NEWS

Punjab Kings: సమస్యల్లో చిక్కుకున్న ఐపీఎల్ జట్టు.. సహ యజమానిపై కోర్టుకెక్కిన మరో ఓనర్!

ఐపీఎల్ ట్రోఫీ Punjab Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో వరుస వైఫల్యాలు మూటగట్టుకున్న టీమ్‌లలో పంజాబ్‌ కింగ్స్‌ (PBKS) ఒకటి. ఎంత మంది సారథులు మారినా, ఈ టీమ్‌ తీరు మాత్రం మారడం లేదు. ఇప్పటి వరకు ఈ జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఏంటంటే, కేవలం ఒకసారి ఫైనల్ చేరింది. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీలో కొత్త సమస్యలు మొదలయ్యాయి. బాలీవుడ్ నటి ప్రీతి జింటా, వ్యాపారవేత్తలు నెస్ వాడియా, మోహిత్ బర్మన్ ఈ ప్రాంఛైజీ ప్రధాన వాటాదారులు. పంజాబ్ కింగ్స్ జట్టు ఆట కంటే ఇతర అంశాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు మేజ్‌మెంట్‌ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటోంది. పంజాబ్ కింగ్స్ సహ-యజమానులైన ప్రీతి జింటా, నెస్ వాడియా మధ్య గతంలో విభేదాలు తలెత్తాయి. తాజాగా మోహిత్ బర్మన్‌‌తో కూడా ప్రీతి జింటాకు విభేదాలు వచ్చినట్లు క్రికెట్ వర్గాల సమాచారం. భాగస్వాములకు తెలియకుండా వాటాల విక్రయం పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలో ప్రీతి జింటాకు 23 శాతం, నెస్ వాడియాకు 23 శాతం, మోహిత్ బర్మన్‌కు 48 శాతం వాటా ఉంది. తన షేర్లలో కొంత భాగం ఇతర భాగస్వాములకు తెలియకుండా అమ్మేందుకు సిద్ధమైన మోహిత్ బర్మన్‌ను అడ్డుకునేందుకు ప్రీతి జింటా చంఢీగడ్ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఒప్పందాల ప్రకారం, వాటాలను అమ్మాలనుకుంటే ముందుగా భాగస్వాములకు ఆఫర్ చేయాలి. వారు ఆసక్తి చూపకపోతే అప్పుడు బయటివారికి విక్రయించాలి. అయితే ప్రధాన వాటాదారుడైన మోహిత్ బర్మన్ ఈ నిబంధనలను పాటించకుండా తన వాటాలో 11 శాతం షేర్లను ఇతరులకు విక్రయించడానికి సిద్దమైనట్లు ప్రీతి జింటా ఆరోపించింది. నాకు ఆ ఆలోచన లేదు! ఈ అంశంపై పంజాబ్ కింగ్స్ ప్రధాన వాటాదారుడు మోహిత్ బర్మన్ స్పందించారు. స్పోర్ట్స్ సైట్ క్రిక్ బజ్‌తో ఆయన మాట్లాడుతూ.. షేర్లు విక్రయించే ఆలోచనే తనకు లేదని చెప్పాడు. అయితే బర్మన్ తన వాటాలోని 11.5% షేర్లను, విక్రయించాలని చూస్తున్నట్లు ఇప్పటికే అనేక నివేదికలు వెలువడం విశేషం. మరో మూడు రోజుల్లో విచారణ మోహిత్ బర్మన్‌పై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ప్రీతి జింటా సిద్ధమైంది. అయితే ఆమె తన పిటిషన్‌లో ఎలాంటి అంశాలను ప్రస్తావించిందో ఇప్పటివరకు స్పష్టత లేదు. ఆమె దాఖలు చేసిన ఫిటిషన్ చంఢీగడ్ హైకోర్టులో ఆగస్టు 20న విచారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రశ్నార్థకమైన ఫ్రాంచైజీ భవిష్యత్తు తాజా పరిణామాలతో ఐపీఎల్‌ 2025 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ జట్టు భవిత్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక వైపు జట్టుగా ఆటలో రాణించ లేకపోవడం, మరోవైపు జట్టు యాజమాన్యంలో తరచుగా విభేదాలు పంజాబ్ కింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజా వివాదంపై బీసీసీఐ స్పందన ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్( PBKS) జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడలేకపోయాయి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.