Team India వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో అన్ని దేశాల క్రికెట్ టీమ్స్ సత్తా చాటుతున్నాయి. ఈసారి ఎలాగైనా డబ్ల్యూటీసీ టైటిల్ గెలవాలని టీమ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు WTC స్టాండింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. అయితే టీమ్ ఇండియా ఈ పొజిషన్‌లో కొనసాగాలంటే, ఇతర దేశాల టెస్ట్ సిరీస్‌ల ఫలితాలు కూడా కలిసి రావాలి. టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్‌ను బంగ్లాదేశ్ ఓడించడం వంటి ఊహించని ఫలితాలు వస్తే, పరిస్థితులు మారవచ్చు. ఎలాంటి సందర్భాల్లో టీమ్ ఇండియా WTC స్టాండింగ్స్‌లో టాప్ ప్లేస్ కోల్పోవచ్చో చూద్దాం. ప్రస్తుతం డబ్యూటీసీ స్టాండింగ్స్‌లో ఇండియా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది. మూడో పొజిషన్‌లో న్యూజిలాండ్, ఫోర్త్ ప్లేస్‌లో ఇంగ్లాండ్ ఉన్నాయి. టీమ్ ఇండియా పొజిషన్‌పై కొన్ని టెస్ట్ సిరీస్‌ల రిజల్ట్స్ ప్రభావం చూపనున్నాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఇండియా, ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. అంతకు ముందు భారత్.. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై టెస్టు సిరీస్‌లు ఆడనుంది. * బంగ్లాదేశ్ నుంచి గట్టి పోటీ! బంగ్లాదేశ్‌పై సొంతగడ్డపై జరిగే రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ భారత్ మంచి ప్రదర్శన చేయవచ్చు. ఒకవేళ భారత్ ఓడిపోయినా లేదా ఒక మ్యాచ్ డ్రాగా ముగిసినా.. టీమ్ ఇండియాను వెనక్కినెట్టి ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్‌కు వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఇంగ్లీష్ టీమ్ గెలిచింది. రెండు టెస్టుల్లోనూ ఆ టీమ్ గెలిస్తే, స్టాండింగ్స్‌లో ముందుకెళ్లే అవకాశం ఉంది. * డబ్ల్యూటీసీ స్టాండింగ్స్‌లో ఏం జరుగుతుంది? - బంగ్లాదేశ్‌పై భారత్ రెండు టెస్టులు గెలిస్తే, టాప్ ప్లేస్ నిలుపుకుంటుంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంటుంది. - బంగ్లాదేశ్‌పై రెండు టెస్ట్ మ్యాచ్‌లు డ్రా అయితే, భారత్ రెండో స్థానానికి పడిపోతుంది. ఆస్ట్రేలియా టాప్ ప్లేస్‌కు వస్తుంది. - భారత్ మొదటి టెస్టులో గెలిచి, మరొకటి డ్రా అయితే, టీమ్ ఇండియా మొదటి స్థానంలోనే ఉంటుంది, ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతుంది. - టీమ్ ఇండియా మొదటి టెస్టులో ఓడిపోయి, మరొకటి డ్రా అయితే.. ఫస్ట్, సెకండ్ పొజిషన్స్ మారుతాయి. ఇండియా ఫస్ట్ ప్లేస్ కోల్పోతుంది. - రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడిపోతే, ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్‌కు వస్తుంది. బంగ్లాదేశ్ రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉంటాయి. ఈ ఐదు సందర్భాల్లో టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ స్టాండింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే బంగ్లాదేశ్‌పై రెండు టెస్ట్ మ్యాచ్‌లు గెలవడంపై రోహిత్ సేన దృష్టి పెట్టాలి. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా, డ్రా అయినా పరిస్థితులు ప్రతికూలంగా మారవచ్చు. * ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్ మొదటి టెస్టు: సెప్టెంబర్ 19, చెన్నై రెండో టెస్టు: సెప్టెంబర్ 27, కాన్పూర్ * ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ టెస్టు: అక్టోబర్ 16, బెంగళూరు రెండో టెస్టు: నవంబర్ 1, పూణె * బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 నవంబర్‌లో ఆస్ట్రేలియాలో బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ మొదలవుతుంది. సిరీస్‌లోని ఐదు టెస్ట్‌లు 2025 జనవరి వరకు జరుగుతాయి. మొదటి టెస్టు: నవంబర్ 22, పెర్త్ రెండో టెస్టు: డిసెంబర్ 6, అడిలైడ్ మూడో టెస్టు: డిసెంబర్ 14, బ్రిస్బేన్ నాలుగో టెస్టు: డిసెంబర్ 26, మెల్‌బోర్న్ ఐదో టెస్టు: జనవరి 3, సిడ్నీ None
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
Featured News
Latest From This Week
జనవరి 10న సింహాచలంలో ఉత్తర ద్వార దర్శనం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Kajal Aggarwal: 'కన్నప్ప' సినిమా నుంచి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.