టీమిండియా IND vs AUS 4th Test : బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు టీమిండియా (Team India)కు భారీ షాక్ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైంది. నాలుగో టెస్టు కోసం నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మకు గాయం అయినట్లు సమాచారం. ఎంసీజీలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. త్రోడౌన్ స్పెషలిస్ట్ దయా వేసిన బంతి రోహిత్ ఎడమ మోకాలికి బలంగా తగిలింది. ఈ ఘటన తర్వాత రోహిత్ వెంటనే నెట్స్ నుంచి బయటకు వెళ్లి, వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఫిజియో అతని మోకాలిపై ఐసింగ్ చేస్తూ కనిపించాడు. అయితే రోహిత్ శర్మ గాయం అంత తీవ్రమైనది కాకపోవచ్చని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుంచి ఆరంభం కానుంది. ఈ గాయం పెద్దది కాకపోవచ్చని జట్టు వర్గాలు చెబుతున్నాయి. రోహిత్ శర్మ దంపతులకు రెండో సంతానం కలగడం వల్ల తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరమైన సంగతి తెలిసిందే. దాంతో బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఇక రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. మూడో టెస్టు డ్రాగా ముగిసింది. గత కొంత కాలంగా రోహిత్ శర్మ పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు.రోహిత్ తన చివరి మూడు ఇన్నింగ్స్ ల్లో కేవలం 3, 6, 10 పరుగులు మాత్రమే చేశాడు. ప్రైమ్ మినిస్టర్స్ XIతో జరిగిన పింక్ బాల్ వార్మప్ మ్యాచ్‌లోనూ అతను సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయ్యాడు. గబ్బా టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. డిసెంబర్ 26న ఎంసీజీలో జరిగే నాలుగో టెస్ట్ భారత్‌కు కీలకంగా మారింది. 2018లో ఇదే వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరగ్గా భారత్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో రోహిత్ 63 నాటౌట్‌గా నిలిచాడు. దాంతో నాలుగో టెస్టులో రోహిత్ శర్మ ఫామ్ లోకి వస్తాడనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. None
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
Featured News
Latest From This Week
జనవరి 10న సింహాచలంలో ఉత్తర ద్వార దర్శనం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Kajal Aggarwal: 'కన్నప్ప' సినిమా నుంచి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
NEWS
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.