NEWS

Sharwa37: శర్వానంద్ కొత్త సినిమా క్రేజీ అప్‌డేట్.. హీరోయిన్‌ను ఎత్తుకుని తిప్పుతూ...!

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. కలిసిరాకో, టైమ్ బాలేకో.. టైర్2 ప్లేస్‌లో ఉండిపోయాడు కానీ.. మనోడికి సరైన సినిమా పడితే నాని రేంజ్‌కు వెళ్లిపోయేవాడు. నిజానికి టాక్ ఎలా ఉన్నా సరే శర్వా సినిమాలను ఓ సారి హ్యాపీగా చూసేయోచ్చు అనే క్రేజ్ మాత్రం టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉంది. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త సీరియల్స్ రోల్స్ చేసిన.. శర్వా, ఆ తర్వాత మెల్లిమెల్లిగా కామెడీ డ్రామా సినిమాలు చేస్తూ అటు యూత్, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. గతకొంత కాలంగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఫేస్ చేస్తున్న శర్వానంద్‌కు రెండేళ్ల కిందట వచ్చిన ఒకే ఒక జీవితం మంచి బ్రేక్ ఇచ్చింది. మరీ ఆహా ఓహో అన్న రేంజ్‌లో నిర్మాతలకు భారీగా లాభాలు తెచ్చిపెట్టలేదు కానీ.. సేఫ్ జోన్‌లో మాత్రం నిలబెట్టింది. నిజానికి టాలీవుడ్‌లో ఉన్న బెస్ట్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ సినిమాల్లో ఒకే ఒక జీవితం సినిమా కూడా ఉంటుంది. దర్శకుడు కార్తిక్ ఈ సినిమాను చాలా ఇంట్రెస్టింగ్‌గా మరీ ముఖ్యంగా కన్విన్సింగ్‌గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా హిట్టు తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని శర్వా రీసెంట్‌గా మనమేతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చాడు. రిలీజ్‌ ముంగిట ఈ సినిమాపై ఆడియెన్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. తీరా రిలీజయ్యాక మాత్రం మిక్స్డ్ టాక్ రావడంతో యావరేజ్ హిట్టుగా నిలిచింది. ఇక ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. సామజవరగమన ఫేం రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో ఓ కామెడీ డ్రామా సినిమా చేస్తున్నాడు. కృష్ణాష్టమి సందర్భంగా బ్యూటీఫుల్‌ ట్యూన్‌తో హీరోహీరోయిన్ల ట్రాక్‌ ఒకటి విడుదల చేశారు. Team #Sharwa37 wishes everyone a very #HappyKrishnaJanmashtami . 𝐓𝐢𝐭𝐥𝐞 and 𝐅𝐢𝐫𝐬𝐭 𝐋𝐨𝐨𝐤 out soon. pic.twitter.com/dCAo6V87Z2 ఈ సినిమాలో ఏజెంట్‌ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీకి సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే… ఏజెంట్ సినిమాను, సామజవరగమన సినిమాను నిర్మించింది ఆయనే. ఇక మరోవైపు శర్వానంద్‌ అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో Sharwa 36లో కూడా నటిస్తున్నాడు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.