NEWS

Success Story: ఇలా చేశాడు కాబట్టే 4 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి.. ఇదే సీక్రెట్..

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించిన యువకుడు సక్సెస్ స్టోరీ ఇదే! ప్రస్తుతకాలంలో ఉద్యోగం సాధించడం ప్రతి నిరుద్యోగి కోసం పెద్ద సవాల్ అయింది. అయితే, నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన అసిఫ్ అనే యువకుడు కేవలం ఒకటి కాదు, ఏకంగా నాలుగు ఉద్యోగాలను సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. జేఎల్ (జూనియర్ లెక్చరర్), టీజీటీ (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్), పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్), జనరల్ జేఎల్ వంటి ఉద్యోగాలను పొందిన అసిఫ్ విజయ రహస్యం గురించి లోకల్ 18 న్యూస్ ఛానల్ బృందంతో మాట్లాడుతూ పంచుకున్నాడు. అసిఫ్ కథ - మొదటి అడుగు నుంచి విజయ శిఖరాల వరకు.. “నా తల్లిదండ్రులు షేక్ లతీఫ్, షేక్ నబీన. నేను పీజీ బి.ఇ.డి. ఉస్మానియా యూనివర్సిటీలో 2014-2017 మధ్య పూర్తి చేశాను. అప్పటినుంచి కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ప్రిపేర్ అవుతున్నా,” అని అసిఫ్ తన ప్రయాణాన్ని వివరించాడు. 2018లో పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం సాధించి, నల్లగొండ జిల్లా చిరుమర్తి గ్రామంలో పోస్టింగ్ పొందాడు. అయితే చిన్న ఉద్యోగంపై అధిక వత్తిళ్లతో అసంతృప్తి ఉండగా, 2019లో తిరిగి ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. రాత్రి పగలూ కష్టపడి విజయం సాధించిన అసిఫ్.. “రోజుకు కనీసం 11 గంటలు చదివేవాడిని. కోచింగ్‌కు వెళ్లే మిత్రుల నోట్స్, ఉస్మానియా యూనివర్సిటీలోని పుస్తకాలు, అలాగే నేను తయారు చేసుకున్న సొంత నోట్స్‌ను ఎక్కువగా ఉపయోగించేవాడిని,” అని చెప్పాడు. 2023లో నాలుగు పరీక్షలు రాయడం ద్వారా జేఎల్‌లో 23వ ర్యాంకు, టీజీటీ 83వ ర్యాంకు, పీజీటీ 80వ ర్యాంకు, జనరల్ జేఎల్ 36వ ర్యాంకులను సాధించి నాలుగు ఉద్యోగాలు తన ఖాతాలో వేసుకున్నాడు. అసిఫ్ విజయ రహస్యం “ఈ ఉద్యోగాలు ఒక రాత్రికి రాత్రే రాలేదు. 2018 నుండి 2023 వరకు రాత్రి, పగలు కష్టపడటం వల్లనే ఇవి సాధ్యమయ్యాయి. జనరల్ స్టడీస్ కోసం ఆన్లైన్ లోకుక్కు వినడం, సొంత నోట్స్ తయారు చేసుకోవడం, వాటిని తరచుగా రివిజన్ చేయడం నా విజయ రహస్యం,” అని అసిఫ్ పంచుకున్నాడు. ప్రతి ఒక్కరికీ సందేశం “విజయం సాధించాలంటే మీకు నచ్చిన దారిలో కష్టపడండి. నిరంతరం ప్రయత్నిస్తే ఎప్పటికైనా విజయం తప్పదు,” అంటూ యువతకు స్ఫూర్తి కలిగించాడు. అసిఫ్ విజయం నిరుద్యోగ యువతకు ప్రేరణగా నిలుస్తోంది. కృషి, కట్టుబాటు, నమ్మకం ఉంటే ఏది సాధ్యం అవుతుందో ఈ కథ చాటి చెబుతోంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.