NEWS

WhatsApp: జనవరి నుంచి ఈ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో WhatsApp పని చేయదు..

WhatsApp: మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ అయితే ఇది మీకు ముఖ్యమైన వార్త. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి కొన్ని ఆండ్రాయిడ్ హ్యాండ్ సెట్లలో పనిచేయడం మానేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. అవును, జనవరి 1, 2025 నుండి కిట్‌క్యాట్ నడుస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్‌లలో WhatsApp పని చేయడం ఆపివేస్తుంది. ఈ ఫోన్‌లు పదేళ్ల నాటి ఆపరేటింగ్ సిస్టమ్‌‌తో నడుస్తున్నాయి. అంతేకాక కొత్త అప్‌డేట్‌లను పొందడం లేదు. కొత్త ఫోన్‌కి అప్‌గ్రేడ్: సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే 9 నుంచి 10 ఏళ్ల క్రితం రిలీజైన ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే అందులో వాట్సాప్ రన్ అవ్వదు. మీరు WhatsApp ఉపయోగించడం కొనసాగించాలనుకుంటే, మీరు సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో కొత్త ఫోన్‌కి అప్‌గ్రేడ్ చేయాలి. యాప్ భద్రత, ఇతర అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు WhatsApp తెలిపింది. డేటా సురక్షితం కాదు పాత ఆండ్రాయిడ్ ఫోన్‌లకు WhatsApp సపోర్ట్‌ని ఎందుకు తొలగిస్తోంది? పాత OS-ఆధారిత ఫోన్‌లకు మద్దతును నిలిపివేయడానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే ఇందులో సందేశాలు, మీడియా వంటి సున్నితమైన డేటా అంత సురక్షితం కాదు. కాబట్టి మోటా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ను ఉపయోగించడానికి లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌ను రన్ చేసే ఫోన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌లలో WhatsApp పని చేయదు. - Samsung Galaxy s3, - Motorola Moto G, - HTC One X - Sony Xperia Z. - Samsung Galaxy s3 - Samsung Galaxy Note 2, Samsung Galaxy S4 Mini - Motorola Moto G (ఫస్ట్ మోడల్) - Motorola Razr HD - Moto E 2014 - HTC One X - HTC One - HTC డిజైర్ 500 - HTC డిజైర్ 601 - LG ఆప్టిమస్ G - LG Nexus 4 -LG G2 మినీ -LG L90 -Sony Xperia Z -Sony Xperia SP -Sony Xperia T -Sony Xperia V None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.