NEWS

Ashwin Net Worth: వామ్మో.. అశ్విన్ ఆస్తులు అన్ని వందల కోట్లా.. ఒక్క ఐపీఎల్‌లోనే అంత సంపాదించాడా!

Ravichandran Ashwin Net Worth: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సీనియర్ బౌలర్ ఎన్నోసార్లు కష్టకాలంలో టీమ్‌ను గెలిపించాడు. అలాగే మైదానం బయట కూడా డిగ్నిటీ మెయింటెన్ చేస్తూ మిస్టర్ క్లీన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అశ్విన్ చెన్నై తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. కెరీర్ ప్రారంభంలో బ్యాట్స్‌మెన్‌గా ఆడి, ఆ తర్వాత ఆఫ్ స్పిన్నర్‌గా మారాడు. ఐపీఎల్‌లో చెన్నై తరఫున బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో నేషనల్ టీమ్‌కు సెలక్ట్ అయ్యాడు. క్రమంగా టెస్టు టీమ్‌లో ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. అయితే రిటైర్మెంట్ (Ashwin Retirement) నేపథ్యంలో ఇప్పుడు అందరి ఫోకస్ అతడి పర్సనల్ లైఫ్‌పై పడింది. అశ్విన్ సంపద, ఆస్తుల విలువ, కార్ కలెక్షన్ వంటి వివరాలు చూద్దాం. * ఇల్లు, ప్రాపర్టీస్ అశ్విన్‌కు చెన్నైలో సుమారు రూ.9 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు ఉంది. తన టేస్ట్, ప్రిఫరెన్స్‌కు తగ్గట్టు ఈ ఇంటిని నిర్మించుకున్నాడు. అలాగే అతడికి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 26 కోట్ల విలువైన ప్రాపర్టీస్ ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ద్వారా ఈ ఆస్తులు సంపాదించాడు. * లగ్జరీ కార్లు అశ్విన్‌ దగ్గర ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. మార్కెట్‌లోని కొన్ని అడ్వాన్స్‌డ్ వెహికల్స్‌ అతడి గ్యారేజీలో కనిపిస్తాయి. సుమారు రూ.6 కోట్ల విలువైన రోల్స్ రాయిస్, ఆడి Q7, అలాగే దాదాపు రూ.93 లక్షల విలువైన మరో లగ్జరీ వెహికల్ కొనుగోలు చేశాడు. * బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, వెంచర్లు అశ్విన్ అనేక టాప్ కంపెనీలకు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ చేశాడు, చేస్తున్నాడు. ఈ లిస్టులో ఒప్పో మొబైల్స్, ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం మింత్రా, బాంబే షేవింగ్ కంపెనీ, అరిస్టోక్రాట్ బ్యాగ్స్, డ్రీమ్11, స్పెక్స్‌మేకర్స్, జూమ్‌కార్, మన్నా ఫుడ్స్, కోకో స్టూడియో తమిళ్ వంటి కంపెనీలు ఉన్నాయి. అశ్విన్ తన పేరుతో సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించాడు. దీనికి 1.61 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. * అశ్విన్ ఆస్తుల విలువ స్పోర్ట్స్‌కీడా వెబ్‌సైట్ ప్రకారం, 2024 నాటికి రవిచంద్రన్ అశ్విన్ నికర సంపద విలువ రూ. 132 కోట్లు ($16 మిలియన్లు) ఉంది. బీసీసీఐ కాంట్రాక్ట్ ప్రకారం, గ్రేడ్ Aలో ఉన్న అశ్విన్ మ్యాచ్ ఫీజుతో కలిపి సంవత్సరానికి రూ.5 కోట్లు అందుకుంటున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతూ, ప్రతి సీజన్‌కు రూ. 5 కోట్లు సంపాదించాడు. 2008లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి, లీగ్ ద్వారా అతడు మొత్తం రూ.82 కోట్లు సంపాదించాడు. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నప్పుడు అత్యధికంగా రూ.7.6 కోట్ల జీతం అందుకున్నాడు. IPL 2025 మెగా వేలంలో అతన్ని హోమ్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌ రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.