NEWS

Neeraj Chopra: అర్షద్ నదీమ్‌కు డోపింగ్ టెస్ట్.. నీరజ్ చోప్రాకు గోల్డ్ మెడల్.. ఈ వార్తలో నిజమెంత?

పారిస్ ఒలింపిక్స్‌ జావెలిన్‌ త్రోలో గోల్డ్ మెడల్‌ సాధించిన పాకిస్థాన్​ అథ్లెట్​ అర్షద్​ నదీమ్, (Arshad Nadeem) ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. అతడు 40 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పాకిస్థాన్‌కు గోల్డ్ మెడల్ అందించి, ఆ దేశంలో హీరో అయిపోయాడు. పేద కుటుంబం నుంచి వచ్చినా, ఇంత పెద్ద విజయం సాధించడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రభుత్వం నుంచి అతడికి భారీగా అవార్డులు, రివార్డులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని ఒక కాంట్రవర్సీ (Controversy) చుట్టుముట్టింది. జావెలిన్‌ త్రో ఫైనల్స్ తర్వాత నదీమ్‌కు డోపింగ్ టెస్ట్ చేయగా, అతడు నిషేధిత పదార్థాలను వాడినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. అందుకే అతడు 92.97 మీటర్ల దూరం ఈటె విసరగలిగాడంటూ ప్రస్తుతం కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. నదీమ్‌ మోసం చేశాడు కాబట్టి ప్రస్తుత సిల్వర్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు గోల్డ్ మెడల్ ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ ఆరోపణలు నిజమేనా? డోపింగ్ టెస్ట్ అంటే ఏంటి? నదీమ్‌కు ఆ టెస్ట్ ఎందుకు చేశారు, గోల్డ్ మెడల్ కోల్పోబోతున్నాడా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. * నదీమ్‌కు డోపింగ్ టెస్ట్? ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని రకాల క్రీడా పోటీల్లో స్పోర్ట్స్ పర్సన్స్‌ను తప్పకుండా చెకప్ చేస్తారు. డ్రగ్స్, స్టెరాయిడ్స్‌, హ్యూమన్ పర్ఫామెన్స్‌ను పెంచే ఇతర మెడిసిన్స్ ఏమైనా వాడారా లేదా అని తెలుసుకోవడానికి ఈ పరీక్షలు చేస్తారు. దీన్నే డోపింగ్ టెస్ట్ అంటారు. ఈ పరీక్షల్లో మూత్రం, రక్తం నమూనాలను తీసి బ్యాన్డ్‌ సబ్‌స్టెన్సెస్‌ల జాడలు కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు. no expression on his face Doping Test required for Arshad Nadeem pic.twitter.com/mPHrGjmrlg అయితే ఇప్పటికే చాలా మంది క్రీడాకారులు ఈ పరీక్షల్లో పట్టుబడ్డారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లోనూ ఇరాన్‌ బాక్సర్‌ సజ్జాద్ సెహ్నే, నైజీరియన్‌ బాక్సర్‌ సింథియా డోపింగ్‌కి పాల్పడినట్లు తేలింది. అర్షద్ నదీమ్‌ కూడా చీటింగ్ చేశాడని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. అర్షద్ నదీమ్‌పై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అందరూ జావెలిన్‌ను 88 మీటర్ల నుంచి 89 మీటర్ల వరకు విసరగలిగారని, అలాంటప్పుడు నదీమ్ 92.97 మీటర్లు ఎలా విసిరాడని ప్రశ్నిస్తున్నారు. ఏవో నిషేధిత పదార్థాలు వాడినట్లు అర్షద్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయని ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ మరొకరు ఆరోపించారు. అయితే పాక్ అథ్లెట్‌కు కొందరు మద్దతు ఇస్తున్నారు. ఎక్కువ మంది ట్రోలింగ్ చేస్తున్నారు. * నీరజ్ చోప్రాకు గోల్డ్ మెడల్? ఒలింపిక్స్‌లో మెడల్స్‌ గెలిచిన వాళ్లు నిజంగానే సొంత శక్తితో గెలిచారా లేదా అని తెలుసుకోవడానికి డోపింగ్ పరీక్షలు చేయడం కామన్. ఈ పరీక్షలు చాలా కాలంగా జరుగుతున్నాయి. జావెలిన్ త్రో పోటీ తర్వాత అర్షద్ నదీమ్, నీరజ్ చోప్రా, ఆండర్సన్ పీటర్స్‌ను కూడా పరీక్షించారు. వాళ్లు మైదానంలో ఉన్నప్పుడే ఈ పరీక్ష ఫలితాలు వచ్చాయి. పతకాలు గెలిచిన క్రీడాకారులందరికీ డోపింగ్ టెస్ట్ చేయడం కామన్. ఇది ఒక రూల్. అంటే, అర్షద్ నదీమ్ ఏదైనా తప్పు చేశాడని అనుమానించి ఇలా చేయలేదు. అతన్ని కూడా ఇతర అథ్లెట్స్ మాదిరిగానే టెస్ట్ చేశారు, కానీ డోపీగా తేలలేదు. సోషల్ మీడియా ప్రచారం అంతా ఫేక్. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.