NEWS

సోలో ట్రిప్ కోసం 5 బెస్ట్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్.. తక్కువ బడ్జెట్‌తో వెళ్లి రావచ్చు!

ప్రతీకాత్మక చిత్రం Budget Destinations: కొత్త ప్రాంతాలకు వెళ్లడం, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవడం చాలామందికి ఒక అలవాటుగా ఉంటుంది. అయితే కొంతమంది ఎప్పుడూ సింగిల్‌గా టూర్ ప్లాన్ చేస్తుంటారు. వివిధ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లి అక్కడి నేచర్, లైఫ్‌స్టైల్‌ను ఎక్స్‌ప్లోర్ చేస్తుంటారు. వీరికి సోలో ట్రావెలింగ్ మంచి కిక్ ఇస్తుంది. సాధారణంగా మన దేశంలో సోలో ట్రావెలింగ్‌కి చాలా డెస్టినేషన్స్ బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నాయి. అయితే పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో ఇప్పుడు ఇతర దేశాలకు కూడా తక్కువ ధరలో టూర్ ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా కొన్ని దేశాలు సోలో ట్రావెలర్స్‌కు బెస్ట్ బడ్జెట్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్‌గా గుర్తింపు పొందాయి. అవేంటో చూడండి. శ్రీలంక ఈ దేశం, భారత్‌కు అతి దగ్గర్లో ఉన్న బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్. శ్రీలంక సోలో ట్రావెలర్స్‌కు బెస్ట్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. ఇక్కడికి వెళ్లేవారు హిస్టారికల్ ప్లేస్‌లు, ప్రకృతి అందాలు, బీచ్‌లు చూడవచ్చు. ఢిల్లీ నుంచి శ్రీలంకకు రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్ల ధర సుమారు రూ.20,000 ఉంటుంది. ఆ దేశంలో ఒక రాత్రి అకామడేషన్‌కు దాదాపు రూ.1,000 మాత్రమే ఖర్చు అవుతుంది. ఇక్కడికి 4-5 రోజులు టూర్ ప్లాన్ చేస్తే, మొత్తం ఖర్చు సుమారు రూ.35,000 అవుతుంది. ఈజిప్ట్ ఈజిప్ట్‌ ప్రపంచంలోని ముఖ్యమైన టూరిస్ట్ స్పాట్. భారత్ నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఈ దేశానికి వెళ్తుంటారు. పురాతన కాలం నాటి పిరమిడ్లు, ప్రాచీన కట్టడాలు, హిస్టారికల్ కల్చర్‌కు నిలయమైన ఈజిప్టుకు ఇండియా నుంచి రౌండ్-ట్రిప్ ఫ్లైట్ ఛార్జీలు సుమారు రూ.25,000 వరకు ఉంటాయి. తక్కువ బడ్జెట్‌తో ఫారెన్ టూర్ ప్లాన్ చేసేవారు ఈ దేశానికి వెళ్లడం మంచిది. 5-6 రోజుల ఈజిప్ట్‌ టూర్ కోసం రూ.40,000 ఖర్చు అవుతుంది. వియత్నాం సోలో ఇండియన్ ట్రావెలర్స్‌కు వియత్నాం బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌గా చెప్పుకోవచ్చు. ఈ దేశానికి రౌండ్-ట్రిప్ ఫ్లైట్ టికెట్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్ కాస్ట్ రూ.16,000 వరకు మాత్రమే ఉంటుంది. వియత్నాంలో అకామడేషన్ ఖర్చులు కూడా బడ్జెట్ రేంజ్‌లోనే ఉంటాయి. సాధారణంగా ఒక రాత్రికి రూ.1,000 కంటే తక్కువ ఉంటుంది. దాదాపు 5-6 రోజులు టూర్ ప్లాన్ చేస్తే, యావరేజ్‌గా రూ.40,000 ఖర్చు అవుతుంది. నేపాల్ ఇండియాతో సరిహద్దులు పంచుకునే నేపాల్, సోలో ఇండియన్ ట్రావెలర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. మౌంట్ ఎవరెస్ట్‌కు నిలయమైన నేపాల్‌కు రౌండ్-ట్రిప్ ఫ్లైట్ టికెట్ ఖర్చు రూ.9,000 మాత్రమే. ఆ దేశంలో ఒక రాత్రికి అకామడేషన్ కాస్ట్ రూ.1,000 కంటే తక్కువే అవుతుంది. నేపాల్‌లో వారం రోజుల పాటు ఉండేందుకు సుమారు రూ.25,000 ఖర్చు అవుతుంది. కంబోడియా ఈ దేశాన్ని కింగ్‌డమ్ ఆఫ్ వండర్ అని పిలుస్తారు. బలమైన సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి అందాలతో ఈ దేశం పర్యాటకులకు మంచి అనుభూతి కలిగిస్తుంది. కంబోడియాకు రౌండ్ ట్రిప్ టికెట్ల ధర సుమారు రూ.25,000 అవుతుంది. అకామడేషన్ కోసం ఒక రాత్రికి రూ.400 మాత్రమే ఖర్చవుతుంది. కంబోడియాకు 4-5 రోజులు టూర్ ప్లాన్ చేస్తే, రూ.35,000 ఖర్చు అవుతుంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.