిఫికెట్ అవసరం కావడంతో, గత 15 రోజులుగా కార్యదర్శి డబ్బులు అడుగుతూనే ఉన్నాడు. ప్రకటనలు ఏసీబీ అధికారులను ఆశ్రయించిన యువకుడు.. లంచం డిమాండ్‌ను తట్టుకోలేని యువకుడు, ఏకంగా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు గ్రామ కార్యదర్శి ఉమేష్‌ను, రూ. 15,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన గ్రామస్థుల్లో చర్చనీయాంశమైంది. ఏసీబీ హెచ్చరిక.. ఈ ఘటనపై ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ, “ఎవరైనా అధికారులు లంచం అడిగితే తక్షణమే ఏసీబీ అధికారులను సంప్రదించండి. లంచాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇది వారి కుటుంబాల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయినా వారు తమ ప్రవర్తనను మార్చుకోవడం లేదు” అని అన్నారు. ప్రకటనలు యువతకు సూచన.. గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లో ఇలాంటి లంచాల పరిస్థితి ఎదురైతే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డీఎస్పీ సూచించారు. ఏసీబీ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి, ఇలాంటి అవినీతిని అరికట్టడంలో ప్రతి ఒక్కరు ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ ఘటన, అవినీతి మీద నిరసనతో నిలబడిన యువతకు మార్గదర్శకంగా నిలుస్తోంది. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: Local News , Local18 , Local18 Telugu , N18 First Published : December 8, 2024, 8:29 pm IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.