NEWS

Neeraj Chopra-Manu Bhaker: మను భాకర్ నీరజ్ చోప్రా పెళ్లి.. వార్తలపై పేరెంట్స్ రియాక్షన్ ఇదే

MANU BHAKERNIRAJ Viral Video: పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా, మను భాకర్‌ తమపై ఉన్న భారీ అంచనాలు అందుకున్నారు. మను షూటింగ్‌లో రెండు కాంస్య పతకాలను గెలుచుకోగా, నీరజ్ జావెలిన్ త్రోలో రజతం సాధించాడు. అయితే ఇప్పుడు వీరిద్దరి గురించి చాలా వార్తలు వస్తున్నాయి. వీళ్లు క్లోజ్‌గా మాట్లాడుకుంటున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని ప్రచారం మొదలైంది. పెళ్లి ప్రచారంపై రియాక్షన్.. మను భాకర్‌ తల్లి సుమేధా భాకర్ కూడా నీరజ్‌ చోప్రాతో మాట్లాడారు. ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది. మను భాకర్‌, ఆమె తల్లితో నీరజ్‌ చోప్రా ఏం మాట్లాడాడో స్పష్టత లేదు. కానీ ఈ వీడియోలు వైరల్‌గా మారడంతో, సోషల్‌ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఇద్దరు ఒలింపియన్ల ఆఫ్-ది-ఫీల్డ్ కనెక్షన్ గురించి వార్తలు వచ్చాయి. దీంతో తాజాగా మను తండ్రి రామ్ కిషన్ భాకర్, సోషల్ మీడియా పుకార్లపై స్పందించారు. మను ఇంకా చాలా చిన్న పిల్ల అని, తన పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించట్లేదని చెప్పారు. నీరజ్‌ కొడుకుతో సమానం.. రామ్ కిషన్ భాకర్ ‘దైనిక్ భాస్కర్‌’తో మాట్లాడుతూ.. ‘మను ఇంకా చాలా చిన్న పిల్ల. ఆమెకు పెళ్లి వయసు కూడా రాలేదు. ప్రస్తుతం దాని గురించి ఆలోచించడం లేదన్నారు. అలానే తన భార్య సుమేధా నీరజ్‌తో మాట్లాడటంపై స్పందిస్తూ ‘మను తల్లి నీరజ్‌ను తన కొడుకులా భావిస్తుంది’ అని తెలిపారు. లవ్ స్టోరీ కాదంట.. నీరజ్ చోప్రా అంకుల్‌ కూడా మనుతో డిస్కషన్ గురించి మాట్లాడినట్లు సమాచారం. ‘నీరజ్ ఒలింపిక్‌ పతకం గెలిచాడు. దేశం మొత్తానికి దాని గురించి తెలిసింది. అదే విధంగా అతడు పెళ్లి చేసుకుంటే ఆ విషయం అందరికీ తెలుస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. నెటిజన్ల రియాక్షన్‌ ఓ వైరల్ వీడియోలో నీరజ్ చోప్రా, మను భాకర్ ఇద్దరూ చాలా క్లోజ్‌గా మాట్లాడుతూ కనిపించారు. ఈ వీడియో వైరల్‌ అయింది. చాలా మంది నెటిజన్లు కామెంట్స్‌ సెక్షన్‌లో తమ అభిప్రాయం తెలియజేశారు. ‘నీరజ్ చోప్రాకు కొంచెం సిగ్గు ఎక్కువ. అందుకే ఏదో ఉందని ప్రజలు అనుకుంటున్నారు.’ అని ఒకరు కామెంట్‌ చేశాడు. ‘షారూఖ్ ఖాన్, కాజోల్ వైబ్స్’ అని ఇంకొకరు కామెంట్ రాశారు. ‘ఇది నిజమైతే, పర్ఫెక్ట్ జోడీ’ అని మరొకరు, ‘నెక్ట్స్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం ఎలా గెలవాలనే దాని గురించి వారు మాట్లాడుతున్నారు.’ అని ఇంకొకరు కామెంట్‌ రాశారు. ముగింపు వేడుకల్లో జెండా ఎగురవేసిన మను, శ్రీజేష్‌ పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కలిసి మను భాకర్‌ రెండు కాంస్య పతకాలు గెలిచింది. 22 ఏళ్ల మను షూటింగ్‌లో ఒలింపిక్ పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళా షూటర్‌గా నిలిచింది. పారిస్‌లోని స్టేడ్ డి ఫ్రాన్స్‌లో జరిగిన ముగింపు కార్యక్రమంలో మను, కాంస్య పతకాన్ని గెలుచుకున్న హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్‌ శ్రీజేష్ పతకధారులుగా వ్యవహరించారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.