NEWS

Coolie Movie: రజనీకాంత్ సినిమాలో ఊపేంద్ర... అసలేం ప్లాన్ చేస్తున్నావ్ లోకేష్ మామ..!

Rajinikanth పుష్కర కాలం తర్వాత జైలర్‌తో మాస్‌ కంబ్యాక్ ఇచ్చాడు సూపర్‌ స్టార్‌ రజనీ. హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు కాదు. విక్రమ్‌, పొన్నియన్ సెల్వన్‌ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను పదిరోజల్లోనే దాటేశాడు. ఒక్క తమిళంలోనే కాదు తనకు సాలిడ్‌ మార్కెట్‌ ఉన్న తెలుగులోనూ మాస్‌ కంబ్యాక్‌ ఇచ్చాడు. నిజానికి రజనీ సినిమాలు గతకొంత కాలంగా తెలుగులో కనీసం పబ్లిసిటీ ఖర్చులు ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేకపోతున్నాయి. కానీ జైలర్‌ మాత్రం ఊహించని రేంజ్‌లో కలెక్షన్‌లు కొల్లగొట్టింది. ఏడు పదుల వయసులోనూ రూ.600 కోట్లకు పైగా కలెక్షన్‌లు సాధించి సూపర్‌ స్టార్‌ రేంజ్‌ అంటే ఇది అని విమర్శకులకు సమాధానం చెప్పాడు. ప్రస్తుతం రజనీ జై భీమ్‌ దర్శకుడు జ్ఞానావేల్‌ రాజాతో 170వ సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు లోకేష్ కనగారాజ్‌తో కూలీ సినిమా కూడా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ ఆడియెన్స్‌లో మాములు ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేయలేదు. గోల్డ్ మాఫీయా సామ్రాజ్యంలోకి కూలీ పని చేసుకుంటూ బ్రతికే వాడు వెళ్లి విలన్లను ఊచకోత కోస్తూ మొండిగా నిలబడిపోతాడు అనే రేంజ్‌లో రజనీ క్యారెక్టర్‌ను ఆ మధ్య రిలీజైన గ్లింప్స్‌లో చూపించారు. ఇక ఆరు పదుల వయసు దాటిన కమల్ తో ఆహా అనిపించే రీతిలో యాక్షన్ స్టంట్స్ చేయించి విక్రమ్ తో ఇండస్ట్రీ హిట్టు కొట్టించిన లోకేష్.. ఇప్పుడు రజనీ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో అని అందరూ అమితాసక్తి తో ఉన్నారు. ఈ సినిమాలో కమల్ కూతురు శృతిహాసన్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు.. ఇందులో శృతి, రజనీకు కూతురిగా నటించబోతుందట. మరోవైపు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా కీలక రోల్ ప్లే చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో మరో క్రేజీ హీరో చేరిపోయాడు. కన్నడతో పాటు టాలీవుడ్‌లోనూ తిరుగులేని క్రేజ్ ఉన్న ఉపేంద్ర.. ఈ మూవీలో క్రేజీ రోల్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇలా ఆయా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యాక్టర్స్‌ను కాస్టింగ్ చేస్తూ… సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచేసుకుంటూ పోతున్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.