NEWS

చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు.. నడి సంద్రంలో ఇలా..

విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో మర బోటు మునిగిపోయింది.. మత్స్యకారులకు వేటే జీవనధారం.. లక్షలు పెట్టి బోట్లు తయారు చేయించి.. దాన్నే దైవంగా భావించి వేట సాగిస్తూ ఉంటారు.. అటువంటి బోటుకు ఏదైనా సమస్య తలెత్తితే ఆ మత్స్యకారుల ఆవేదన అంతా ఇంతా కాదు. నడి సంద్రమైనా సరే.. తమ ప్రాణాలను పణంగా పెట్టేందుకు వెనుకాడరు గంగ పుత్రులు. అటువంటి ఘటనే విశాఖ తీరానికి సమీపంలో జరిగింది. ఆ బోటును రక్షించి ఒడ్డుకు తీసుకొద్దామనే చివరి వరకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇంజిన్ ఫెయిలై బోటు ఆర్కే బీచ్ వైపు వచ్చి.. కెరటాల్లో సగం వరకు మునిగిపోయింది. అయితే అందులో ఉన్న మత్స్యకారులను మరో బోటులో వెళ్లి కాపాడారు. తమకు జీవనధారమైన బోటు మునిగిపోవడంతో ఆ గంగపుత్రులు కన్నీటి ఆవేదన అంతా ఇంతా కాదు. విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో మర బోటు మునిగిపోయింది. వేట చేసి తిరిగి వస్తుండగా బోటుకు ఇంజన్ ఫెయిల్ అవడంతో ప్రమాదం జరిగిగింది. అంతా చూస్తూ ఉండగానే మారబోటు ఒడ్డువైపు కొట్టుకొస్తూ కళ్ళముందే మునిగిపోయింది. జెట్టికి మైలు దూరంలో ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తింది. యాంకర్ వేసి నిలబెడదామని చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. తాడు తెగిపోయి ఆ బోటు.. పట్టు తప్పి ఒడ్డు వైపు కెరటాల తాకిడికి వెళ్ళిపోతుంది. సమాచారం అందుకున్న వారు మరో బోటులో వెళ్లి బోటును తిరిగి సముద్రంలో యాంకరింగ్ చేసేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా శ్రమించారు. అయినా కెరటాలు, గాలి తాకిడికి నిలవలేదు. దీంతో ఇక.. ఆ బోటులో ఉన్న వారిని రెస్క్యూ చేశారు మత్స్యకారులు. అయితే బోటు యజమాని మాత్రం అందులోనే ఉంటూ బోటును సేఫ్ గా ఒడ్డుకు తెచ్చేందుకు చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నం ఫలించలేదు. అలా అలా గాలి వాటానికి ఆర్కే బీచ్ వైపు వచ్చిన బోటును సందర్శకులు చూస్తూ ఉండిపోయారు. కళ్ళముందే ఆ బోటు మెల్లమెల్లగా నీటిలో మునిగిపోయింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. బోటు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నరు ఫిషరీస్ అధికారులు. ‘ఐఎన్-ఎపి-ఎంఎం-వి529 నెంబరు గల బోటు అయిదుగురు మత్స్యకారులతో చేపలవేటకు గురువారం తెల్లవారు జామున వెళ్లింది. వేట ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఇంజను ఫెయిలై బోటు ప్రమాదంలో చిక్కుకుంది. బోటు వెనక్కి తేవడం క్లిష్టంగా మారింది. బోటులో ఉన్న వాసుపల్లి రాజు, అప్పన్న, లక్ష్మయ్య, రాజు, ప్రవతీయలను ఆర్కే బీచ్ లైఫ్ గార్డులు, మెరైన్ పోలీసుల సహాయంతో అతికష్టం మీద రెస్క్యు చేశారు’ అని అన్నారు మత్స్యశాఖ జేడీ విజయ. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.