NEWS

Essential Oils: దోమలను తరిమికొట్టే ఎసెన్షియల్ ఆయిల్స్.. ఇలా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు..!

Essential Oils: దోమ కాటుతో విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వీటి నుంచి తప్పించుకోవడానికి ప్రజలు మస్కిటో కాయిల్స్, రిపెల్లెంట్స్ వాడుతుంటారు. కానీ ఇవి మనుషులకే కాకుండా, పర్యావరణానికి కూడా చాలా హాని చేస్తాయి. అయితే దుష్ప్రభావాలు ఏమీ కలిగించకుండా దోమలను సహజం​గా తరిమికొట్టే ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్ కొన్ని అందుబాటులో ఉన్నాయి. అవే ఎసెన్షియల్ ఆయిల్స్. సాధారణంగా ఇవి మంచి సువాసనలు వెదజల్లుతూ మన మూడ్‌ను ఇంప్రూవ్ చేస్తాయి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. వీటితో పాటు ఇవి దోమలను కూడా దూరం చేయగలవు. * ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే? ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి మొక్కల నుంచి తీసే సుగంధ ద్రవాలు. వీటికి చాలా బలమైన వాసన ఉంటుంది. ఈ వాసన దోమలను గందరగోళానికి గురి చేస్తుంది. అందుకే ఈ నూనెలు రాసుకున్న వారిని అవి అంత తేలికగా గుర్తించలేవు. అరోమాథెరపీ నిపుణురాలు డా.బ్లోసమ్ కొచర్ ‘ఇండియా టుడే’తో మాట్లాడుతూ.. రసాయనాలతో చేసిన రిపెల్లెంట్ల కంటే ఇవి మన చర్మానికి చాలా మంచివని, ప్రకృతికి కూడా హాని చేయవని చెప్పారు. * దోమల్ని తరిమే ఎసెన్షియల్ ఆయిల్స్ లెమన్‌గ్రాస్ (Lemongrass) నుంచి తీసిన సిట్రోనెల్లా ఆయిల్ రాసుకుంటే ఒక్క దోమ కూడా కుట్టదు. దీనికి కొంచెం సిట్రస్ స్మెల్ ఉంటుంది. ఈ వాసన మన శరీరపు వాసనను దాచిపెట్టి, దోమలు మన దగ్గరకు రాకుండా చేస్తుంది. మార్కెట్లో లభించే చాలా రకాల మస్కిటో రిపెల్లెంట్స్‌లో ఈ సిట్రోనెల్ల ఆయిల్‌నే మెయిన్ ఇంగ్రిడియంట్‌గా ఉపయోగిస్తారు. యూకలిప్టస్, లెమన్‌గ్రాస్, పిప్పరమెంట్‌, టీ ట్రీ, లావెండర్ వంటి మరో కొన్ని ఆయిల్స్‌తో కూడా దోమల బెడద తగ్గుతుంది. వీటిలో లిమోనెన్, సిట్రోనెలోల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి నేచురల్ మస్కిటో రిపెల్లెంట్స్‌గా పనిచేస్తాయని శ్రీ బాలజీ యాక్షన్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌ (ఢిల్లీ)లో పనిచేస్తున్న సీనియర్ చర్మ వైద్య నిపుణులు డాక్టర్ విజయ్ సింఘల్ ఇండియా టుడేకి చెప్పారు. * మరిన్ని బెనిఫిట్స్, టీ ట్రీ, లావెండర్ వంటి కొన్ని రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ దోమ కుట్టినప్పుడు వచ్చే ఇబ్బందులను తగ్గిస్తాయి. టీ ట్రీ ఆయిల్ కుట్టిన చోట వాపు, రెడ్‌నెస్, దురదను తగ్గిస్తుంది. లావెండర్ ఆయిల్ చర్మాన్ని ప్రశాంతంగా చేసి, దురదను తగ్గిస్తుంది. పిప్పరమెంట్‌ ఆయిల్ చల్లదనాన్ని ఇచ్చి దురదను పోగొడుతుంది. * సేఫ్టీ టిప్స్ ఎసెన్షియల్ ఆయిల్స్‌ను నేరుగా చర్మానికి రాసుకుంటే చర్మం ఎర్రబడే అవకాశం ఉంది. అందుకే కొబ్బరి నూనె లేదా బాదం నూనె వంటి ఇతర నూనెలలో కలిపి వీటిని వాడాలి. ఈ మిశ్రమాన్ని దోమలు కుట్టిన చోట లేదా మణికట్టు, తొడ వంటి చోట్ల రాసుకోవచ్చు. వీటిని స్ప్రేలా మార్చుకొని కూడా వాడొచ్చు. అందుకు ఒక స్ప్రే బాటిల్‌లో 10-15 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్, వాటర్, కొంచెం విచ్ హేజెల్ లేదా వోడ్కా పోసి బాగా కలపాలి. బాగా షేక్ చేసి చర్మం లేదా బట్టలపై స్ప్రే చేయాలి. ఎసెన్షియల్ ఆయిల్‌ను ఇంట్లోని డిఫ్యూజర్‌లో పోయవచ్చు. కొన్ని కాటన్ బాల్స్‌పై కొన్ని చుక్కల ఆయిల్ పోసి, కిటికీలు, తలుపులు లేదా బయట ప్రాంతాలలో ఉంచవచ్చు. ఈ ఆయిల్స్‌ను నేరుగా చర్మానికి రాసుకునే ముందు, చిన్న ప్రాంతంలో ప్రయోగించి చూడాలి చర్మం ఎర్రబడితే వాడకూడదు. అయితే ఎసెన్షియల్ ఆయిల్స్ డెంగీ, మలేరియా వ్యాధులు ఎక్కువగా వ్యాపించే ప్రాంతాలలో పూర్తిగా రక్షణ ఇవ్వకపోవచ్చు. DEET, పికారిడిన్ లేదా IR3535 వంటి రసాయనాలు కలిగిన మందులు మాత్రమే ఇలాంటి ప్రాంతాల్లో రక్షణ కల్పిస్తాయి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.