NEWS

నిజాం నవాబు కాలం బావి.. సర్వరోగ నివారణి!

well ఎక్కడైనా నీళ్లు నీలం రంగులో ఉంటాయి. కానీ అక్కడి బావిలో నీళ్లు మాత్రం తెల్లగా పాలవలే ఉంటాయి. చుట్ట పక్కల జలపాతం, సెలయేరు లాంటివి లేకుండానే బండరాళ్ల మధ్యలో వెలసిన బావి కావడంతో ఆ బావిలోని జలాన్ని ఔషదజలంగా భావిస్తున్నారు. అందుకే ఆ బావిని దూద్‌ బావి అని పిలుస్తున్నారు.ఇంతకీ ప్రత్యేకతలు కలిగిన ఆ బావి ఎక్కడుందంటే కరీంనగర్ జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్లు దూరంలో శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో ఓ పురాతన బావి ఉంది.దాన్ని దూద్ బౌలిగా పిలుస్తారు. ఈ బావి లోని నీళ్లే ఇక్కడి జనం సర్వరోగ నివారణికిగా భావిస్తారు. చుట్టూ పెద్ద గుట్టలు,రాతి గోడల మధ్య ఉన్న ఆ బావిలో పాల వంటి స్వచ్ఛమైన నీళ్లు లభ్యం అవుతున్నాయి.ఆ బావి నీళ్లు తాగితే రోగాలేవీ దరి చేరవనేది స్థానికుల నమ్మకం.అది ఇప్పటి మాట కాదు ప్రపంచాన్ని గడగడలాంచిన కరోనా కష్టకాలంలోనే ఈవిషయం నిర్ణారణ అయిందంటున్నారు స్థానికులు. కరోనా సమయంలో ఈ బావి నీళ్లు తాగడం వల్ల ఊరిలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దాంతో అప్పటి నుండి ఈ బావి నీళ్లకు ప్రచారం ఊపందుకుంది. స్థానికులే కాదు చుట్టు పక్క గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి బావి నీటిని తీసుకెళ్తున్నారు. ఊరిలో తొవ్విన బావో, పొలంలో నీళ్ల కోసం తోడిన బావి కాదు మొలంగూర్‌లో ఉన్న దూద్‌ బౌలి బావి చరిత్రతో ముడిపడి ఉంది. ఈ బావి నీటిని నిజాం నవాబు కూడా తాగేవారట. కరీంనగర్ నుంచి రోజూ గుర్రం మీద నిజాం నవాబు వచ్చి నీటిని తీసుకెళ్లేవారని ఇక్కడి పూర్వికులు చెబుతుంటారు. ఔషధ విలువలు ఉండటంతోనే నిజాం నవాబు ఈ బావి నీరు తాగే వారని చెబుతుంటారు. ఇప్పటికీ నల్లాల ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందుతున్నప్పటికీ .. మొలంగూరు గ్రామస్థులు ఆ బావి నీరే తాగుతుండటం విశేషంగా చెప్పుకోవాలి. నీటి ప్రతేకత ఏంటో తెలుసుకోవడానికి జలవనరుల సంస్థ కూడా పరిశోధనని కూడా మొదలు పెట్టారట. కరీంనగర్‌ జిల్లాలో ఉన్న దూద్ బౌలి బావికి వెళ్లాలంటే బస్సులో వెళ్లాలనుకునే వారు కరీంనగర్ నుండి వరంగల్ బస్ ఎక్కి కథలాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద దిగాలి. అక్కడి నుండి మొలం గూర్‌ వెళ్ళే బస్సు ఎక్కితే సరిపోతుంది. ఇక వరంగల్ నుండి అక్కడికి వెళ్లాలనుకునే వారు వరంగల్లో బస్సు ఎక్కి కథలపూర్ ఎక్స్ రోడ్డు వద్ద దిగి అక్కడి నుండి మోలాగూర్ బస్సు ఎక్కితే సరిపోతుంది. కార్ బైక్ పై వెళ్ళేవారికి కూడా సేమ్ రూట్‌లో వెళ్లాల్సి ఉంటుంది. ఇంతటి విశేష ప్రదేశంగా గుర్తింపు దక్కిన చారిత్రక ప్రదేశాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసి పర్యాటప్రాంతంగా తీర్చిదిద్దితే బాగుంటుందని గ్రామస్తులు కోరుతున్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.