NEWS

PV Sindhu Networth : ఆటలోనే కాదు సంపాదనలోనూ పీవీ సింధు తోపు.. బ్యాడ్మింటన్ క్వీన్ నెట్‌వర్త్ ఎంతంటే?

పీవీ సింధు (ఫైల్ ఫోటో) PV Sindhu Networth : భారత బ్యాడ్మింటన్ ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత పుల్లెల గోపిచంద్‌ది అయితే.. క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం ఇద్దరు. సైనా నెహ్వాల్ తో దేశంలో బ్యాడ్మింటన్ క్రేజ్ మొదలైతే.. పీవీ సింధుతో పీక్స్ కు చేరింది. ఒక దశలో తమ అమ్మాయిలు కూడా పీవీ సింధులా బ్యాడ్మింటన్ లో రాణించాలని కలలు కన్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా 2016 రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన తర్వాత చాలా మంది బ్యాడ్మింటన్ అకాడమీల్లో చేరారు. దానికి కారణం పీవీ సింధు. రెండుసార్లు ఒలింపిక్ పతకం గెలవడంతో పాటు ప్రపంచ చాంపియన్ ఘనతను అందుకున్న ఘనత సింధుది. 29 ఏళ్ల సింధు మరో ఇన్నింగ్స్ ను ఆరంభించింది. డిసెంబర్ 22న ఆమె పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకుంది. రాజస్థాన్‌, ఉదయ్‌పూర్‌లోని ఓ దీవిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య రాత్రి 11.20 గంటలకు మూడు ముళ్ల బంధంతో సాయి-సింధు ఒక్కటయ్యారు. ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్ ఈ వేడుకకు వేదికగా నిలిచింది. బ్యాడ్మింటన్ లో టైటిల్స్ నెగ్గితే అచ్చే ప్రైజ్ మనీ చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఒక దశలో పీవీ సింధు సంపాదన క్రికెటర్లతో సమానంగా ఉండేది. ప్రస్తుతం ఆమె నికర విలువ దాదాపుగా రూ. 60 కోట్లుగా ఉంది. ఇందులో ప్రైజ్ మనీ రూపంలో వచ్చింది చాలా తక్కువ. ఇక ప్రకటనలు, ప్రచారకర్తగా ఉంటూ సంపాదించిందే ఎక్కువ. ప్రస్తుతం సింధు దగ్గర విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయి. బీఎండబ్ల్యూ ఎక్స్ 5, బీఎండబ్ల్యూ 320డి, డాట్సన్ రెడి గో, మహింద్రా థార్ వంటి కార్లు ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా పీవీ సింధు ఆటలో పెద్దగా రాణించడం లేదు. 2023లో పేలవ ప్రదర్శన చేసింది. ఈ ఏడాది కూడా ఆమె ఆట అంతంత మాత్రంగానే ఉంది. భారత్ లో బ్యాడ్మింటన్ కు పాపులారిటీ తెచ్చిన ప్లేయర్లలో పీవీ సింధు మొదటి వరుసలో ఉంటారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.