NEWS

New Year Smartphone: ఈ నెలలో రిలీజ్ అయ్యే ఫోన్స్ ఎంటో తెలుసా.. జస్ట్ రూ.15 వేలకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్..

కొత్త సంవత్సరం ప్రారంభమైంది. న్యూ ఇయర్ ఆఫర్లు, పండగ ఆఫర్లు వచ్చేస్తాయి. స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఫోన్స్ ఎప్పుడు లాంట్ అవుతాయా కొందామా అని వెయిట్ చేస్తూ ఉండుంటారు. అందుకే మానుఫ్యాక్చర్లు సైతం కొత్త మోడళ్లు విడుదల చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ నెలలో అనేక పెద్ద కంపెనీ ఫోన్‌ల లాంచ్‌లు జరుగనున్నాయి, వాటిలో అత్యంత ఊహించదినవి Galaxy S25 సిరీస్. దీని తో పాటు, OnePlus 13 సిరీస్. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవ్వనుంది. Xiaomi, Poco సైతం తమ కొత్త ఫోన్లను జనవరిలో విడుదల చేయనున్నారు. అయితే వాటి స్పెసిఫికేషన్లు, ఫీచర్స్ చూద్దాం. OnePlus 13 సిరీస్: ఈ ఫోన్ జనవరి 7న గ్రాండ్ లాంచ్ కానుంది. OnePlus తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లను, OnePlus 13, OnePlus 13R ను జనవరి 7న లాంచ్ చేయనుంది. ఈ రెండు ఫోన్లు హాసెల్‌బ్లాడ్-బ్రాండెడ్ కెమెరా సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది. ఫోన్‌లలో X2 OLED ప్యానెల్‌తో అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్లు ఉంటాయి. Samsung Galaxy S25 సిరీస్: ఈ ఫోన్ జనవరి మూడవ వారంలో లాంచ్ కానుంది. Samsung తన Galaxy S25 సిరీస్‌ను Galaxy Unpacked ఈవెంట్‌లో ప్రకటించనుంది. ఇందులో Galaxy S25, Galaxy S25+, Galaxy S25 Ultra మోడళ్లతో రాబోతున్నాయి. ఈ ఫోన్లలో అత్యాధునిక AI ఫీచర్లు ఉండవచ్చని, అలాగే శామ్సంగ్ కొత్త డిజైన్, ఫీచర్లను అందిస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. Poco X7 సిరీస్: ఈ ఫోన్ జనవరి 9న విడుదల కానుంది. Poco, Poco X7, Poco X7 Pro మోడళ్లతో Poco X7 సిరీస్‌ను జనవరి 9 న లాంచ్ చేయనుంది. దీనికి ముందు పోన్ Poco X6 సిరీస్, విజయాన్ని అనుసరించి, ఈ కొత్త సిరీస్ మెరుగైన పనితీరును అందించడానికి రూపొంది ఉంటుంది. Xiaomi Redmi 14C: ఈ ఫోన్ జనవరి 6న విడుదల అవుతుంది. Xiaomi, తన బడ్జెట్ ఫ్రెండ్లీ Redmi 14C స్మార్ట్‌ఫోన్‌ను జనవరి 6న లాంచ్ చేస్తుంది. ఇది 5G సపోర్ట్, 50MP బ్యాక్ కెమెరా, డ్యూయల్-సిమ్ 5G ఫీచర్లతో వస్తుంది. Oppo Reno 13 సిరీస్: ఈ ఫోన్ ఈ నెలలో విడుదల అవుతుంది. Oppo సైతం తన Reno 13 సిరీస్‌ను ఈ నెలలో లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ 120Hz రిఫ్రెష్ రేట్, 5600mAh బ్యాటరీ, MediaTek Dimensity 8350 చిప్‌సెట్‌ను అందించనుంది. ఈ నెలలో లాంచ్ కానున్న ఫోన్లు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చనుంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.