NEWS

Cricket News: ఒక్క మ్యాచ్ ఆడ‌కపోయినా కోటి సంపాదించాడు.. ఎవ‌రా ల‌క్కీ ఫెలో..!

క్రికెట్‌కు భార‌త్‌లో ఉన్నంత క్రేజ్ మ‌రే దేశంలో ఉండ‌దు. క్రికెట్ ప్లేయ‌ర్ల‌ సంపాద‌న కోట్ల‌ల్లో ఉంటుంద‌ని అంద‌రికీ తెలుసు. ముఖ్యంగా మ‌న టీమిండియా ప్లేయ‌ర్ల సంపాదన మిగ‌తా దేశాల ప్లేయ‌ర్ల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ‌గా ఉంటుంది. దేశంలో సినిమా సెల‌బ్రెటీలు ఎంత ఫేమ‌స్సో.. క్రికెట‌ర్లు కూడా అంతే ఫేమ‌స్‌. అందుకే ఎన్నో ఇంట‌ర్నాష‌న‌ల్ కంపెనీల బ్రాండింగ్ కోసం క్రికెట‌ర్ల‌ను బ్రాండ్ అంబాజిడ‌ర్లుగా పెట్టుకుంటారు. మ‌నోళ్ల మ్యాచ్ ఫీజు కూడా భారీగా ఉంటుంది. ఐతే, ఇటీవ‌ల ఆసిస్‌తో ముగిసిన బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ ఆడ‌కుండానే ఓ ప్లేయ‌ర్‌ రూ.1.25 కోట్లు సంపాదించాడు. అత‌డే చ‌బ్బీ బాయ్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌. ఇత‌డితో పాటు మ‌రో ఇద్ద‌రు ప్లేయ‌ర్ల‌కు కూడా మ్యాచ్ ఆడ‌క‌పోయినా భారీగా న‌గ‌దు ల‌భించింది. అదెలా అంటే.. టెస్ట్ మ్యాచ్ ఆడిన ప్రతి ప్లేయ‌ర్‌కు బీసీసీఐ మ్యాచ్ ఫీజు కింద‌ రూ.15 లక్షలు చెల్లిస్తుంది. ప్లేయింగ్ 11లో చోటు ద‌క్క‌ని ప్లేయ‌ర్‌కు కూడా ఒక్క‌ మ్యాచ్‌కి రూ. 7.5 లక్షలు చెల్లిస్తారు. ఐతే, గతేడాది బీసీసీఐ మ్యాచ్ ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం, ఒక టెస్ట్ సీజన్‌లో 50 శాతం టెస్ట్ ఆడే సభ్యుడు రూ. 30 లక్షలు, నాన్ ప్లేయింగ్ ఎలెవెన్ మెంబర్‌కు రూ. 15 లక్షలు అందుకుంటారు. 75 శాతం మ్యాచ్‌లు ఆడే సభ్యుడు రూ.45 లక్షలు, ఆడని సభ్యునికి రూ. 22.5 లక్షలను బీసీసీఐ చెల్లిస్తుంది. ఇక‌,15 మంది టీమ్ స‌భ్యుల‌తో ఆసిస్‌కు వెళ్లిన భార‌త్‌.. కొంద‌రిని ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడించ‌కుండా డ్రెసింగ్ రూమ్‌కే ప‌రిమితం చేశారు. ఈ సిరీస్‌తో టెస్టులో అరంగేట్రం చేసిన‌ నితీష్‌ కుమార్‌ రెడ్డి రెండు మ్యాచ్‌లు ఆడి, ఒక సెంచ‌రీ కూడా చేశాడు. ఇక యంగ్‌స్ట‌ర్స్‌ దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, ప్రసిద్ధ్ కృష్ణలకు ఒక్కో మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. ఐతే, సీరిస్‌కు ఎంపికైన సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్‌, తనుష్ కోటియ‌న్‌లు.. బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ ముగ్గురికి ఆడే అవకాశం రాకపోయినా.. డబ్బు మాత్రం బాగానే సంపాదించారు. ఐదు మ్యాచ్‌లకు గాను.. ఒక్కో మ్యాచ్‌కు రూ.22.5 లక్షల ఫీజు ల‌భించ‌గా, స‌ర్ఫ‌రాజ్‌ మొత్తం రూ.1,12,50,000 సంపాదించాడు. ఈశ్వరన్ 50 శాతం మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నందున మ్యాచ్‌లకు రూ.15 లక్షల చొప్పున‌ రూ.75 లక్షలు అందుకుంటాడు. మరోవైపు, కోటియన్ కేవలం 2 మ్యాచ్‌లకు మాత్రమే జట్టులో భాగమయ్యాడు. కాబట్టి అతను ప్రోత్సాహక పథకం కిందకు రాడు. అందుకే ఒక్కో మ్యాచ్‌కు రూ.7.5 లక్షల చొప్పున, రూ.15 లక్షలు ల‌భిస్తాయి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.