NEWS

కనువిందు చేస్తున్న భీముని పాదం జలపాతం.. మీరూ ఓ లుక్కేయండి..

జాలు వారుతున్న జలపాతం జలపాతం అనేది నది లేదా ప్రవాహంలో ఉన్న ఏదైనా బిందువు, ఇక్కడ నీరు నిలువు బిందువు లేదా నిటారుగా ఉండే చుక్కల శ్రేణిపై ప్రవహిస్తుంది. పట్టిక మంచుకొండ లేదా మంచు షెల్ఫ్ అంచున కరిగే నీరు పడే చోట కూడా జలపాతాలు ఏర్పడతాయి. అయితే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల జలపాతాలు జాలువారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భీముని పాదం జలపాతం కనువిందు చేస్తుంది. ఇది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ శివారులో కొలువై ఉంది. దట్టమైన అటవీ ప్రాంతం ఎత్తైన కొండలపై నుంచి జారిపడుతున్న నీళ్లను చూసి పర్యాటకులు తుళ్ళిపడుతున్నారు. 70 అడుగుల ఎత్తు నుంచి దూకే ఈ జలపాతాన్ని చూసేందుకు సందర్శకులు ఇక్కడికి పోటెత్తుతున్నారు. పురాణ కథ ప్రకారం ఒకప్పుడు యాదవ రాజు పాపమేడగుట్ట ప్రాంతాన్ని పాలించేవారట. ఆయనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్యని ఆమె కుమార్తెను చంపాలని చిన్న భార్య కుట్ర పన్నీ, అందుకోసం ఓ లక్కమేడను కట్టించి అందులో వాళ్ళు ఉండగా నిప్పు పెట్టించిందట. పాండవులు అరణ్య వాసం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చారట. ఆ సమయంలో ఈ కుటుంబం మంటల్లో చిక్కుకొని గట్టిగా కేకలు పెట్టగా అజ్ఞాతంలో ఉన్న అటుగా వెళుతున్న భిముడు ఆ దృశ్యాన్ని చూసి జలపాతం లోని నీళ్లు చల్లి ఆ మంటలను ఆర్పి వేసి వారిని రక్షించారని ఆ చరిత్ర చెబుతోంది. ఈ ప్రదేశంలో ఉన్న కొండరాయి ఒక పాదం ఆకారంలో ఉండటం వల్ల ఆ పాదముద్రపై నుండి జలపాతం కిందికి జలకళ దుంకుతుంటుంది. ఆ కారణం వల్ల ఈ క్షేత్రానికి భీముని పాదం అనే పేరు వచ్చినట్లు చరిత్ర తెలుపుతుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ భీముని పాదం జలపాతం జలదారులతో ఆకర్షిస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ జలపాతానికి నీరు ఎక్కడి నుండి వస్తుందో అంతు పట్టని రహస్యంగానే ఉంది. ఈ జలపాతాన్ని చూసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ మరియు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలివచ్చి ఈ జల దృశ్యాలను తిలకిస్తున్నారు. సెలవు దినాల్లో ఇక్కడ రద్దీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం ఆటవిశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఎంట్రీ ఫీజు విషయానికి వస్తే ఒక్కరికి రూ:40లుగా చార్జీ చేస్తున్నారు.అదేవిధంగా వాహనాలు లోపలికి వెళ్లాలంటే టూ వీలర్ రూ:20,త్రి వీలర్ రూ:50, ఫోర్ వీలర్ రూ:100, సిక్స్ వీలర్ రూ. 200లుగా చెల్లించాల్సి ఉంటుంది. లోపలికి మద్యపానాన్ని అనుమతించడం లేదు. పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు మరియు సిబ్బంది ఎప్పటికప్పుడు ఆ పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామని పర్యాటకులు తెలుపుతున్నారు. ఇక్కడికి స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ వచ్చి ఇక్కడ ఆహ్లాదంగా గడపవచ్చన్నారు. ఈ జల దృశ్యాలు కూడా చాలా బాగున్నాయి అంటూ అభిప్రాయపడ్డారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.