NEWS

Krutrim: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఓలా కంపెనీ బంపర్ ఆఫర్!

Krutrim: ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ చెందిన అంకుర సంస్థ Krutrim వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దేశంలోని అన్ని IITల విద్యార్థులు, ఫ్యాకల్టీల కోసం ఉచిత క్రెడిట్‌లను అందిస్తోంది . IIT ఢిల్లీలో ఇటీవల జరిగిన INAE వార్షిక కన్వెన్షన్ 2024లో అగర్వాల్ మాట్లాడుతూ అన్ని IITలకు ఎన్ని సంవత్సరాలైనా ఉచితంగా Krutrim క్రెడిట్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఉచిత కృత్రిమ్ (Krurtrim) క్రెడిట్‌ ఆ మాటను నిలబెట్టుకోవడానికి Krutrim వినూత్న నిర్ణయం తీసుకుంది. అందుకోసం లింక్డ్‌ఇన్‌లో ఇలా రాసుకొచ్చింది ఆ సంస్థ. మా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ, మేము ఇప్పుడు IIT విద్యార్థులు, అధ్యాపకులందరికీ ఉచిత కృత్రిమ్ (Krurtrim) క్రెడిట్‌లను అందిస్తున్నామని ప్రకటించింది. స్వతంత్ర Android యాప్‌ 2024 సంవత్సరం మేలో సంస్థల నిర్వహణ, పరిశోధనలు, డెవలపర్‌ల కోసం తన సొంత క్లౌడ్ ప్లాట్‌ఫారమ్ Krutrim AI క్లౌడ్‌ను ఓలా ప్రారంభించింది. అదనంగా కంపెనీ తన AI అసిస్టెంట్ కోసం ఒక స్వతంత్ర Android యాప్‌ను కూడా పరిచయం చేసింది. Krutrim ఫౌండేషన్ మోడల్‌లతో సహా అత్యాధునిక AI కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను అందిస్తుంది.ఈ Krutrim భారతదేశంలోనే మొట్టమొదటి AI యునికార్న్. 12 నెలల వ్యవధి ఉచిత క్లౌడ్ క్రెడిట్లతో అర్హత గల విద్యార్థులు, అధ్యాపకులందరూ ₹10,000 విలువైన వన్-టైమ్ క్రెడిట్‌ని అందుకుంటారు. దీనిని 12 నెలల వ్యవధిలో krithrim cloud ప్లాట్‌ఫారమ్‌లో ఉపయోగించుకోవచ్చు.కృతిమ్ అత్యాధునిక AI కంప్యూటింగ్ అవస్థాపన, ఫౌండేషన్ మోడల్‌లు, కృత్రిమ్ క్లౌడ్‌లో హోస్ట్ చేయబడిన ఓపెన్ సోర్స్ మోడల్‌లకు పూర్తిగా యూజ్ చేసుకోవచ్చు. విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు ఈ క్రెడిట్‌లను వారి అధికారిక ఇమెయిల్ చిరునామాల ద్వారా ఉపయోగించుకోవచ్చు. తక్షణమే అమలులోకి వస్తుంది. క్లౌడ్ సేవలకు ఉచిత యాక్సెస్‌ వార్షిక ఫ్లాగ్‌షిప్ ఈవెంట్ సంకల్ప్‌లో, krithrim డెవలపర్‌ల కోసం ₹100 కోట్ల విలువైన ఉచిత క్లౌడ్ సేవలను ప్రకటించింది. అది ఈ ఏడాది నవంబర్ వరకు అందుబాటులో ఉంది. కృత్రిమ్ క్లౌడ్‌లో నిర్మించడానికి వారిని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా, ONDC ప్లాట్‌ఫారమ్ వినియోగదారులకు ఒక సంవత్సరం పాటు క్లౌడ్ సేవలకు ఉచిత యాక్సెస్‌ను ప్రకటించింది. వినూత్న ఆలోచనలతో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి, కంపెనీ ప్రముఖ పెట్టుబడిదారులైన Z47 (గతంలో మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్ ఇండియా), DeVC, సౌత్ పార్క్ కామన్స్ భాగస్వామ్యంతో స్టార్టప్‌ల మొదటి కోహోర్ట్ కోసం ₹50 లక్షలతో ‘కృత్రిమ్ ఫర్ స్టార్టప్‌లు’ - ఉడాన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. క్లౌడ్‌లో 50కి పైగా కొత్త సేవలు భారతదేశంలో ఇన్నోవేషన్‌ను సూపర్‌ఛార్జ్ చేయడానికి krithrim క్లౌడ్‌లో 50కి పైగా కొత్త సేవలను ప్రకటించింది. ఇది భారతీయ డెవలపర్‌లకు అవసరమైన చాలా అప్లికేషన్‌లకు సిద్ధంగా ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సేవల్లో వర్చువల్ మెషీన్‌లు (VMలు), క్లౌడ్ స్టోరేజ్, డేటా రక్షణ కోసం అత్యాధునిక భద్రతా చర్యలు, ఖచ్చితమైన డేటా పర్యవేక్షణ కోసం అత్యాధునిక పరిశీలన వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.