NEWS

Relationship: రిలేషన్‌లో 15 రకాల ఛీటింగ్స్‌.. మోసపోకుండా ఉండాలంటే వీటిని కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

చాలా మంది రిలేషన్‌లో ఉంటారు. కానీ కొందరే చివరి వరకు కలిసి ఉంటారు. మధ్యలో దూరమై పోవడానికి చాలా కారణాలు ఉంటారు. ముఖ్యంగా రిలేషన్‌షిప్‌లో పార్ట్‌నర్స్‌ మధ్య చాలా రకాల మోసాలు జరగవచ్చు. ఇవి పార్ట్‌నర్స్‌ మధ్య నమ్మకాన్ని, కనెక్షన్‌ని ప్రభావితం చేస్తాయి. ఈ మోసాల గురించి అవగాహన చాలా అవసరం. వాటి సంకేతాలు ముందుగానే గుర్తించడం వల్ల సమస్యలు చాలా తీవ్రంగా మారకముందే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 15 రకాల మోసాల గురించి తెలుసుకుందాం. * సైబర్ ఛీటింగ్‌ ఇంటర్నెట్‌ వినియోగం పెరగడంతో సైబర్‌ ఛీటింగ్స్‌ సర్వసాధారణమైపోయాయి. ఇందులో ఆన్‌లైన్‌ ఫ్లర్టింగ్‌, సీక్రెటివ్‌ చాట్‌లు లేదా వర్చువల్ రిలేషన్‌షిప్స్‌ ఏర్పరుచుకోవడం ఉంటాయి. శారీరక సంబంధం లేకుండా కూడా, ఈ ఆన్‌లైన్ యాక్టివిటీలు భాగస్వాముల మధ్య ఎమోషనల్‌ డిస్టెన్స్‌ క్రియేట్‌ చేస్తాయి, అపనమ్మకాన్ని సృష్టిస్తాయి. * ఫిజికల్‌ ఛీటింగ్‌ రిలేషన్‌షిప్‌లో పార్ట్‌నర్‌ మరొకరితో శారీరక సంబంధం కలిగి ఉంటారు. అది ముద్దు పెట్టుకోవడం నుంచి సెక్స్ వరకు ఏదైనా కావచ్చు. ఫిజికల్ ఛీటింగ్ తీవ్రమైన బాధకు గురి చేస్తుంది. రిలేషన్‌లో నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. * ఎమోషనల్‌ ఛీటింగ్‌ ఒక భాగస్వామి బయటి వ్యక్తితో ఎమోషనల్‌ బాండ్‌ ఏర్పరుచుకోవడాన్ని ఎమోషనల్‌ ఛీటింగ్‌ అంటారు. శారీరక సంబంధం లేకపోయినా, డీప్‌ ఫీలింగ్స్‌, పర్సనల్‌ థాట్స్‌ని వేరొకరితో పంచుకోవడం ఫిజికల్‌ ఛీటింగ్‌ లానే రిలేషన్‌ని దెబ్బతీస్తుంది. * వన్-నైట్ స్టాండ్స్ ఒక భాగస్వామి లాంగ్‌-టర్మ్‌ కనెక్షన్‌ మెయింటైన్‌ చేసే ఉద్దేశం లేకుండా వేరొకరితో లైంగిక సంబంధం కలిగి ఉండటాన్ని వన్-నైట్ స్టాండ్ అంటారు. ఇది చాలా బాధాకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది రిలేషన్‌లో కమిట్‌మెంట్‌ లేదని చూపుతుంది. * మైక్రో ఛీటింగ్‌ మైక్రో-చీటింగ్‌లో ఒక భాగస్వామి వేరొకరితో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయి ఉన్నారని సూచించే చిన్న, సూక్ష్మమైన చర్యలు ఉంటాయి. ఇందులో తరచుగా మెసేజ్‌లు పంపడం, ఫ్లర్టింగ్‌ లేదా సోషల్ మీడియాలో సీక్రెట్‌ మెయింటైన్‌ చేయడం ఉంటాయి. ఈ చర్యలు చిన్నవిగా అనిపించవచ్చు, కానీ అవి రిలేషన్‌లో నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. * అఫైర్స్‌ అఫైర్స్‌ అనేవి రిలేషన్‌షిప్‌కి బయట ఉన్న లాంగ్‌ టర్మ్‌ రిలేషన్‌షిప్స్‌. ఇందులో ఎమోషనల్‌ లేదా ఫిజికల్‌ కాంటాక్ట్‌ కొనసాగుతుంది. వన్-నైట్ స్టాండ్‌ల మాదిరిగా కాకుండా, అఫైర్స్‌లో డీపర్‌ కనెక్షన్‌లు ఉంటాయి. భాగస్వాముల మధ్య నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. * ఫైనాన్షియల్‌ చీటింగ్‌ ఒక భాగస్వామి డబ్బును దాచినప్పుడు లేదా తమ పార్ట్‌నర్‌ని ప్రభావితం చేసే విధంగా ఫైనాన్స్‌ను మేనేజ్‌ చేయడాన్ని ఫైనాన్షియల్‌ చీటింగ్‌ అంటారు. ఇందులో రహస్యంగా ఖర్చు చేయడం, హిడెన్‌ అకౌంట్స్‌, డబ్బు గురించి అబద్ధాలు చెప్పడం ఉంటాయి. ఫిజికల్ లేదా ఎమోషనల్ మోసం కానప్పటికీ, ఇది నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. రిలేషన్‌లో ప్రధాన సమస్యలను తీసుకొస్తుంది. * ప్లాటోనిక్ అఫైర్స్‌ ప్లాటోనిక్ అఫైర్ అంటే ప్రైమరీ రిలేషన్‌కి వెలుపల ఉన్న వారితో డీప్‌, నాన్‌ సెక్సువల్‌ రిలేషన్‌షిప్‌ ఏర్పరచుకోవడం. శారీరక సాన్నిహిత్యం లేనప్పటికీ, ఎమోషనల్‌ కనెక్షన్, సీక్రెసీ మెయింటైన్‌ చేస్తుంటారు. ఇది ప్రైమరీ పార్ట్‌నర్‌తో షేర్‌ చేసుకోవాల్సిన ఎమోషన్‌ ఎనర్జీని దూరం చేస్తుంది, రిలేషన్‌ని దెబ్బతీస్తుంది. * ఫ్లర్టింగ్‌ ఫ్టర్టింగ్‌లో కాంప్లిమెంట్స్‌, టీజింగ్‌ ద్వారా రిలేషన్‌లో లేని వారిపై రొమాంటిక్‌ లేదా సెక్సువల్‌ ఇంట్రెస్ట్‌ చూపుతారు. ఇది హానిచేయనిదిగా అనిపించినప్పటికీ, ఫ్లర్టింగ్‌ పార్ట్‌నర్‌ని మానసిక క్షోభకు గురి చేస్తుంది. గౌరవం లేదా కమిట్‌మెంట్‌ లేకపోవడాన్ని సూచిస్తుంది. * అన్‌ ఇంటెన్షనల్‌ చీటింగ్‌ అన్‌ ఇంటెన్షనల్‌ చీటింగ్‌లో మోసం చేయాలనే ఉద్దేశం లేకుండా కొన్ని పనులు చేస్తారు. అయినా అవి రిలేషన్‌ని దెబ్బ తీస్తాయి. ఉదాహరణకు, ఆఫీసులో హద్దులు దాటుతున్నామనే స్పృహ లేకుండా క్లోజ్‌ రిలేషన్‌షిప్‌ ఏర్పరచుకోవడం. * స్పిరుచ్యువల్‌ చీటింగ్‌ స్పిరుచ్యువల్‌ చీటింగ్‌లో ఆధ్యాత్మిక లేదా మత విశ్వాసాల ఆధారంగా వేరొకరితో డీప్‌, సీక్రెట్‌ రిలేషన్‌ మెయింటైన్‌ చేస్తారు. ఇది వ్యక్తిగత విలువలు, నమ్మకాలతో ముడిపడి ఉన్నందున ఈ రకమైన మోసాన్ని పరిష్కరించడం కష్టం. * రిపీటెడ్‌ బిహేవియర్‌ ఇది కొనసాగుతున్న మోసాన్ని సూచిస్తుంది. ఇందులో భాగస్వామి భౌతికంగా లేదా మానసికంగా పదే పదే మోసం చేస్తుంటారు. ఈ రకమైన బిహేవియర్‌ కనిపిస్తే, రిలేషన్‌ తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. * మితిమీరిన గోప్యత సీక్రెట్‌గా ఫోన్ యూజ్‌ చేయడం లేదా సోషల్ మీడియా యాక్టివిటీస్‌ని దాచడం వంటివి మితిమీరిన గోప్యతను సూచిస్తాయి. ఈ మోసంలో మరొక వ్యక్తి లేకపోయినా, ఈ ప్రవర్తన అపనమ్మకం సృష్టిస్తుంది. భాగస్వామి ఏదో దాచిపెడుతున్నాడనే అనుమానాన్ని తీసుకొస్తుంది. * ఎమోషనల్‌ నెగ్లెక్ట్‌ ఇది ట్రెడిషినల్‌ ఛీటింగ్ కాదు, కానీ అవిశ్వాసానికి దారి తీస్తుంది. ఇందులో భాగస్వామి అవసరాలకు ఎమోషనల్ సపోర్ట్‌ అందించరు. దీంతో మరొకరిలో ఎమోషల్‌ కనెక్షన్‌ చూసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. మోసం చేయడానికి అవకాశాన్ని సృష్టిస్తుంది. * రివెంజ్ చీటింగ్ ఒక భాగస్వామి మునుపటి ద్రోహం లేదా మోసానికి ప్రతీకారం తీసుకోవడాన్ని రివెంజ్‌ చీటింగ్‌ అంటారు. ఈ రకమైన మోసం కోపం, తగిన బుద్ది చెప్పాలనే ఆలోచన నుంచి వస్తుంది. ఇది సాధారణంగా పరిస్థితిని మరింత దిగజార్చుతుంది, మరింత హాని కలిగిస్తుంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.