NEWS

Lakshmi Gold Coin: శ్రావణమాసంలో లక్ష్మీ కాసు కొంటున్నారా? అయితే మీరు నష్టపోయినట్టే

Lakshmi Gold Coin: శ్రావణమాసంలో లక్ష్మీ కాసు కొంటున్నారా? అయితే మీరు నష్టపోయినట్టే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఒక దేవాలయంగా ఉంటుంది. అందరూ ఆడవాళ్లు ఈ నెలలో మహాలక్ష్మీని విశేషంగా ఎవరికి వారు వారి భక్తిశ్రద్దలుతో అంకిత భావంతో ఎవరిస్థాయికి తగ్గట్టుగా వారు శ్రావణ శుక్రవారం వ్రతాన్ని సౌభాగ్యం కోసం, ధన కటాక్షం కోసం పూజిస్తుంటారు. అమ్మవారి చల్లని చూపు వారిపైన ఎల్లపుడు ఉండే విధంగా ప్రతి ఒక్కరు ఈ వ్రతం శ్రావణమాసంలో తప్పకుండా చేస్తారు. వ్రతం కోసం లక్ష్మీ బంగారు కాసుని కొని పూజించడం అందరి ఇళ్ళలో పరిపాటిగా ఉంటుంది. ఈ కాసు కొనడం లాభమా? నష్టమా? అనే విషయాలు శ్రీకాకుళానికి చెందిన అర్చకులు నరసింగ రావుశర్మమన లోకల్ 18తో చెప్పారు. ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వరలక్ష్మి పూజ అందరూ చేస్తారు. ఈ పూజ కోసం తప్పకుండా ఒక లక్ష్మిదేవి బంగారు కాసును ఎక్కువుగా మధ్యతరగతి మహిళలు వారు దాచుకున్న డబ్బులు ఐదు వేలు రూపాయలు నుండి గరిష్టంగా ఇరవై వేల రూపాయలు వరకు వారు ఈ బంగారం లక్ష్మీ కాసు కోసం ఖర్చు పెడతారు. కానీ ఈ కాసు కొనేటప్పుడు ఒక గ్రాము లక్ష్మీ కాసు కొన్నారు అనుకుంటే దాని రేటు 8000 వరకు ఉంటుంది. అందులో మేకింగ్ ఛార్జ్ తరుగు జీఎస్‌టీ, ముఖ్యంగా KDM రేటు కూడా కలిపి రూ.8,000 రూపాయలు వరకు ఉంటుంది. అదే 22 క్యారెట్ 1 గ్రామ్ గోల్డ్ రూ.7,100 ఉంటుంది. మనం కొన్న ఒక గ్రామ లక్ష్మి కాసు ఇచ్చి వాల్యూ కట్టమని ఆడిగేతే రూ.8,000 రూపాయలకు మీరు కొన్న కాసుని రూ.6,500 రూపాయలుగా లెక్క కట్టి మీకు ఇస్తారు. కానీ నేను రూ.8,000 పెట్టి కొన్నాను అపుడు బంగారం రేటుకంటే ఈ రోజు గ్రాముకు 500 రూపాయలు వరకు పెరిగింది. అయితే నాకు 8500 రూపాయలు రావాలి అని మీరు అనుకుంటే పప్పులో కలువేసినట్టే. ఎందుకు అనగా మీరు కొనేటప్పుడు మజూరి అనగా మేకింగ్ చార్జీలు KDM చార్జీలు మొదలగు వాటి నుండి అదనంగా తరుగు మీరు వాడినా వాడకపోయిన తీసివేయగా మీకు చివరకు మిగిలేది నష్టం మాత్రమే. వరలక్ష్మి పూజను ఆడవారు అందరూ సౌభాగ్యం కోసం చేస్తారు. లక్ష్మి కటాక్షము కోసం చేసే ఈ పూజలో ఆడంబరాలు దూరంగా ఉండాలి. లక్ష్మి అనగా బంగారం ఒక్కటే కాదు ధాన్యం, ఆరోగ్యం, ధైర్యం,సంతానం, విద్య ఇవి అన్ని మన ఇంటిలో ఉండాలి అని మనం అమ్మవారిని, అష్టలక్ష్మీ పూజించి అందరం సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుందాం. అయితే కొందరిలో మంచి రోజుల్లో బంగారం కొంటే, లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్టేనని సెంటిమెంట్‌ ఉంటుంది. అందుకే ధంతేరాస్, అక్షయ తృతీయ రోజుల్లో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సెంటిమెంట్‌తో బంగారం కొనడం అనేది వారి ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.