NEWS

Moon: పసిఫిక్ మహాసముద్రంపై అస్తమిస్తున్న చంద్రుడు.. ఈ దృశ్యం మీకు జీవితాంతం గుర్తుంటుంది..!

(Photo Credit: X) సూర్యోదయం, సూర్యాస్తమయం చూసేందుకు ఎంతో బాగుంటాయి. చందమామ ఉదయించే, అస్తమించే విషయాలు సైతం ఎంతో ఆకట్టుకుంటాయి. ప్రదేశాన్ని బట్టి జాబిల్లి ఉదయించే, అస్తమించే దృశ్యాల అందాలు మారుతుంటాయి. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా (NASA) అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైన ప్రదేశాల్లో సన్ సెట్, మూన్ సెట్ అందాలను క్యాప్చర్ చేసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది. ఇటీవల నాసా వ్యోమగామి మాథ్యూ డొమినిక్, పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean) మీద చంద్రుడు అస్తమిస్తున్న అరుదైన ఫొటోను క్యాప్చర్ చేశారు. దీంట్లో చంద్రుడు బ్లూ కలర్‌లో అందంగా కనిపిస్తున్నాడు. చుట్టూ ఉన్న మేఘాలు, భూమి వాతావరణం వల్ల జాబిల్లికి ఆ రంగు వచ్చింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు. ఈ ఫొటోలో ఆకాశంలో అస్తమిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆకాశం పసిఫిక్ మహాసముద్రం రెండూ కలిసిపోయినట్లుగా కనిపించే చోట చందమామ అస్తమించే విజువల్ హైలెట్. చంద్రుడు ఇంత బాగా ఉంటాడా, ప్రకృతి ఇంత అద్భుతంగా కనిపిస్తుందా? అని ఫొటో చూసిన ప్రతి ఒక్కరు అనుకోకుండా ఉండలేరు. మాథ్యూ తీసిన ఫొటో చాలా మందికి నచ్చింది. అతడు ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఈ ఫొటోకు ఆరు లక్షల దాకా వ్యూస్ వచ్చాయి. ‘చంద్రుడు పసిఫిక్ మహాసముద్రం మీద అస్తమిస్తున్నాడు. హవాయి దగ్గర ఉండే ఒక తుఫాను ఫొటోలు తీయడానికి నేను కుపోలా (Cupola) దగ్గరకు వెళ్లాను. కానీ ఆ తుఫాను (Tropical Storm Hone) దాటగానే, చంద్రుడు అస్తమించడం మొదలుపెట్టాడు.’ అని మాథ్యూ ఈ అరుదైన ఇమేజ్‌కు ఒక క్యాప్షన్ యాడ్ చేశారు. కుపోలా అంటే అంతరిక్ష నౌకలోని ఒక భాగం, దీని నుంచి భూమిని, అంతరిక్షాన్ని చూడవచ్చు. The moon setting over the Pacific. Went to the cupola to shoot Tropical Storm Hone near Hawaii but right after we passed by the storm the moon started to set. 400mm, ISO 500, 1/20000s shutter speed, f2.8, cropped, denoised. pic.twitter.com/YtboVnRNpF మాథ్యూ డొమినిక్ ఈ ఫొటో ఎలా తీశానో కూడా చెప్పారు. 400mm, ISO 500, f2.8 కెమెరా లెన్స్ సెట్టింగ్స్‌తో క్యాప్చర్ చేసినట్లు తెలిపారు. కెమెరా లెన్స్‌ ఉపయోగించి 1/20000s షట్టర్ స్పీడ్‌తో పిక్ తీశానని అన్నారు. క్రాప్ చేసి ఎక్స్‌ట్రా డీటెయిల్స్ తీసేసి డీనాయిస్డ్‌ చేసినట్లు కూడా తెలిపారు. అలా కొంచెం మార్పులు చేసి, మరింత అందంగా చూపించారు. ఈ అద్భుతమైన ఫొటో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘చాలా బాగుంది’, ‘పర్ఫెక్ట్’, ‘అద్భుతం’ అని కామెంట్లు చేశారు. చాలా మందికి ఆ ఫొటో బాగా నచ్చింది. ఈ అద్భుతమైన ఫొటో తీసినందుకు మాథ్యూకి కృతజ్ఞతలు తెలిపారు. ఒక సైన్స్ టీచర్ మాథ్యూ ఇంకొంచెం కాలం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉండి ఇలాంటి అద్భుతమైన ఫొటోలు తీస్తూ ఉండాలని సరదాగా అన్నారు. మరొకరు అంతరిక్షం చాలా పెద్దదని అన్నారు. చంద్రుడికి చేరడానికి దాదాపు మూడు రోజులు పడుతుందని, అంతరిక్షం చాలా అద్భుతంగా ఉంటుందని కానీ అదే సమయంలో మనం ఎంత చిన్నవారమో గుర్తు చేస్తుందని కొందరు చెప్పారు. మాథ్యూ ఆ ఫొటో ఎలా తీశాడో అనే విషయంలో ఇంకా కొన్ని వివరాలు చెప్పారు. చంద్రుడు ఎంత వేగంగా అస్తమిస్తుందో మనకు అర్థమయ్యేలా, చంద్రుడు కనిపించకుండా పోయే వరకు ఫొటోలు తీస్తూనే ఉన్నానని చెప్పారు. మొదటి ఫొటోను రాత్రి 9:34:45 గంటలకు తీశాడు. చంద్రుడు కనిపించే చివరి ఫొటోను 14 సెకన్ల తర్వాత, రాత్రి 9:34:59 గంటలకు తీశారు. అంతేకాకుండా, మాథ్యూ మరో పని చేయడానికి కుపోలా అనే ప్రదేశానికి వెళ్లారు. అక్కడే రాత్రి 9:34 గంటల సమయంలో చంద్రుడు కనిపించడం గమనించి, 9:34:13 గంటలకు మొదటి ఫొటో తీశారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.