NEWS

Krishna Ashtami: ఈ కృష్ణుడ్ని చూడటం అంత ఈజీ కాదు.. ఆ టాలెంట్ అందరికీ రాదు మరి!

ఈ కృష్ణుడ్ని చూడటం అంత ఈజీ కాదు.. ఆ టాలెంట్ అందరికీ రాదు మరి! శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కృష్ణాష్టమి వేడుకలు అమరాన్ అంటే విధంగా కొనసాగుతున్నాయి. కృష్ణాష్టమి వేడుకలలో చిన్నారులకు గోపికల వేషాలు అదేవిధంగా పిల్లలకు శ్రీకృష్ణుని వేషాలు వేయించి తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను శ్రీకృష్ణుని వలే పోలిస్తూ మురిసిపోతున్నారు. ఇందులో భాగంగా ఒక్క కళాకారిణి రూపొందించిన చిత్రం చూస్తే మాత్రం ఔరా అనాల్సిందే… కర్నూలు జిల్లా మంత్రాలయం మండలానికి చెందిన మనసాని నళిని అనే సూక్ష్మ కళాకారిని ఒక సెంటీమీటర్ పరిమాణంలో ఉండే శ్రీకృష్ణుని ప్రతిమను గీసే అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. వేడుక ఏదైనా ఆ వేడుకకు సంబంధించి చిత్రాలను గీయడం లేదా ప్రతిమలను గీయడం అలవాటుగా చేసుకున్న నలిని చిన్ననాటి నుంచే సూక్ష్మ కళలపై ఆసక్తి పెంచుకొని పెన్సిల్ మొక్కలు చాక్ పీస్ ముక్కలు వంటి చిన్న చిన్న వస్తువులపై దేవుళ్ళ విగ్రహాలను ఆలయాలను చిత్రీకరిస్తూ అందరికీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. గత తొమ్మిది సంవత్సరాలుగా తాను చదువుకునే సమయం నుంచి సూక్ష్మ కళలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఎన్నో సూక్ష్మ కళలను రూపొందించిన నళిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించారు. ఇందులో భాగంగానే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గ్రాఫైట్ పెన్సిల్పై ఒక సెంటిమీటర్ పొడవు, 8 మి.మీ. వెడల్పుతో కృష్ణుని చిత్రాన్ని 4గంటల్లో రూపొందించినట్లు మంత్రాలయానికి చెందిన సూక్ష్మ కళాకారుని నలినీ తెలిపారు. తనకు చిన్నప్పటి నుంచే కలలపై ఎంతో ఆసక్తి ఉండేదని ఇందులో భాగంగానే పెయింటింగ్ వేయడం ఇలాంటి బొమ్మలను తయారు చేయడం వంటి వాటిపై ప్రత్యేక ఆసక్తి ఉండేదని ఆ ఇష్టంతోనే సూక్ష్మ కళలపై శ్రద్ధ వహించి గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ సూక్ష్మ కళలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పెన్సిల్ రెడ్డి పై అతి చిన్న శ్రీకృష్ణుని ప్రతిమను రూపొందించినట్లు తెలిపిన నలిని. ఈ ఒక్క శ్రీకృష్ణుని ప్రతిమే కాకుండా అయోధ్యలోని రామ మందిరాన్ని సైతం చాక్ పీస్ ముక్కలతో రూపొందించినట్లు తెలిపారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.