NEWS

మీరు శ్రీశైలం వెళ్తే.. మీ వాహనంపై బొమ్మలు వేస్తున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..

ఈ కళాకారులు వాహనం కల్పిస్తే చాలు నిమిషాల్లో దేవుళ్ల చిత్రాలు గీసేస్తారు..!! ద్వాదశ జ్యోతిర్లింగాలలో మరియు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో ఎన్నో కళలను మనం చూడవచ్చు. ఎందరో కళాకారులను కూడా నిత్యం చూడవచ్చు. అందులో ఒకటైన ఈ బొమ్మలు వేసే కళాకారులు. వీరు వేసే చిత్రాలను చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వీరు పనిముట్లు అడవిలో దొరుకు కొమ్మలు. వీరి రంగులు సహజ సిద్ధమైన అమ్మవారి కుంకుమ, పసుపు, గంధం, విభూతి. ఎటువంటి బ్రష్ కెమికల్ తో కూడిన రంగులు లేకుండా నేచురల్ గా ఈ బొమ్మలు వేయడం జరుగుతుంది. వీరు గత 20 సంవత్సరాలుగా ఇదే వృత్తిలో ఉన్నారని ఆ కళాకారులు చెబుతున్నారు. శ్రీశైలం స్వామి అమ్మవారి దర్శనం కొరకు చేరు ప్రతి భక్తుని వాహనం మీద ఈ బొమ్మలు తప్పకుండా ఉండాల్సిందే. ముందుగా వాహనాన్ని శుభ్రపరిచి వాటిపై శివుడు మెడలో పాము. నెమలి. శివలింగము. ఓం మరియు పుష్పాలు వేసి ఎంతో అందమైన చిత్రాన్ని వాహనాలపై గీస్తారు. వారి యొక్క చేతి వేళ్లతోనే ఆ చిత్రానికి ఒక ఆకారాన్ని తీసుకొస్తారు. అలా శ్రీశైలంలో పలుచోట్ల ఈ కళాకారుల వాహనాలపై ఈ చిత్రాలను గీస్తారు. నంది సర్కిల్ సమీపంలో మరియు మల్లికార్జున సదన్ ఎదురుగా ఉన్న పార్కింగ్లో, టూరిస్ట్ బస్టాండ్ పార్కింగ్లో ఇలా పలుచోట్ల బొమ్మలు వేస్తారు. చాలా తక్కువ రేటుకే ఎంతో అందమైన చిత్రానికి తమ వాహనం మీద గీస్తారని ఎంతోమంది భక్తులు చెప్తారు. భక్తులు దర్శనం వెళ్ళు సమయంలో తమ వాహనాలను పార్కింగ్ లో ఉంచి వెళ్తుంటారు. ఆ పార్కింగ్ లో ఉంచిన వాహనానికి భక్తులు దర్శనం వెళ్లి వచ్చి సమయంలో ఈ చిత్రాన్ని గీసి ఇస్తారు. ఈ చిత్రాలను గీసే కళాకారులకు ఎటువంటి చదువు లేకుండా అలాగే ట్రైనింగ్ కూడా లేకుండా ఎంతో అవలీలగా చిత్రాన్ని గీస్తారు. శ్రీశైలం లోనే కాకుండా సాక్షి గణపతి, అటకేశ్వరం, పాలధార, పంచదర శిఖరం ఇలా పలుచోట్ల వీరు ఈ బొమ్మలను గీస్తారు. ఈ చిత్రం లేనిదే వాహనం శ్రీశైలం నుంచి కదలదు. అంత ప్రాధాన్యతనిస్తారు. ఇక్కడ గీసే చిత్రాలకు భక్తులు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.