NEWS

Travelling: కేవలం 10 సెకన్లలో మూడు దేశాలు చుట్టేయొచ్చు.. ఎలాగో తెలుసా?

ఉద్యోగులు, వ్యాపారస్తులు అందరికీ కొన్ని హాబీలు, ఆసక్తులు ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి సంపాదనలో కొంత భాగాన్ని పక్కన పెడుతుంటారు. చాలా మందికి ట్రావెలింగ్‌ అంటే ఇష్టం ఉంటుంది. అందమైన ప్రదేశాలను చూడాలని, విభిన్న సంస్కృతులను తెలుసుకోవాలని కోరుకుంటారు. ఇలాంటి వారు టూర్లకు స్పెషల్ బడ్జెట్ కేటాయిస్తారు. పర్యాటకులు వీలైనన్ని ఎక్కువ దేశాలు విజిట్ చేయాలని ప్లాన్‌ చేస్తుంటారు. ఇలాంటి వారికి కేవలం పది సెకన్లలో మూడు దేశాలకు ప్రయాణించే అవకాశం వస్తే..? అద్భుతంగా ఫీల్‌ అవుతారు కదా. ఇది రియల్ వరల్డ్‌లో కూడా నిజంగా సాధ్యమే. ఎలాగో తెలుసుకుందాం. మిర్రర్ కథనం ప్రకారం, ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎమ్ (Em) (@emsbudgettravel) షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ ద్వారా మూడు దేశాలను ఒకేసారి ఎలా సందర్శించవచ్చో తెలుసుకోవచ్చు. ఇందుకు స్విట్జర్లాండ్‌ను విజిట్ చేయాలని, అక్కడి బాసెల్‌లో ఆగాలని ఎమ్ పేర్కొంది. ఎమ్ పోస్ట్‌ ప్రకారం, బాసెల్‌లోని కొబ్లెస్టోన్ స్ట్రీట్స్‌, మధ్యయుగపు ఓల్డ్ టౌన్ ఆకట్టుకుంటాయి. చిన్న, గుండ్రని రాళ్లతో నిర్మించిన కొబ్లెస్టోన్ స్ట్రీట్స్‌ బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తాయి. సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే స్విట్జర్లాండ్ అతిపెద్ద కార్నివాల్, ‘కార్నివాల్‌ ఆఫ్‌ బాసెల్’ను తప్పక చూడాలని ఆమె పేర్కొంది. * బాసెల్‌ నుంచి ట్రావెల్‌ ప్లాన్‌ సమీపంలోని నగరాలు, ప్రాంతాలను సందర్శించడానికి బాసెల్ చాలా అనుకూలంగా ఉంటుందని ఎమ్ పేర్కొంది. స్విట్జర్లాండ్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన దేశాల్లో ఒకటి. అయినా బడ్జెట్‌ ధరలోనే ట్రావెల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఎమ్ బాసెల్‌ విజిట్ చేయగలిగింది. నాలుగు రోజుల పాటు ఫ్లైట్‌ జర్నీలు, అకామడేషన్, ఫుడ్, లోకల్‌ ట్రాన్స్‌పోర్ట్‌, ఇతర ఖర్చులకు £149 (సుమారు రూ.15,881.14) మాత్రమే ఖర్చు అయింది. * డ్రైలాండెరెక్ స్మారక చిహ్నం (Dreiländereck Monument) బాసెల్‌లోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో డ్రైలాండెరెక్ స్మారక చిహ్నం ఒకటి. ఇక్కడ మూడు దేశాల సరిహద్దులు కలుస్తాయి. ఈ ప్రదేశంలో కేవలం పది సెకన్లలో కాలినడకన స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ సరిహద్దులను దాటవచ్చు. అంటే ఒకే సమయంలో మూడు దేశాలను సందర్శించినట్లు అవుతుంది. * అద్భుత అందాలు ఇక్కడ మూడు దేశాల సరిహద్దులను త్వరగా దాటడమే కాకుండా, బాసెల్ నగరం అందాలను కూడా ఆస్వాదించవచ్చు. ఈ నగరం సుందరమైన రైన్ నదికి నిలయంగా ఉంది. ప్రజలందరు రిలాక్స్‌ అవ్వడానికి నది ఒడ్డుకు చేరుకుంటారు. రైన్ నదిపై తెడ్డుతో సంప్రదాయ పడవలో ప్రయాణం బాసెల్‌లో తప్పకుండా ఎంజాయ్‌ చేయాల్సిన యాక్టివిటీస్‌లో ఒకటి. వీడ్లింగ్ అని పేర్కొనే ఈ పడవను చెక్కతో తయారు చేస్తారు. మధ్య యుగాల నుంచి ఈ పడవలను ఉపయోగిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని ప్రసిద్ధ ఆర్ట్ మ్యూజియం ‘కున్స్ట్‌ మ్యూజియం బాసెల్’ కూడా ఆకట్టుకుంటుంది. ఈ మ్యూజియంలో 14 నుంచి 20వ శతాబ్దాల నాటి పెయింటింగ్‌ కలెక్షన్‌ ఉంది. బాసెల్ సందర్శకులకు స్విట్జర్లాండ్ సంస్కృతి, ప్రకృతి సౌందర్యాన్ని, అలాగే మూడు వేర్వేరు దేశాల సరిహద్దుల్లో నడిచే అద్భుత అవకాశాన్ని అందిస్తుంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.