NEWS

New Business Idea: ఆహా.. రోజుకు రూ.5 వేలు సంపాదన.. మీరూ పొందండిలా!

New Business Idea, Business Idea, Business plan, money, బిజినెస్ ఐడియా, కొత్త బిజినెస్, బిజినెస్ ప్లాన్, డబ్బు మధ్య తరగతి కుటుంబ జీవితల్లో ఆన్ని రోజూ ఒకేలా ఉండవు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు అందులో వ్యాపారం లో ఎన్నో నష్టాలు,ఇవన్నీ ఇలా ఒక వైపు పిల్లలు వారు చదువులకి ఖర్చులూ ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న కుటుబంలో వారికి ఒక చిన్న ఆలోచన వచ్చింది అది కూడా ఇంట్లో ఉండే చేసే వ్యాపారం.ఇది చివరి ప్రయత్నంగా మొదలుపెట్టారు దానికోసం శ్రద్ధతో శ్రమించారు చివరికి మరో కొందరికి ఉపాధిని ఇచ్చే విధముగా ఎదిగారు ఇంతకీ వారు ఎం చేశారు ఎంత సంపాదన చేస్తున్నారనే విషయాలు ఇప్పుడు లోకల్ 18 ప్రత్యెక కథనం ద్వారా చూద్దాం. ఉద్యోగం చేశాడు కలిసి రాలేదు ఆ తరువాత ఓ వ్యాపారం చేశాడు అది కలిసి రాలేదు ఆ తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు ,అది కూడా కలిసి రాలేదు, ఇంట్లో ఇబ్బందులు ఎటు చూసినా అడుగడుగునా కష్టాలు, ఇంట్లో సతీమణి మిషన్ కుడుతూ కాలాన్ని నెట్టుకొస్తుంది. ఏదైనాచేయాలి అనుకున్నాడు.అంతలోనే తన మనసుకు తట్టింది ఓ వ్యాపారం . అదే ఎంబ్రాయిడింగ్ . ఎలాగైనా మెషిన్ తీసుకొచ్చి మొదలు పెట్టాలని ఆలోచన చేశాడు. బయట షాప్ తీసుకుని ప్రారంభిస్తే రెంట్ మెయింటెన్స్ ఇబ్బందులు అందుకోసమే ఇల్లునే ఎంచుకునే ఇంట్లోనే ఎంబ్రాయిడింగ్ చేయడం ప్రారంభించాడు. మొదట్లో తేలిక పాటిగా నడిచినా ప్రస్తుతానికి తీరిక లేదు అన్నట్టుగా నడుస్తుంది. డబ్బులు సంపాదించాలని ఆశ ఎవరికైనా ఉంటుంది. దానికి పెద్ద పెద్దగా పెట్టుబడులకు పోకుండా చిన్న చిన్నగా కుటీర పరిశ్రమలతో కూడా ఎక్కువ మొత్తం లో డబ్బులు సంపాదించవచ్చని నిరూపిస్తున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కి చెందిన మామిడి కుమార్. గోదావరి ఖని లోని మార్కండేయ కాలనీ లో తన ఇంట్లో నే తన కూతురు శ్రీ మనస్విని పేరుతో ఎంబ్రాయిడరీ చేస్తూ జీవన ఉపాధి పొందడమే కాకుండా మరో 5మంది మహిళలకి ఉపాధిని కల్పిస్తున్నారు కుమార్. వీరి వద్ద అన్ని రకాల ఎంబ్రాయిడరీ వర్క్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు రూ. 500 నుండి ప్రారంభం అయ్యి సుమారు 2500రూపాయల వర్క్ డిజైన్ వరకు ఉన్నాయి. వీటితో పాటు మగ్గం వర్క్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. కుమార్ సతీమణి కుట్టు మెషిన్ లో అనుభవం ఉండటం తో ఇక్కడే బ్లౌస్ స్టిచ్చింగ్ చేసి ఇస్తున్నారు. కుమార్ మాట్లాడుతూ.. ఎన్నో రకాల వ్యాపారాలు ఉద్యోగాలు చేసి ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నా భార్య కుట్టు మెషిన్ నడిపిస్తుండటం తో ఈ ఫీల్డ్ లో రాణిస్తున్నామని కుమార్ తెలిపారు. ఎంబ్రాయిడింగ్ మగ్గం వర్క్ కు ప్రస్తుత రోజుల్లో ఎంతో డిమాండ్ ఉంది. సీజన్ అనే కాకుండా పండుగలకు, ఇతర చిన్న చిన్న కార్యాలకు కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. దీంతో మేము ఉపాధి పొందుతూ మరి కొందరికి ఉపాధి ఇవ్వడం అందంగా ఉందని కుమార్ తెలిపారు. తాము ప్రతి రోజు సుమారు రూ. 5 వేల వరకు ఆదాయం పొందుతున్నట్లు సదరు దంపతులు తెలిపారు. ఎవరికైనా ఎంబ్రాయిడింగ్ లేదా మగ్గం వర్క్ చేయించుకోవాలని ఉంటే ఇక్కడికిరాలేక పోయినా సరే వాట్సాప్ లో మీకు నచ్చిన డిజైన్ ని పంపించి ఆర్డర్ చేస్తే కొరియర్ ద్వారా ఆ బ్లౌజుని డెలివరీ చేస్తామని వారు తెలిపారు. వీరిని సంప్రదించవలసిన నెంబర్లు 9441461424, 9959520543.. శ్రీ మనస్విని ఎంబ్రాయిడరీ వర్క్స్. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.